• facebook
  • whatsapp
  • telegram

ర్యాంకింగ్

1. ఒక తరగతిలో దినేశ్‌ పై నుంచి 10వ స్థానంలో, కింది నుంచి 39వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?

1) 45        2) 46      3) 47      4) 48

సాధన: తరగతిలోని బాలుర సంఖ్య

 = (9 +1+ 38) = 48

సమాధానం: 4

2. ఒక పోటీలో అయిదుగురు బాలురు పాల్గొన్నారు. రోహిత్, సంజయ్‌ కంటే వెనుక ఉన్నాడు. వికాస్, దినేశ్‌ కంటే ముందు ఉన్నాడు. కమల్‌ ర్యాంక్‌ రోహిత్, వికాస్‌లకు మధ్య ఉంది. అయితే అందరి కంటే ఎవరు ముందు ఉన్నారు?

1) సంజయ్‌    2) వికాస్‌    3) దినేశ్‌       4) కమల్‌

సాధన: ఇచ్చిన సమాచారం ప్రకారం....

సంజయ్‌ > రోహిత్‌ > కమల్‌>వికాస్‌ >దినేశ్‌

అందరి కంటే ముందు సంజయ్‌ ఉన్నాడు.

సమాధానం: 1

3. ఒక తరగతిలోని బాలురందరూ ఒకే ఒక వరుసలో నిలుచున్నారు. రెండు చివరల నుంచి ఒక బాలుడు 19వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ తరగతిలో ఎంత మంది బాలురు ఉన్నారు?

1) 39      2)  37     3) 38     4) 27

సాధన: తరగతిలోని బాలుర సంఖ్య

(18+1+ 18) = 37 

సమాధానం: 2

4. ఒక పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో అజయ్‌ పై నుంచి 16వ, కింది నుంచి 29వ స్థానంలో ఉన్నాడు. ఆరుగురు బాలురు పరీక్ష రాయలేదు, అయిదుగురు ఉత్తీర్ణులు కాలేదు. అయితే ఆ తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?

1) 48       2) 44      3) 50      4) 55 

సాధన: ఉత్తీర్ణత పొందిన బాలుర సంఖ్య

 (15 + 1+ 28) = 44

∴ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 

 (44 + 6 + 5) = 55

సమాధానం: 4

5. అరవై మంది ఉన్న ఒక తరగతిలో బాలురి కంటే బాలికలు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. పై నుంచి రాజేశ్‌ 17వ స్థానంలో ఉండి, అతడి కంటే ముందు తొమ్మిది మంది బాలికలు ఉంటే ర్యాంకుల్లో అతడి కంటే వెనక ఉన్న బాలుర సంఖ్య ఎంత? 

1) 7       2) 23       3) 12     4) 3 

సాధన: బాలుర సంఖ్య = x అనుకుందాం.

అప్పుడు, బాలికల సంఖ్య = 2x అవుతుంది.

∴ x + 2x = 60

3x = 60 

x = 20 

బాలుర సంఖ్య = 20 

బాలికల సంఖ్య = 40 

రాజేశ్‌ కంటే ముందు తొమ్మిది మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. అంటే

20 - 7 - 1 = 12

సమాధానం: 3

6. 59 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో నితిన్‌ పై నుంచి 28వ స్థానంలో ఉన్నాడు. అయితే చివరి నుంచి అతను ఏ స్థానంలో ఉన్నాడు? 

1) 37     2) 32     3) 19   4) 20 

సాధన: ర్యాంకులో నితిన్‌ వెనుక ఉన్న విద్యార్థుల సంఖ్య 

   59 - 28 = 31

∴ చివరి నుంచి నితిన్‌ 32వ స్థానంలో ఉన్నాడు.

సమాధానం: 2  

7. ఒక వరుసలో A మొదటి నుంచి 18వ స్థానంలో, B చివరి నుంచి 16వ స్థానంలో ఉన్నారు.C మొదటి నుంచి 25వ స్థానంలో ఉండి, A, B లకు సరిగ్గా మధ్యలో ఉన్నట్లయితే ఆ వరుసలో మొత్తం ఎంత మంది ఉన్నారు?

1) 46      2) 48      3) 47     4) 45 

సమాధానం: 3

8. ఒక తరగతిలో కార్తీక్‌ స్థానం మొదటి నుంచి, చివరి నుంచి 10వ ర్యాంకు. అయితే ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?

1) 18      2) 17      3) 19      4) 20

సాధన: (10 + 10) -1 = 20-1 = 19

సమాధానం: 3

9. ఒక వరుసలో నరేంద్ర ఎటువైపు నుంచి చూసినా 18వ స్థానంలో ఉన్నాడు.  గోపాల్‌ కుడివైపు నుంచి 19వ ర్యాంకులో ఉన్నట్లయితే ఎడమవైపు నుంచి అతడి ర్యాంకు ఎంత?

1) 15       2)16    3) 17     4)18

సాధన: వరుసలోని మొత్తం సభ్యుల సంఖ్య

= 18 + 18 - 1 (నరేంద్ర స్థానం ఆధారంగా)

36 -1 = 35

గోపాల్‌ ర్యాంకు కుడివైపు నుంచి = 19

గోపాల్‌ ర్యాంకు ఎడమవైపు 

= 35 - 19  +1 = 17

సమాధానం: 3

10. ఒక తరగతి గదిలో కిశోర్‌ మొదటి నుంచి 18వ ర్యాంకులో ఉన్నాడు. జగదీశ్‌ చివరి నుంచి 11వ స్థానంలో ఉన్నాడు. లక్ష్మి ర్యాంకు కిశోర్‌ కంటే 5 స్థానాల తరువాత, కిశోర్, జగదీశ్‌ల మధ్యలో ఉంది. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు సంఖ్య ఎంత?

1) 36      2) 63     3) 11       4) 38

సమాధానం: 4

11. తోటలోని చెట్ల వరుసలో ఒక చెట్టు రెండు చివర్ల నుంచి అయిదో స్థానంలో ఉంది. అయితే ఆ వరుసలో ఉన్న చెట్ల సంఖ్య?

1) 10      2) 11     3) 12       4) 9


సమాధానం: 4

12. ఒక తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య 42. శ్రీకాంత్‌ స్థానం మొదటి నుంచి 18. అయితే చివరి నుంచి అతడి స్థానం ఎంత?

1) 25        2) 24       3) 23       4) ఏదీకాదు

సాధన: మొత్తం విద్యార్థుల సంఖ్య = 42

మొదటి నుంచి స్థానం = 18

చివరి నుంచి స్థానం 

= 42 - 18 +1 = 25

సమాధానం: 1

13. లీ అనే వ్యక్తి కంటే జు అనే వ్యక్తి పొడవు కానీ ళి కంటే పొడవు కాదు. రి అనే వ్యక్తి దీ కంటే పొడవు కానీ లీ కంటే కాదు. అయితే వీరిలో అత్యంత పొడవైన వ్యక్తి ఎవరు?

1) M        2) D         3) R     4) ఏదీకాదు

సాధన: ఇచ్చిన సమాచారం ప్రకారం..... 

 R>V>M>J>D

  అత్యంత పొడవైన వ్యక్తి = R

సమాధానం: 3

14. సుమిత్‌కు అతడి సోదరుడు రాజు పుట్టిన రోజు మే 20 తర్వాత, మే 28 ముందు అని గుర్తుంది. కానీ ప్రియకు రాజు పుట్టిన రోజు మే 12 తర్వాత, మే 22కి ముందు అని గుర్తుంది. అయితే రాజు అసలైన పుట్టిన రోజు ఎప్పుడు?

1) మే 21    2) మే 22           3) నిర్ణయించలేం    4) ఏదీకాదు

సాధన: సుమిత్‌ ప్రకారం, రాజు పుట్టిన రోజు మే నెలలోని 21, 22, 23, 24, 25, 26, 27 తేదీల్లో ఏదో ఒక రోజు అయి ఉండాలి.

ప్రియ ప్రకారం, రాజు పుట్టిన రోజు మే నెలలోని 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21లలో ఏదైనా ఒక రోజు అయి ఉంటుంది.

∴ రెండింటికీ ఉమ్మడిగా ఉన్న తేదీ మే 21 

∴ రాజు పుట్టిన రోజు మే 21

సమాధానం: 1

15. మోహన్‌ అనే వ్యక్తి ఈ రోజుకు సినిమాను చూసి తొమ్మిది రోజులు అవుతుంది. అతను సినిమాకు వెళ్లేది కేవలం గురువారం మాత్రమే. అయితే ఈ రోజు ఏ వారం అవుతుంది?

1) ఆదివారం      2) శుక్రవారం   3) శనివారం      4) ఏదీకాదు

సాధన:

∴  శేషం 2. అంటే గురువారం నుంచి రెండో రోజు శనివారం.

సమాధానం: 3

16. ముప్పై అయిదు మంది విద్యార్థులున్న ఒక తరగతిలో కునాల్‌ కింది నుంచి 7వ స్థానంలో, సోనాలి పై నుంచి 9వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరికీ సరిగ్గా మధ్యలో పులకిత్‌ ఉన్నట్లయితే అతడి నుంచి కునాల్‌ స్థానం ఎంత?

1) 10     2) 13    3) 14     4) 11 

సాధన: కునాల్, సోనాలి మధ్య విద్యార్థుల సంఖ్య

35 - (7 + 9) = 19

కునాల్, సోనాలి మధ్యలో పులకిత్‌ ఉన్నాడు. అంటే కునాల్, పులకిత్‌: పులకిత్, సోనాలి మధ్య 9 మంది విద్యార్థులు ఉన్నారు.

∴ పులకిత్‌ నుంచి కునాల్‌ 10వ స్థానంలో ఉన్నాడు.          

సమాధానం: 1

17. ఒక టెలివిజన్‌ ప్రోగ్రామ్‌ చూసేందుకు ముస్కాన్‌ తన హోంవర్క్‌ను రాత్రి 10 గంటల కంటే ముందుగానే పూర్తి చేయాలని అనుకుంది. ఆమెకు తన 5 సబ్జెక్టుల్లో ఒక్కో అసైన్‌మెంట్‌ పూర్తి చేసేందుకు పట్టే సమయం 40 నిమిషాలు. అయితే ఆమె ఏ సమయానికి హోంవర్క్‌ ప్రారంభిస్తే, ప్రోగ్రామ్‌ను అనుకున్న సమయానికి చూడగలదు?

1) 7 : 20 PM  2) 6 : 40 PM        3) 6 : 30 PM    4) 7 : 10 PM

సాధన: అయిదు అసైన్‌మెంట్లు పూర్తి చేసేందుకు కావాల్సిన సమయం

40 X 5 = 200 ని., ⇒ 3 గం. 20 ని.

∴ ప్రోగ్రామ్‌ సమయం రాత్రి 10 గంటలు  3 గంటల 20 నిమిషాలు

10 : 00  3 : 20 = 6 : 40

సమాధానం: 2

* ఆంగ్ల అక్షరమాలలో చివరి నుంచి 21 అక్షరాలు, మొదటి నుంచి 20 అక్షరాలు తీసుకుంటే వాటి మధ్యలో ఉండే అక్షరం ఏది?

1) N        2)K          3) M       4) L

Posted Date : 23-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌