• facebook
  • whatsapp
  • telegram

శాతాలు - 1

వందలో భాగంగా వ్యక్తీకరిస్తే!


 


పెట్టుబడి పెడితే వచ్చే ప్రయోజనాన్ని చూసుకోవాలి. అప్పు తీసుకుంటే పడే వడ్డీ భారాన్ని అంచనా వేసుకోవాలి. విక్రయాలను వృద్ధి చేసుకోవాలంటే సంస్థ నష్టపోకుండా వినియోగదారులకు ఆకర్షణీయంగా ఇవ్వాల్సిన డిస్కౌంట్లను నిర్ణయించుకోవాలి. విద్యార్థి ప్రగతిని గుర్తించాలంటే వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులను సరిపోల్చాలి. వీటన్నింటికీ శాతాల లెక్కలు కావాలి. అంటే ఆ సంఖ్యలను వందలో భాగంగా వ్యక్తీకరించాలి. అరిథ్‌మెటిక్‌లో అతి ముఖ్యమైన ఈ అధ్యాయాన్ని నేర్చుకుంటే గణిత ప్రక్రియలపై పట్టు కుదరడంతోపాటు మంచి మార్కులూ వస్తాయి.  

శాతం అంటే ‘నూటికి’ అని అర్థం.  

*  100 హారంగా ఉన్న భిన్నాన్ని శాతం అంటారు. 

*  భిన్నంలో లవాన్ని శాతపు రేటు అంటారు. శాతాన్ని % గుర్తుతో సూచిస్తారు.


ముఖ్యమైన అంశాలు

మాదిరి ప్రశ్నలు

1.   ఒక ఊరి జనాభాలో 60% మంది పురుషులు ఉన్నారు. స్త్రీల సంఖ్య 1600 అయితే ఆ ఊరి జనాభా ఎంత?

1) 2000       2) 2500     3) 4000     4) 3500 

వివరణ: ఊరి జనాభాలో పురుషుల శాతం = 60% 

అప్పుడు స్త్రీల శాతం = 40% అవుతుంది

 స్త్రీల సంఖ్య (40%) = 1600

40% ...... 1600 

(ఊరి జనాభా) 100% ...... ? 

జ: 3

 


2.  విద్యార్థి ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఆ పరీక్షను రీవాల్యుయేషన్‌ చేయడం వల్ల అతడికి ముందు వచ్చిన మార్కుల కంటే 40% తగ్గి ఆ మార్కులు 96గా నిర్ధారించారు. అయితే ఆ విద్యార్థికి ముందు వచ్చిన మార్కుల కంటే ఎన్ని మార్కులు తగ్గిపోయాయి? 

1) 58      2) 68      3) 63      4) 64 

వివరణ: విద్యార్థి ముందుగా పొందిన మార్కులు 100% అనుకుంటే 

రీవాల్యుయేషన్‌ తర్వాత 40% తగ్గి 60% మార్కులు సాధించాడు

60%....... 96 

40% ........ ?

జ: 4


 


3.  శివాత్మిక తన జీతంలో 55% నిత్యావసర వస్తువులు, దుస్తులు, చదువుకు 4 : 2 : 5 నిష్పత్తిలో ఖర్చు పెట్టింది. దుస్తులకు ఖర్చు పెట్టిన మొత్తం రూ.5540 అయితే తన జీతం ఎంత?

1) రూ.55,400       2) రూ.55,500        3) రూ.55,450         4) రూ.55,650 

వివరణ: శివాత్మిక తన జీతంలో 55% మాత్రమే ఖర్చు పెడుతుంది.

నిత్యావసర వస్తువులు, దుస్తులు, చదువుకు 4 : 2 : 5 నిష్పత్తిలో ఖర్చు పెడుతుంది.

ఖర్చు పెట్టిన భాగాల సంఖ్య (4 + 2 + 5) = 11 

 55% ...... 11 

100% ...... ?


దుస్తులకు (2 భాగాలకు) ....... రూ.5540 

20 భాగాలు ....... ?


జ: 1



 


4.  రాఘవి తన జీతంలో 20% పోస్టాఫీస్‌లో, మిగిలిన 10% బ్యాంక్‌లో పొదుపు చేయగా రూ.14,400 ఆమె వద్ద నిల్వ ఉంటే మొత్తం జీతం ఎంత?

1) రూ.19,000      2) రూ.20,000      3) రూ.25,000      4) రూ.30,000 

వివరణ: రాఘవి జీతం రూ. x అనుకుంటే 

20% పోస్టాఫీస్‌లో వేస్తే ఇంకా 80% మిగులుతుంది కాబట్టి
 


   

మళ్లీ 80ను 100%గా పరిగణించి 10%బ్యాంక్‌లో వేస్తే ఇంకా 90% మాత్రమే ఉంటుంది

X = 20,000 

జ: 2


5.  ఎ) ఒక ఊరి జనాభా మొత్తం 3000. ఈ జనాభాను మొదటి సంవత్సరం 20% పెంచి, రెండో సంవత్సరం 25% పెంచితే రెండేళ్ల కిందట ఆ ఊరి జనాభా ఎంత?

 1) 1500     2) 2000      3) 2200     4) 2400 

వివరణ: రెండేళ్ల కిందట ఆ ఊరి జనాభా =X

 

X = 2000  

జ: 2


బి)   ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 160. ఈ సంఖ్యను మొదటి సంవత్సరం 12.5% పెంచి రెండో సంవత్సరం 10%తగ్గిస్తే రెండు సంవత్సరాల తర్వాత ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత?

1) 180      2) 198     3) 189    4) 162 

వివరణ: ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య = 160 


జ: 4


 


6.  చక్కెర ధర 20% పెరగడం వల్ల ఒక గృహిణి దానిపై పెట్టే ఖర్చు స్థిరంగా ఉండాలంటే చక్కెర వాడకాన్ని ఎంత శాతం తగ్గించాలి? 

వివరణ: చక్కెర ధర 100% అనుకుంటే 20% పెరిగింది. కాబట్టి 120% అవుతుంది. పెరిగిన శాతాన్ని తగ్గించుకుంటే ఆమె పెట్టే ఖర్చు స్థిరంగా ఉంటుంది. 

జ: 2

 


7. ఒక ఆఫీసర్‌ జీతం రూ.12,000 పెంచి, అదే సమయంలో ఆదాయపు పన్ను 12% నుంచి 10%కి తగ్గించారు. ఆ ఆఫీసర్‌ ఇంతకుముందు ఆదాయపు పన్ను ఎంత చెల్లిస్తున్నాడో ఇప్పుడు కూడా అంతే చెల్లిస్తే అతడి ప్రస్తుత జీతం ఎంత? (రెండు సందర్భాల్లో 20% జీతాన్ని మినహాయిస్తే)

1) రూ.60,000         2) రూ.66,000      3) రూ.72,000         4) రూ.75,000

వివరణ: ప్రస్తుతం ఆఫీసర్‌ జీతం =X అనుకుంటే

పెరిగిన తర్వాత ఆఫీసర్‌ జీతం X+ 12,000

ఆదాయపు పన్ను 12 % నుంచి 10 %కి తగ్గిస్తే 

12X - 10X = 1,20,000 

2X = 1,20,000

X = 60,000

జ: 1


8.  ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసేవారి సంఖ్య 4800. అందులో 45% మంది పురుషులు ఉన్నారు. వారిలో 60% మంది 25 సంవత్సరాలు లేదా ఆ పైబడినవారు ఉన్నారు. అయితే ఆ కంపెనీలో పనిచేసే 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పురుషుల సంఖ్య ఎంత?

1) 2640      2) 2160     3) 1296      4) 864 

వివరణ: సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసేవారి సంఖ్య = 4800 

అందులో పురుషుల సంఖ్య = 45%
 

పురుషుల సంఖ్యలో 60% మంది 25 సంవత్సరాలు లేదా ఆ పైబడినవారు. అప్పుడు మిగతా 40% మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారే  

జ: 4

రచయిత: దొర కంచుమర్తి

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌