• facebook
  • whatsapp
  • telegram

భారత రక్షణ రంగం

భారత రక్షణ మంత్రిత్వ శాఖను 1776లో కోల్‌క‌తాలో స్థాపించారు.
* దీని ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది.
* భారత త్రివిధ దళాధిపతి, సర్వసైన్యాధ్యక్షుడు, సుప్రీం కమాండర్ 'భారత రాష్ట్రపతి'.
* ప్రస్తుత కేంద్ర రక్షణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.
* సహాయ మంత్రి సుభాష్ రామ్‌రావ్ బమ్రే.
* త్రివిధ దళాల ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది.
* టెట్రాట్రక్‌ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సైనికాధికారి జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్.
 నౌకాయాన రంగానికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి డి.కె. జోషి. ఈయన హయాంలో ముంబయి తీరంలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి అగ్నిప్రమాదానికి గురైంది.
* భారత మొదటి కమాండర్ ఇన్ చీఫ్ కె.ఎం. కరియప్ప (1948, జనవరి 15) కమాండర్ ఇన్ చీఫ్ స్థానంలో ప్రస్తుతం ఉన్న పద్ధతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)
తొలి సీడీఎస్ డి.కె. జోషి.
* త్రివిధ దళాలలో అత్యున్నత హోదా 5 స్టార్స్.
* సైనికదళంలో 5 స్టార్స్ పొందినవారు ఫీల్డ్ మార్షల్.
     1) మానెల్ షా (1972)
     2) కె.ఎం. కరియప్ప (1986)
* వైమానిక దళంలో మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జున్‌సింగ్ (2002).


రక్షణదళాలు - ప్రధాన బలాలు

సైనికదళం
1. యుద్ధ ట్యాంకులు: భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ ట్యాంకులు T-53, T-72, T-90.
బ్రిటిషువారి నుంచి భారత్‌కు సంక్రమించిన యుద్ధ ట్యాంకులు Vickor -1, Vickor- 2.
* భారత్ స్వదేశీయంగా తయారు చేసిన తొలి యుద్ధ ట్యాంకు వైజయంతి (1987).
* వైజయంతిని ఆధునికంగా అభివృద్ధి చేసి నూతన యుద్ధ ట్యాంకు 'కర్ణ' పేరుతో నిర్మిస్తున్నారు.
* భారత్‌లో తొలి ఆధునిక యుద్ధ ట్యాంకు అర్జున్ (2006). దీన్ని   మెయిన్ బాటిల్ ట్యాంక్ (MBT) అంటారు. అర్జున్ కవచం పేరు కాంచన్.
T-90 ఇంజిన్‌ను, అర్జున్ కవచాన్ని కలిపి నిర్మించిన యుద్ధ ట్యాంకు భీష్మ (MBT – II).
* తిరువనంతపురంలో నిర్మాణంలో ఉన్న అతి శక్తిమంతమైన యుద్ధ ట్యాంకు అనంత్.
* భారత్‌లో యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారం 'హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ'(హెచ్‌వీఎఫ్). ఇది చెన్నైలోని ఆవడి వద్ద ఉంది.


వైమానిక దళం
* భారత్‌లో ఏకైక విమాన తయారీ సంస్థ 'హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్' (HAL) ను 1958లో స్థాపించారు.
* ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.
* దేశవ్యాప్తంగా 9 చోట్ల ఇవి ఉన్నాయి.
* హైదరాబాద్‌లోని బాలానగర్ వద్ద విమాన రెక్కలు నిర్మిస్తారు.
* హెచ్ఏఎల్ నిర్మించిన తొలి విమానం మారుత్ (1961).
* హెచ్ఏఎల్ నిర్మించిన తొలి యుద్ధ విమానం విపుల్ (1975).
* తొలి పైలట్ రహిత యుద్ధ విమానం లక్ష్య.
* తొలి పైలట్ రహిత నిఘా విమానం నిషాంత్.
* తొలి తేలికపాటి యుద్ధ విమానం తేజస్.
* తేజస్‌ను 'లైట్ కమ్‌బ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA)అంటారు. ఇది అమెరికాలోని ఎఫ్ - 16కు సమానం.
 తేజస్ రూపకర్త తోట హరినారాయణ.
* పైలెట్ రహిత విమానాలను 'అన్ మాన్‌డ్ ఏరియల్ వెహికల్' అని అంటారు.
* తేజస్ నౌకాదళ రూపమే నావెల్ ప్లేన్ (NP – I).
* ప్రస్తుతం భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించే ప్రత్యేక విమానం బోయింగ్ 747. దీన్ని అమెరికా నుంచి కొనుగోలు చేశారు.
* త్వరలో ప్రధానమంత్రి కోసం ఎయిర్ ఇండియా వన్ అనే కొత్త విమానం రానుంది. దీన్ని ఫ్రాన్స్‌కు చెందిన 'ఎయిర్ బస్ కంపెనీ' నుంచి కొనుగోలు చేశారు.
* అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం 'ఎయిర్ ఫోర్స్ ఆన్ కార్' (బీస్ట్ కంపెనీ).
* హెచ్ఏవీ నిర్మించిన తొలి యుద్ధ హెలికాప్టర్ 'హన్సా' (Hansa).
* తొలి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ 'ధృవ్' (Dhruv).
* ఇతర హెలికాప్టర్‌లు రుద్ర, చీతా, చీతల్, చేతక్.

భారత్ విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు
1. రష్యా
* సుఖోయ్ - 30 MKI
* MIG – 29 Heroou
* SA – MKI
2. అమెరికా
    i) సూపర్ హెర్క్యులర్ C – 130J
    ii) C – 17 గ్లోబ్ మాస్టర్
    (ఇది భారత వైమానికాదళంలో అతిపెద్ద విమానం)


యుద్ధ విమానాలు

తేజస్
* ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తేలికపాటి యుద్ధ విమానం.
* హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ దీన్ని తయారు చేసింది.
* దీన్ని మొదట 2001లో ప్రయోగించారు.
* 2016, జులై 2న ఈ యుద్ధ విమానం వాయుసేనలో చేరింది.
* దీని రూపకర్త తోట హరినారాయణ.
* ఈ యుద్ధ విమానంలోని ఇంజన్ పేరు కావేరి.
* అమెరికా యుద్ధ విమానాలైన ఎఫ్ - 16తో సమానంగా ఉన్నందుకు గాను మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ వీటికి 'తేజస్' అని నామకరణం చేశారు.


సరస్
* స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల, యుద్ధ విమానం.
* 'సరస్' అనే కొంగ పేరు మీదుగా దీనికి నామకరణం చేశారు. దీనిలో 14 సీట్లు ఉంటాయి.
* దీన్ని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ రూపొందించింది.


నిషాంత్
* స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొదటి పైలెట్ రహిత యుద్ధ విమానం.
* ఇది గంటకు 150 కిలో మీటర్ల వేగంతో, రాడార్లు కూడా గుర్తించకుండా ప్రయాణిస్తుంది.
* దీన్ని డీఆర్‌డీవో, ఏడీఏ (ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) సంస్థలు రూపొందించాయి.


లక్ష్య
* దీన్ని డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనే సంస్థ అభివృద్ధి చేసింది.
* ఇది పైలెట్ లేకుండా లక్ష్యాలను ఛేదిస్తుంది.
* దీన్ని భారతదేశంలోని త్రివిధ దళాలు ఉపయోగిస్తాయి.


రుస్తుం
* ఇది మానవ రహిత యుద్ధ విమానం.
* దీన్ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.
* భారతదేశంలోని త్రివిధ దళాలు దీన్ని ఉపయోగిస్తాయి.
* ఇది గంటకు 140 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
* భారతదేశంలో రెండు సీట్లు ఉన్న అతి చిన్న విమానం హంస.
* భారతదేశంలో యుద్ధ పైలెట్లుగా నియమించిన తొలి భారతీయ మహిళలు
          1. అవని ఛతుర్వేది (మధ్యప్రదేశ్)
          2. భావనా కాంత్ (బిహార్)
          3. మోహన్ సింగ్ (రాజస్థాన్)


అత్యాధునిక వైమానిక వ్యవస్థలు
తంగుస్కా: అత్యాధునిక విమాన విధ్వంసక ఆయుధ వ్యవస్థ.
అవాక్స్‌: వైమానిక దళంలో అత్యాధునిక రాడార్ వ్యవస్థ.
పాల్కన్: ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన విమానం.


గరుడ కమాండ్ ఫోర్స్
* భారత వైమానిక దళం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సొంత సైనికదళ వ్యవస్థ.
* ఇది విపత్తుల సమయంలో స్పందిస్తుంది.
3) ఫ్రాన్స్
 * రాఫెల్ (Super Sonic)
 మిరేజ్ (2000)
4) బ్రిటన్
* జాగ్వార్
* హాక్ - 132 - ఐ (ఇది సైనిక శిక్షణ విమానం)
5) బ్రెజిల్
* ఎంబ్రాయెర్ - 145
6) జర్మనీ
*  డోర్నియర్
7) ఇజ్రాయెల్
* హీరోస్ (హెలికాప్టర్)


యుద్ధ నౌకలు (War Ships)
* భారత్ నిర్మించిన తొలి స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ సావిత్రి (1947).
* భారత్‌లో అతి వేగవంతమైన యుద్ధనౌక ఐఎన్ఎస్ ప్రహ్లాద్.
* 2016 మేలో 'రామసేతు'పై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక యుద్ధ నౌక ఐఎన్ఎస్ సంధ్యా నాయక్ (విశాఖపట్నం నుంచి వెళ్లింది).
* భారత్ ఇటలీ నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలు
  ఐఎన్ఎస్ దీపక్ - ముంబయి
  ఐఎన్ఎస్ శక్తి - విశాఖపట్నం


 రష్యా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలు
* ఐఎన్ఎస్ జ్యోతి (ముంబయి)
ఐఎన్ఎస్ విక్రమాదిత్య
* భారతదేశంలో అతిపెద్ద యుద్ధనౌక.
* 2014, జూన్ 14న నరేంద్ర మోదీ ఇండియన్ నావీలో ప్రవేశట్టి జాతికి అంకితం చేశారు.
* ఇది రష్యా క్రీవ్ శ్రేణికి చెందిన యుద్ధనౌక.
* ఇది యుద్ధ విమానాలను మోసుకెళ్తుంది.


ఐఎన్ఎస్ విక్రాంత్
* దీన్ని కోచి షిప్‌యార్డులో తయారు చేశారు. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు.


ఐఎన్ఎస్ విరాట్
1986లో బ్రిటిష్ రాయల్ నావీ నుంచి కొనుగోలు చేశారు.
* యుద్ధ విమానాలను మోసుకెళ్లే అతి పురాతన నౌక.
* 2016, అక్టోబరు 23న తన విధుల నుంచి నిష్క్రమించింది.
* దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యుద్ధ నౌకను పురావస్తు ప్రదర్శనశాలగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
* భారత నౌకాదళంలో అధిక కాలం పనిచేసిన యుద్ధ విమాన వాహక నౌక.


ఐఎన్ఎస్ విశాఖపట్నం
* ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్‌సోనిక్ క్షిపణులను అమర్చడానికి ఉపయోగిస్తారు. 
* దీన్ని 2015, ఏప్రిల్ 20న ప్రారంభించారు.
* ముంబయిలోని మజ్‌గావ్‌డాక్ లిమిటెడ్ సంస్థ దీన్ని రూపొందించింది.
* శత్రుదేశ నౌకలను నాశనం చేయగల భారతదేశ అతిపెద్ద యుద్ధనౌక.


ఐఎన్ఎస్ మార్మగోవా
* ప్రపంచంలోనే అత్యాధునిక, స్వదేశి క్షిపణి నాశక యద్ధనౌక.
* ఐఎన్ఎస్ మార్మగోవాను 2016, సెప్టెంబరు 17న ముంబయిలో ప్రారంభించారు.
* దీన్ని విశాఖపట్నంలో ప్రాజెక్టు - 15బి లో భాగంగా అభివృద్ధి చేశారు.


ఐఎన్ఎస్ చెన్నై
* ఇది కోల్‌కతా తరగతికి చెందిన క్షిపణి నాశక యుద్ధనౌక.
 దీన్ని మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ముంబయిలో ప్రారంభించారు.
* స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు.
* దీనిపై సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్, దీర్ఘశ్రేణి క్షిపణలు బరాక్ - 8ను మోహరించారు.
* కోల్‌కతా తరగతికి చెందిన ఇతర యుద్ధ నౌకలు
     1. ఐఎన్ఎస్ కోల్‌కతా
     2. ఐఎన్ఎస్ కోచి
* ప్రపంచాన్ని చుట్టి వచ్చిన భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ తరంగిణి.
* నావికాదళంలో వైద్యసేవలు అందించే నౌక ఐఎన్ఎస్ అశ్విని.
* 2015, డిసెంబరు 23న విధుల నుంచి తొలగించిన భారతదేశంలోని తొలి స్వదేశి యుద్ధనౌక ఐఎన్ఎస్ గోదావరి.
* 2016, జూన్ 29న శత్రు దేశాల జలాంతర్గాములు విధ్వంసం చేసే 'వరుణాస్త్ర' నౌకాదళంలో చేరింది.
* 2016, జులై 12న ఐఎన్ఎస్ కర్ణను భారత నౌకాదళాధిపతి అయిన 'సునీల్‌లంబా' విశాఖ తీరంలోని భీమునిపట్నం నావల్‌బేస్‌లో జాతికి అంకితం చేశారు.


8

నౌక నుంచి నౌకకు
i) ధనుష్: పరిధి 350 - 600 కిలో మీటర్లు (అణుక్షిపణి). పృథ్వీ- II నౌకాదళ రూపమే ధనుష్.
జలాంతర్గామి నుంచి జలాంతర్గామికి
i) సాగరిక (K - 15) అణు క్షిపణి పరిధి 700 కిలో మీటర్లు. సాగరిక భూ ఉపరితల రూపమే 'శౌర్య'. ఇలాంటి క్షిపణి ఉన్న దేశాల్లో మనదేశం ఆరోది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, యూకేలో ఉన్నాయి.
ii) K - 4 పరిధి 2000 కిలో మీటర్లు (అణు క్షిపణి).
బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (BMD)
దీనిలో రెండు దశలు ఉన్నాయి.
(i) పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ (PAD)
ఈ దశలో 2500 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చే శత్రువు భారీ క్షిపణిని భూ ఉపరితలం నుంచే 50 - 80 కిలో మీటర్ల ఎత్తులో ఉండగానే పేల్చి వేయవచ్చు.
(ii) అడ్వాన్సుడ్ ఎయిర్ డిఫెన్స్ (AAD)
ఈ దశలో 5000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను 30 కిలో మీటర్ల ఎత్తులోనే పేల్చివేయవచ్చు.
ఐఎన్ఎస్ అరిహంత్
* భారతదేశ స్వదేశి అణు జలాంతర్గామి
* 2009, జులై 26న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రారంభించారు.
* దీన్ని విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో నిర్మించారు.
* అణు జలాంతర్గాములు కలిగిన ఆరో దేశం భారత్.
మొదటి ఐదు దేశాలు: అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా, చైనా.


ఐఎన్ఎస్ కల్వరి
* దీన్ని ముంబయిలోని మజ్‌గావ్‌డాక్ నిర్మించింది.
* 2016, సెప్టెంబరులో జలప్రవేశం చేసింది.
* దీన్ని ఫ్రాన్స్ దేశ సహకారంతో నిర్మించారు.
అతుల్య
* అతుల్య అనే గస్తీ నౌకను కోచి షిప్‌యార్డులో నిర్మించారు.
* 2016, అక్టోబరు 21న లాంఛనంగా జాతికి అంకితం చేశారు.
* 2016, అక్టోబరు 31న అధికారికంగా తీరగస్తీ దళానికి అప్పగించారు.
* ఇది 2016, నవంబరు 14 నుంచి సాగర తీరంలో విధుల్లో చేరింది.
* భారత్ అశ్విన్ క్షిపణి ప్రయోగం ద్వారా ఈ వ్యవస్థను సాధించింది.


ఏఏడీ వ్యవస్థ కలిగిన దేశాలు
   1) అమెరికా
   2) రష్యా
   3) ఇజ్రాయెల్
   4) భారత్
* భారతదేశం రూపొందించిన రాడార్‌లు
i) రాజేంద్ర      ii) ఇంద్ర      iii) ఇంద్ర - 2      iv) రేవతి      v) రోహిణి
* ఇంద్ర అంటే ఇండియన్ డాప్లర్ రాడార్. వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో తయారు చేస్తారు.
* 'తంగుస్కా' అనే యుద్ధ పద్ధతిని రష్యా నుంచి స్వీకరించారు.


ఐఎన్ఎస్ సంయుక్త
దీనిలో సుమారు 100 సైనిక ట్రక్కులు ఉపయోగిస్తారు. ఈ ట్రక్కులపై ఉండే యాంటీనాలు శత్రువుల ఎలక్ట్రానిక్ వ్యసవ్థను ఛిన్నాభిన్నం చేస్తాయి.
MARS (Middle Air Refueling System)
* ఈ పద్ధతిలో గగనతలంలో ఎగురుతున్న జెట్ విమానాలకు కావలసిన ఇంధనాలను మరొక విమానంతో నింపవచ్చు. దీని కోసం IL78 (Illusion)ను రష్యా నుంచి దిగుమతి చేశారు.


భారతదేశం - క్షిపణి వ్యవస్థ

* భారత క్షిపణి శాస్త్ర పితామహుడు ఏపీజే. అబ్దుల్ కలాం. కలాం ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ 1983లో 'ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం' (IGMDP) ను ప్రారంభించారు.
* దీని కింద పని చేసే సంస్థలు నావెల్ రీసెర్చ్ బోర్డు (1996).
i) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)
* దీన్ని 1958లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది.
* దీని ఇతర కేంద్రాలు హైదరాబాద్, బెంగళూరు, డెహ్రడూన్.
ii) డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీస్ (DRDL)
ఇవి దేశవ్యాప్తంగా 52 ఉన్నాయి.
iii) భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)
* ఇక్కడ నిర్దేశిత క్షిపణి గైడెడ్ మిస్సైల్స్‌ను నిర్మిస్తున్నారు. ఇది హైదరాబాద్‌లో ఉంది.
* భారత్‌లో ఏకైక క్షిపణి కేంద్రం ఇంటరిమ్ టెస్ట్ రేంజ్ సెంటర్ (ITR).
* ఇది ఒడిశాలోని రెండు ప్రదేశాల్లో ఉంది.
    i) బాలాసోర్ జిల్లా చాందీపూర్, వీలర్ దీవి (కలాం దీవి).
   ii) గంజాం జిల్లాలోని గోపాలపూర్‌లో ఉంది.
రెండో ITRను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో నిర్మించనున్నారు.
* 1988లో భారత్ నిర్మించిన తొలి క్షిపణి 'పృథ్వీ దీని పరిధి 150 కిలో మీటర్లు.
ఆకృతిని బట్టి క్షిపణులు రెండు రకాలు
     i) ఏరో డైనమిక్
     ii) బాలిస్టిక్
i) ఏరో డైనమిక్ క్షిపణులు రాకెట్ ఆకారంలో ఉంటాయి. ఇవి నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదిస్తాయి.
ii) బాలిస్టిక్ క్షిపణి స్తూపాకారంలో (Cylinder) ఉంటుంది. ఇది అత్యధిక విధ్వంసాన్ని సృష్టిస్తుంది.
గమనాన్ని బట్టి క్షిపణలు 5 రకాలు
i) ఉపరితలం నుంచి ఉపరితలం (1983 నుంచి 1988 ఫిబ్రవరి 25వరకు)
* పృథ్వీ - I పరిధి 150 కిలో మీటర్లు. దీన్ని సైన్యం నుంచి 2011లో తొలగించారు. (ఆర్నీ వర్షన్) 1000 కేజీలు
* పృథ్వీ - II పరిధి 250 - 600 కిలోమీటర్లు.
* మొదట దీని పరిధి 250 కిలోమీటర్లు తర్వాత 300 - 600 కిలో మీటర్లకు పెంచారు. ఇది భారత్‌లో తొలి అణుక్షిపణి (ఎయిర్‌ఫోర్స్ వర్షన్) 500 కేజీలు.
* పృథ్వీ - III పరిధి 350 కిలో మీటర్లు (నావెల్ వర్షన్).


అగ్ని
*  అగ్ని - I పరిధి 700 - 800 కిలో మీటర్లు.
*  అగ్ని - II పరిధి 2000 - 2500 కిలో మీటర్లు.
*  అగ్ని - II A పరిధి 2500 కిలో మీటర్లు.
*  అగ్ని - III పరిధి 3500 కిలో మీటర్లు (అణు క్షిపణి).
*  అగ్ని - IV పరిధి 4000 కిలో మీటర్లు (అణు క్షిపణి).
*  అగ్ని -V పరిధి 5000 కిలో మీటర్లు (అణు క్షిపణి).
 అగ్ని - V పొడవు 17.5 మీటర్లు, 1500 కేజీల బరువు 2.5 మీటర్ల వెడల్పులో ఉంది.
*  అగ్ని - VI పరిధి 6000 - 9000 కిలో మీటర్లు.
* భారత్‌లో తొలి ఇంటిగ్రేటెడ్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM) క్షిపణి అగ్ని - V .
* ప్రాజెక్టు డైరెక్టర్ టెస్సీ థామస్. (బిరుదు - అగ్నిపుత్రి)
* భారత్ భవిష్యత్‌లో నిర్మించే భారీ క్షిపణులు
     సూర్య - 1, 2, 3 ; 5,000, 10,000, 12,000 కిలో మీటర్లు
      కాళి - 1, 2, 3 ; 10,000 15,000, 20,000 కిలో మీటర్లు


నాగ్ (NAG):
మూడో తరం 'ఫైర్ అండ్ ఫర్గెట్'.
* పరిధి 4 నుంచి 7 కిలో మీటర్లు.
* భారత్‌లో తక్కువ పరిధి గల క్షిపణి.
* భారత్‌లో ఏకైక యాంటీ ట్యాంక్ మిస్సైల్ (ATM).


శౌర్య:
* పరిధి 700 కిలో మీటర్లు.
ప్రహార్:
* పరిధి 150 కిలో మీటర్లు.
* ఇది ఒకేసారి శత్రువుపై 6 బాంబులను ప్రయోగించగలదు.
* ప్రహార్‌ను 'పృథ్వీ - I' స్థానంలో సైన్యంలో ప్రవేశపెట్టారు.


పినాక (PINAKA):
* పరిధి 45 కిలో మీటర్లు.
* ఇది ఒకేసారి 12 బాంబులను ప్రయోగించగలదు.


బ్రహ్మోస్ - I
* భార‌త్‌లోని బ్ర‌హ్మ‌పుత్ర‌, ర‌ష్యాలోని మాస్కోవా అనే న‌దుల పేరు మీద‌గా దీనికి ఈ పేరు పెట్టారు.
* దీని పరిధి 280 - 300 కిలో మీటర్లు.
* దీని సగటు - 290 కిలో మీటర్లు.
* 2001లో భారత్, రష్యాలు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి.
* ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.శివథానుపిళ్త్లె.
* ఇది ప్రపంచంలో ఏకైక సూపర్ సోనిక్ క్షిపణి.
* దీన్ని ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయోగించవచ్చు.
* 2016, జూన్ 25న సుఖోయ్ యుద్ధ విమానంలో బెంగళూరులో గగన విహారం చేసింది.


నిర్భయ్
* దీని పరిధి 1000 కిలో మీటర్లు.
* దీన్ని ఎక్కడివరకైనా ప్రయోగించవచ్చు.
* ప్రయాణ మార్గం "S" ఆకారంలో ఉంటుంది.
ii) ఉపరితలం నుంచి ఆకాశం
త్రిశూల్: 5 - 9 కిలో మీటర్లు (5.5 కేజీల, వార్ హెడ్).
ఆకాశ్: 25 - 30 కిలో మీటర్లు (55 కేజీలు).
లక్ష్య: 150 కిలో మీటర్లు (350 కేజీలు).
* ఇది భారత తొలి ఇంటర్ క్యాప్టర్ క్షిపణి శత్రు క్షిపణులను ముందుగానే పసిగట్టి పేల్చివేస్తుంది.


అశ్విన్:
* దీని పరిధి 75 నుంచి 150 కిలో మీటర్లు.
* దీన్ని తొలిసారి 2016, మే 15న ఒడిశాలోని వీలర్ దీవి (కలాం దీవి) నుంచి విజయవంతంగా పరీక్షించారు.
* ఇది శత్రువు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను 30 కిలో మీటర్ల ఎత్తులో ఉండగానే పేల్చివేస్తుంది.


LR - SAM (లాంగ్ రేంజ్ - సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్)
* దీని పరిధి 75 - 100 కిలో మీటర్లు.
* దీన్ని భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇజ్రాయెల్‌లో నిర్మించాయి.
* భారత్‌లో 2015, డిసెంబరు 30న కోల్‌కతా తీరంలో తొలిసారిగా ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధనౌక నుంచి ప్రయోగించారు.
iii) ఆకాశం నుంచి ఆకాశం
అస్త్ర: దీని పరిధి 80 - 150 కిలో మీటర్లు. ఇది భారత్‌లో అతిచిన్న క్షిపణి. పొడవు 3.5 మీట‌ర్లు.
LR AAM (లాంగ్ రేంజ్ - ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్):
* దీని పరిధి 150 - 250 కిలో మీటర్లు.
* భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్మించాయి.


యుద్ధ విమాన వాహక నౌకలు
* భారత్ నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్.
ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న నౌకలు
   i) ఐఎన్ఎస్ విరాట్
   ii) ఐఎన్ఎస్ జలాశ్వ (అమెరికా నుంచి కొనుగోలు చేశారు)
   iii) ఐఎన్ఎస్ విక్రమాధిత్య (రష్యా నుంచి కొనుగోలు చేశారు)
   iv) ఐఎన్ఎస్ విక్రాంత్ (స్వదేశి)
* ఐఎన్ఎస్ విక్రాంత్‌ను 2015, ఆగస్టు 20న ప్రధాని మోదీ ముంబయి తీరంలో ప్రవేశపెట్టారు.


క్షిపణి వాహక నౌకలు
*  ఐఎన్ఎస్ విపుల్
*  ఐఎన్ఎస్ నాశక్
గూఢచారి నౌకలు ఐఎన్ఎస్ శివాలిక్
* ఐఎన్ఎస్ సహ్యాద్రి
* ఐఎన్ఎస్ సాత్పూరా


భారత్ నిర్మించిన తీరగస్తీ నౌకలు
* రాణి గైడెన్యూ
* రాణి రాస్మణి
* రాణి అబ్బక్క
ఐఎన్ఎస్ విజిత్
* రాణి దుర్గావతి
* ముంబయి తీరంలో ఓడల నుంచి జారిన చమురును సంగ్రహించే ప్రత్యేక నౌక సముద్ర ప్రహార్.
   (Guardian of the Arebian Sea)
* పశ్చిమ తీరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రారంభించిన కొత్తనౌక ఐఎన్ఎస్ సమర్థ్.


జలాంతర్గాములు
* జలాంతర్గామి రూపకర్త డేవిడ్ బుష్‌నెల్ (అమెరికా).
* భారత్ రూపొందించిన తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ షల్కి (1992).
* ఇతర జలాంతర్గాములు


ఐఎన్ఎస్ సింధుఘోష్
* ఐఎన్ఎస్ సింధు శాస్త్రి
* ఐఎన్ఎస్ సింధుశ్రీ
* భారత్ 2009లో నిర్మించిన తొలి అణు జలాంతర్గామి 'ఐఎన్ఎస్ అరిహంత్'.
* రష్యా నుంచి కొనుగోలు చేసిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్ర.
* శత్రు జలాంతర్గాములను పేల్చివేసే సామర్థ్యం ఉన్న భారత తొలి యుద్ధనౌక ఐఎన్ఎస్ క్యాడ్మెట్ (Anti Submerine Warship).

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌