• facebook
  • whatsapp
  • telegram

రక్త సంబంధాలు

సూచన (ప్ర. 1 - 3): కింది సమాచారం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోండి. 

ఒక కుటుంబంలో మూడు తరాలకి సంబంధించిన ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారు. K అనే వ్యక్తి G కి కోడలు. M, L కి తండ్రి. L, P కి కోడలు. H అనే వ్యక్తి G కి బావ/ బావమరిది; F కి ఏకైక కొడుకు. T అనే వ్యక్తి F కి మనవడు.H అనే వ్యక్తి అవివాహితుడు. G ఒక పురుషుడు, M కి ఇద్దరు పిల్లలు.


1. M అనే వ్యక్తి G కి ఏమవుతారు?

1) తండ్రి    2) సోదరుడు    3) బావ/ బావమరిది   4) మామయ్య


2. K అనే వ్యక్తి L కి ఏమవుతారు?

1) కూతురు      2) అత్తయ్య      3) కోడలు    4) సోదరి


3. కింది వారిలో M కుమారుడు ఎవరు?

1) H       2)T     3) L      4) G



4. మహేష్‌ కుమారుడు కార్తీక్‌. మహేష్‌ సోదరి చందుకి పవన్‌ అనే కుమారుడు, సీత అనే కుమార్తె ఉన్నారు. పవన్‌ మేనమామ నరేంద్ర. అయితే కార్తీక్, నరేంద్రకి ఏమవుతారు? 

1) మేనమామ    2) మేనల్లుడు      3) కజిన్‌    4) ఏదీకాదు



5. శివ తండ్రి హరి. బీమ్లా కుమారుడు కిరణ్‌. హరి తండ్రి ఈశ్వర్‌. కిరణ్‌ సోదరుడు శివ. అయితే బీమ్లా ఈశ్వర్‌కి ఏమవుతారు?

1) కోడలు       2) తల్లి       3) భార్య      4) వదిన/ మరదలు

సూచన (ప్ర. 6 - 8): కింది సమాచారం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఒక కుటుంబంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. P కుమార్తె Q,  R సోదరుడు B.  A కి అత్త G. A, B భార్యాభర్తలు. Q అంకుల్‌ B. B తండ్రి D. 


6. P, B కి ఏమవుతారు? 

1) బావ/ బావమరిది    2) సోదరుడు    3) సోదరి          4) నిర్ధారించలేం


7. B సోదరుడు C అయితే Q కి R ఏమవుతారు?

1) తండ్రి     2) తల్లి    3) అంకుల్‌    4) ఆంటీ


8. Q తండ్రి P అయితే P కి R ఏమవుతారు?

1) భర్త       2) భార్య    3) మామయ్య     4) అత్తయ్య

 9. A , B భార్యాభర్తలు. B ఏకైక సోదరి C. C కి తల్లి E. E కి ముగ్గురు పిల్లలు ఉన్నారు. C, P ల మేనకోడలు G.  Aకి తోబుట్టువులు లేరు. C కి వివాహం కాలేదు. అయితే P, A కి ఏమవుతారు?

1) అత్తయ్య    2) బావ/ బావమరిది    3) సోదరుడు     4) సోదరి



10. ఒక ఫొటోలోని వ్యక్తిని చూపిస్తూ శైలజ ‘‘ఆమె కుమారుడి తండ్రి నా తల్లికి అల్లుడు’’. అయితే శైలజ ఫొటోలోని వ్యక్తికి ఏమవుతుంది?

1) అత్తయ్య       2) సోదరి     3) అమ్మ       4) ఏదీకాదు


       

11. హరి రమ్యతో ‘మీ తల్లి భర్త సోదరి, నా మేనత్త’ అని చెప్పాడు. అయితే రమ్య హరికి ఏమవుతుంది?

1) సోదరి       2) సోదరుడు     3) భర్త        4) తండ్రి



సూచన (ప్ర. 12 - 13): కింది సమాచారం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

P # Q  : P అనే వ్యక్తి  Q కి కుమారుడు 

P @ Q : Q అనే వ్యక్తి  P కూతురు 

P © Q : P అనే వ్యక్తి  Q తల్లి/ తండ్రి

P $ Q : P  అనే వ్యక్తి  Q కంటే పెద్ద

P * Q : P  అనే వ్యక్తి Q కి భర్త  

P & Q : Q అనే వ్యక్తి  P కోడలు 

P % Q : P అనే వ్యక్తి  Q కి భార్య 

12. A @ B * D & G % E $ F ≠ D అయితే F అనే వ్యక్తి  Aకి ఏమవుతారు?

1) మనవడు     2) కుమార్తె      3) తాతయ్య       4) భార్య 



13. H * M © O $ N # M అయితే N వయసు 20 సంవత్సరాలు. H వయసు 40 ఏళ్లు. O వయసు ఎంత?

1) 18 సం.      2)16 సం.    3) 23 సం.    4) ఏదీకాదు


O అనే వ్యక్తి N కంటే పెద్ద, కాబట్టి O వయసు 20  40 సంవత్సరాల మధ్య ఉంటుంది. 

సమాధానం: 3


సూచన (ప్ర. 14 - 15): కింది సమాచారం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

P + Q  అంటే Q తండ్రి P

 P - Q  అంటే Q సోదరుడు P

P x Q అంటే Q సోదరి P

P ÷ Q అంటే Q తల్లి P


14. A + B ÷ C x D సమాసంలో D కి  A ఏమవుతారు?

1) అంకుల్‌    2) ఆంటీ    3) తాతయ్య     4) తండ్రి

సాధన: దత్త సమాసం


D సోదరి C, C తల్లి B, B తండ్రి A. కాబట్టి D కి A తాతయ్య అవుతాడు.

సమాధానం: 3


15. A - B + C x D  అయితే C కి A ఏమవుతారు?

1) తండ్రి      2) తల్లి       3) సోదరుడి కుమార్తె      4) ఏదీ కాదు

సాధన: దత్త సమాసం


పై వివరణ నుంచి (C అమ్మాయి)

‘C’ కి తండ్రి ‘B’ , ‘B’ కి సోదరుడు ‘ A’ కాబట్టి ‘C’, ‘A’ కి సోదరుడి కుమార్తె అవుతుంది.     

సమాధానం: 3


* Q తండ్రి P. S కుమారుడు R. P సోదరుడు T. R సోదరి Q. అయితే  S అనే వ్యక్తి T కి ఏమవుతారు?

1) వదిన/ మరదలు     2) సోదరుడు   3) కూతురు      4) బావ/ బావమరిది


సమాధానం: 1


* రాజేష్‌ శివతో ‘‘ఆ చంటి బిడ్డను ఎత్తుకున్న స్త్రీ నా కోడలి భర్తకు తల్లి’’ అని చెప్పాడు. అయితే రాజేష్‌కి ఆ స్త్రీ ఏమవుతుంది?

1) భార్య       2) కుమార్తె     3) కోడలు    4) తల్లి


కోడలి భర్త ‘కుమారుడు’. కుమారుడి తల్లి ‘భార్య’ 

సమాధానం: 1


ఒక తరం నుంచి మరోతరానికి ఉండే సంబంధాలను తెలిపే క్రమచిత్రం

             మొదటి తరం — తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ

                   

            రెండో తరం — తల్లి, తండ్రి, పెదనాన్న, బాబాయి, మేనమామ, మామయ్య, మేనత్త, అత్తయ్య, పెద్దమ్మ, పిన్ని 

                  

నేను  మూడో తరం — సోదరి, భర్త, భార్య, బావ, బావమరిది, సోదరుడు, మరదలు, వదిన

                   

            నాలుగో తరం — కూతురు, కొడుకు, కోడలు, అల్లుడు,  మేనకోడలు,మేనల్లుడు

                 

            అయిదో తరం — మనవడు, మనవరాలు

Posted Date : 31-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌