• facebook
  • whatsapp
  • telegram

సంగం యుగం

1. సంగం యుగం నాటి కవి, పండితులను పోషించిన రాజవంశం ఏది?
జ: పాండ్య
 

2. 'సంగం' గురించి మొదట ప్రస్తావించింది ఎవరు?
జ: తిరునావుక్కరసు
 

3. సంగం అంటే...?
జ: కవి పండిత పరిషత్
 

4. మొదటి సంగాన్ని ఎక్కడ నిర్వహించారు?
జ: తెన్‌మదురై
 

5. రెండో సంగానికి సంబంధించి లభిస్తున్న ఏకైక గ్రంథం ఏది?
జ: తొల్కప్పియర్
 

6. కిందివాటిలో సంగం సాహిత్యంలో భాగం కానిది?
      ఎ) ఎట్టుతొగై       బి) పత్తుప్పాట్టు       సి) పదినెన్ కీల్‌కనక్కు       డి) మత్తవిలాస ప్రహసనం
జ: డి (మత్తవిలాస ప్రహసనం)
 

7. తొల్కప్పియం గ్రంథం ఏ విషయానికి సంబంధించింది?
జ: వ్యాకరణం
 

8. మధురైక్కంజి గ్రంథ రచయిత ఎవరు?
జ: మంగుడి మరుదన్
 

9. సంగం యుగం నాటి 'కురింజి' విభాగం దేనికి సంబంధించింది?
జ: కొండలు
 

10. కురల్ గ్రంథ రచయిత ఎవరు?
జ: తిరువళ్లువార్
 

11. తమిళ భూమికి చెందిన బైబిల్‌గా ప్రసిద్ధిచెందిన గ్రంథం ఏది?
జ: తిరుక్కురల్
 

12. శిలప్పధికారం గ్రంథ రచయిత ఎవరు?
జ: ఇలంగో అడిగల్
 

13. సంగం యుగం నాటి లలితకళల అభివృద్ధి గురించి తెలిపే గ్రంథం ఏది?
జ: మణిమేఖలై
 

14. దక్షిణ భారత రాజ్యాల్లో మెగస్తనీస్ పేర్కొన్న మొదటి రాజ్యం ఎవరిది?
జ: పాండ్యులు
 

15. తమిళ రాజ్యాల గురించి ప్రస్తావించిన మొదట శాసనం ఏది?
జ: అశోకుని శాసనాలు
 

16. నక్కీరర్ ఎవరి ఆస్థాన కవి?
జ: నెడుం జెళియన్
 

17. సంగం యుగం నాటి చోళుల రాజధాని?
జ: ఉరయూర్
 

18. సంగం యుగం నాటి చోళుల్లో ప్రసిద్ధుడు?
జ: కరికాలుడు
 

19. చేర రాజుల రాజధాని ఏది?
జ: వంజి
 

20. చేర రాజుల్లో గొప్పవాడు ఎవరు?
జ: సెంగుట్టువాన్
 

21. చోళుల భూభాగాన్ని ఏమని పిలిచేవారు?
జ: తొండై మండలం
 

22. కొర్కై (Korkai) ఎవరి ఓడ రేవు?
జ: పాండ్యులు

23. చోళుల రాజ చిహ్నం ఏది?
జ: పులి
 

24. సంగం యుగంలో రాజు పుట్టినరోజు సంబరాలను ఏమని పిలిచేవారు?
జ: పెరునాల్
 

25. రాజ్యాన్ని ఎలా విభజించారు?
జ: మండలం
 

26. తీర ప్రాంత పట్టణాన్ని ఏమని పిలిచేవారు?
జ: పట్టిణం
 

27. సంగం యుగంలో రథాలను లాగేందుకు ఉపయోగించిన జంతువులు ఏవి?
      ఎ) ఎద్దులు       బి) గుర్రాలు       సి) ఎ, బి       డి) ఏనుగులు
జ: సి (ఎద్దులు, గుర్రాలు)
 

28. సైనికుల శరీరాన్ని కాపాడటానికి ఏ జంతువు చర్మంతో తయారుచేసిన కవచాన్ని వాడేవారు?
జ: పులి
 

29. యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం పాతే రాళ్లను ఏమని పిలిచేవారు?
జ: వీరక్కల్
 

30. సంగం యుగంలో కిందివాటిలో క్రూరమైన నేరం కానిది?
జ: పన్నులు చెల్లించకపోవడం
 

31. సంగం యుగంలో రైతులను ఏమని పిలిచేవారు?
జ: వెల్లాలర్
 

32. సంగం యుగంనాటి ముఖ్య దేవత?
జ: మురుగన్
 

33. కిందివాటిలో మురుగన్‌కు మరో పేరు కానిది?
      ఎ) కార్తికేయ       బి) సుబ్రమణ్యం       సి) స్కంద       డి) భాస్కర
జ: డి (భాస్కర)
 

34. సంగం కాలంలో కృష్ణుడిని పూజించిన వర్గం?
జ: గొర్రెల కాపరులు
 

35. ఉరయూర్ ఏ వ్యాపారానికి ప్రసిద్ధిగాంచింది?
జ: నూలు వస్త్రాలు

36. సంగం యుగంనాటి తమిళులు ఏ దేశంతో విదేశీ వ్యాపారం నిర్వహించలేదు?
జ: చైనా

37. సంగం యుగంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన గ్రీకు, రోమన్ వర్తకులను తమిళ సాహిత్యంలో ఏమని పేర్కొన్నారు?
జ: యవనులు

38. సంగం సాహిత్యంలో గొప్ప పురాణ గ్రంథం కానిది?
జ: పత్తుప్పాట్టు

39. సంగం యుగం చివరి కాలంలో చేర రాజులతో నిరంతరం యుద్ధాలు చేసిన రాజవంశం ఏది?
జ: పాండ్య

40. సంగం యుగంనాటి గూఢచారులను ఏమని పిలిచేవారు?
జ: ఒర్రర్

41. మండలాన్ని ఎలా విభజించారు?
జ: నాడు

42. చోళరాజు కరికాలుడు కావేరి నదిపై నిర్మించిన ఆనకట్ట వల్ల నీటిపారుదల సౌకర్యం పొందిన ప్రాంతం ఏది?
జ: దక్షిణ తంజావూర్

43. సంగం యుగ కాలంలో రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసిన జంతువు/ పక్షి ఏది?
జ: నెమలి

44. క్రీ.పూ.20లో రోమన్ చక్రవర్తి అగస్టస్ ఆస్థానానికి రాయబారిని పంపిన తమిళ రాజు ఏ రాజ్యానికి చెందినవాడు?
జ: పాండ్య

45. కిందివాటిలో ప్రధానంగా దిగుమతి చేసుకున్నది?
      ఎ) బంగారం, వెండి       బి) కుండలు       సి) మద్యం       డి) వస్త్రాలు
జ: ఎ (బంగారం, వెండి)

46. కన్నగి విగ్రహాన్ని రూపొందించడానికి హిమాలయాల నుంచి రాయిని తీసుకువచ్చినట్లుగా ఏ చేర రాజు గురించి చెబుతారు?
జ: సెంగుట్టవాన్

47. రోమన్లు ఏ విషయంలో భారతీయ జీవనాన్ని, సంస్కృతిని పెద్దగా ప్రభావితం చేయలేదు?
జ: అలంకరణ

48. కింది సంగం యుగం నాటి గ్రంథాల్లో బౌద్ధ మతం గురించి గొప్పగా పేర్కొన్నది?
      ఎ) మణిమేఖలై       బి) శిలప్పధికారం       సి) కురల్       డి) తొల్కప్పియం
జ: ఎ (మణిమేఖలై)

49. పుహార్‌లో ఏ దేవుని గౌరవార్థం గొప్ప పండుగను నిర్వహించినట్లు సంగం పురాణాల్లో పేర్కొన్నారు?
జ: ఇంద్రుడు

50. ఎక్కడ నిర్వహించిన పురావస్తు తవ్వకాలు దక్షిణ భారతదేశంతో రోమన్‌ల వ్యాపారం గురించి తెలియజేయడం లేదు?
జ: పల్లవనేశ్వరం

51. పుహార్‌లోని మత్స్యకారుల జీవితం గురించి తెలియజేసే గ్రంథం ఏది?
జ: పట్టినప్పాలై

52. సంగం యుగం నాటి ప్రధాన ఎగుమతుల్లో ఒకటి కానిది?
జ: ఉల్లిపాయలు

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌