• facebook
  • whatsapp
  • telegram

రేఖాగణితం

ముఖ్యాంశాలు 


ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్న చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజంparallelogram) అంటారు.

పై పటం ABCD లో AB,DC  లు సమాంతర భుజాలు,  BC, AD  లు సమాంతర భుజాలు. కాబట్టి ABCD పటం సమాంతర చతుర్భుజం అవుతుంది.

ABCD సమాంతర చతుర్భుజంలో, i) AB = DC, BC = AD అంటే ఎదురెదురు భుజాలు సమానం.

ii)  ఆసన్న కోణాల మొత్తం 180ా

∠A + ∠B = 180° ∠B + ∠C = 180° ∠C + ∠D = 180° ∠D + ∠A = 180° 

iii)ఎదురెదురు కోణాలు సమానం. 

∠A = ∠C ∠B = ∠D  

iv) కర్ణాలు ( AC,  BD)పరస్పరం  సమద్విఖండన చేసుకుంటాయి. సమాంతర చతుర్భుజ వైశాల్యం = భూమి × సమాంతర భుజాల మధ్య లంబదూరం చ.యూ.

=B× H చ.యూ.

మాదిరి సమస్యలు

1. ABCD సమాంతర చతుర్భుజంలో∠A = 120° అయితే  ∠B, ∠C, ∠D విలువలు వరుసగా..

1) 120°, 60°, 60°   2) 60°, 120°, 60°   3) 60°, 120°, 120° -  4) 60°, 60°, 120° 

సాధన:  ABCD సమాంతర చతుర్భుజంలో∠A = ∠C  (ఎదురెదురు కోణాలు)

∠C = 120° ∠A + ∠B = 180° sA, B( ఆసన్నకోణాలు)

120° + ∠B = 180°

∠B = 180° − 120° = 60° 

∠B = ∠D  (ఎదురెదురు కోణాలు సమానం)

∠D = 60°

∠B = 60°, ∠C = 120°, ∠D = 60° 

సమాధానం: 2

2. ABCD సమాంతర చతుర్భుజంలో AB =12సెం.మీ. BC = 9సెం.మీ  అయితే ఆ సమాంతర చతుర్భుజ చుట్టుకొలత ఎంత? (సెం.మీ.లలో)

1) 21     2) 36      3) 42     4) 48 

సాధన:  ABCD సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి.

AB = DC

DC = 12సెం.మీ

BC = AD

AD = 9సెం.మీ

ABCD చుట్టుకొలత 

= AB + BC + CD + DA

= 12 + 9 + 12 + 9 = 42సెం.మీ

సమాధానం:3

3.ABCD సమాంతర చతుర్భుజంలో ఆసన్నకోణాలు 3 : 2 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ కోణాలు వరుసగా....

1) 72°, 118°  2) 96°, 64°  3) 98°, 64° 4) 108°, 72°

సాధన:  ABCDసమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి = 3 : 2.

ఆ ఆసన్న కోణాలు వరుసగా 3x, 2x అనుకోండి.

3x + 2x = 180° 5x = 180°

 x =180°/5   = 36°  

3x = 3 × 36° = 108°

2x = 2 × 36° = 72°ఆ ఆసన్న కోణాలు = 108°, 72° 

సమాధానం:4

4. PQRS సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానం. అయితే ఆ చతుర్భుజాన్ని ఏమంటారు?

1 సమచతుర్భుజం    2 చతురస్రం     3 దీర్ఘచతురస్రం  4 సమలంబ చతుర్భుజం

సాధన:PQRS సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానం

∠P = ∠Q, ∠Q = ∠R, ∠R = ∠S, ∠S = ∠P ∠P + ∠Q = 180° ∠P + ∠P = 180° 2∠P = 180° ∠P = 90° ∠P = 90° ∠Q = 90°, ∠R = 90°, ∠S = 90°

సమాధానం:3

5.PQRS  సమాంతర చతుర్భుజంలో కర్ణాలు  PQ RSల ఖండన బిందువు ‘O’-. OR =  4 సెం.మీ.  SQ, PR  కంటే 5 సెం.మీ. ఎక్కువ అయితే OS ఎంత?

1) 4.5సెం.మీ. 2) 5.5సెం.మీ.- 3) 6సెం.మీ 4) 6.5 సెం.మీ

OR = 4అయితే OP = 4

⇒ PR = 8 సెం.మీ

SQ = PR + 5

= 8 + 5 = 13 సెం.మీ

SQ = 13 సెం.మీ OS =1/2  × SQ =1/2 × 13  =

6.5సెం.మీ

సమాధానం:4

పటంలో MNOP ఒక సమాంతర చతుర్భుజం. అయితే x, y  విలువలు వరుసగా..... (సెం.మీ.లలో)

1) 6, 9      2) 6, 8     3) 5, 8      4) 5, 9 

సాధన: MNOP ఒక సమాంతర చతుర్భుజం

MN = 3y − 1, NO = 18సెం.మీ PO = 26సెం.మీ  MP = 3x 

సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి,

MN = PO, 

3y = 27

y = 9సెం.మీ 

x = 6సెం.మీ  

MP = NO

3x = 18       x = 18/3

= 6సెం.మీ

y = 9 సెం.మీ

సమాధానం: 1

పటంలో  ABCD ఒక సమాంతర చతుర్భుజం అయితే x, y, z విలువలు వరుసగా...

1) 28°, 104°, 28° 2) 28°, 112°, 28° 3) 25°, 108°, 25° 4) 28°, 102°, 25° 

సాధన: ABCD  ఒక సమాంతర చతుర్భుజం ∠A + ∠B = 180° (ఆసన్నకోణాలు) 

40° + z + 112° = 180° z = 180° − 152° = 28°

∴ z = 28°

∠B = ∠D 112° = y y = 112°

∆ACD లో 40° + x + y = 180° 40° + x + 112° = 180°

x = 180° − 152° = 28°

x = 28°, y = 112°, z = 28° 

సమాధానం: 2

పైపటం  RUNS ఒక సమాంతర చతుర్భుజం అయితే x  విలువ ఎంత?

1) 100°     2) 40°    3) 60°     4) 80° 

సాధన: RUNS  ఒక సమాంతర చతుర్భుజం ∠U, x  లు సదృశ్యకోణాలు అవుతాయి (∴ RU // SN)

∠U = x ⇒ 80° = x ∴ x = 80° 

సమాధానం: 4

పటం  RUNS  ఒక సమాంతర చతుర్భుజం. కర్ణాలు  RN, US  ల ఖండన బిందువు  O. OR = 16, ON = x + y, OS = 20, OU = y + 7.అయితే x, y  విలువలు వరుసగా ......

1) 13 యూనిట్లు, 3 యూనిట్లు     2)3 యూనిట్లు, 13 యూనిట్లు     3) 14 యూనిట్లు, 2 యూనిట్లు     4)14 యూనిట్లు, 13 యూనిట్లు

సాధన:  RUNS ఒక సమాంతర చతుర్భుజం 

సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. కాబట్టి,

OU = OS

⇒ Y + 7 = 20

⇒ y = 20 − 7

y = 13

= 13 యూ.

ON = OR

⇒ x + y = 16

⇒ x + 13 = 16

⇒ x = 16 − 3 = 3యూ.

సమాధానం: 4

Posted Date : 25-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌