• facebook
  • whatsapp
  • telegram

చక్రవడ్డీ

 తిరిగి తిరిగి పెరిగే వడ్డీ!

బ్యాంకులో సొమ్ము డిపాజిట్‌ చేశారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆస్తి తాకట్టు పెట్టి నెలవారీ చెల్లింపులు చేస్తున్నారు. పదవీ విరమణ అనంతర ప్రయోజనాల కోసం డబ్బు కడుతున్నారు. వీటన్నింటిలో దాదాపుగా చక్రవడ్డీనే లెక్కగడతారు. ఆ విధంగా వచ్చే రాబడులు, చెల్లింపుల గురించి సరైన అంచనా ఉండాలంటే వడ్డీపై వడ్డీ వర్తింపజేసే చక్రవడ్డీ గురించి తెలియాలి. అప్పుడే సరైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోగలుగుతారు. నిత్యజీవితంలో ఎదురయ్యే అలాంటి సంఘటనల ఆధారంగా ఈ అంకగణిత ప్రక్రియల అనువర్తనలను అర్థం చేసుకుంటే, పోటీ పరీక్షల్లో అభ్యర్థులు సులభంగా సమాధానాలను గుర్తించగలుగుతారు 

ఒక నిర్ణీత గడువు తరువాత అయిన మొత్తానికి, మొదట్లో అప్పు తీసుకున్న డబ్బుకు ఉండే తేడాను ఆ గడువుకు అయిన ‘చక్రవడ్డీ’ అని అంటారు. 

అసలు = P,  వడ్డీరేటు = ఏడాదికి R %,  కాలం (T) = n సంవత్సరాలు

a) ప్రతీ సంవత్సరానికి వడ్డీ సమ్మేళనం చేస్తే 

b) ప్రతీ అర్ధ సంవత్సరానికి వడ్డీ సమ్మేళనం చేస్తే 

c) ప్రతీ త్రైమాసికానికి వడ్డీ సమ్మేళనం చేస్తే 

d)  ప్రతీ సంవత్సరానికి వడ్డీ సమ్మేళనం చేస్తూ కాలం భిన్నంగా ఉంటే 

చక్రవడ్డీకి సమాన వాయిదాల్లో తిరిగి చెల్లింపు

సమాన వాయిదా = x అనుకుంటే

కాలం (T)  = n సంవత్సరాలు

అసలు (P)

గమనిక: ఒక సంవత్సర కాలానికి బారువడ్డీ, చక్రవడ్డీలు సమానం.


  మాదిరి ప్రశ్నలు   
 


1.  అరవింద్‌ బ్యాంకులో సంవత్సరానికి 5% చక్రవడ్డీ రేటు చొప్పున రూ.8000 డిపాజిట్‌ చేస్తే రెండేళ్ల తర్వాత అతడు పొందే మొత్తం ఎంత?

1) రూ.8600    2) రూ.8820    3) రూ.8800    4) రూ.8840 

జ: 2


2.   ఒక వ్యక్తి సంవత్సరాంతంలో తను ఆదా చేసిన రూ.200 లను ప్రతి ఏడాదీ 5% చక్రవడ్డీకి అప్పు ఇస్తాడు. 3 సంవత్సరాల తర్వాత ఆ ఆదా ఎంత అవుతుంది?

1) రూ.565.25    2) రూ.635    3) రూ.662.025    4) రూ.666.50

వివరణ: మొదట సంవత్సరం ఆదా చేసింది = రూ.200

వడ్డీరేటు = 5%

= 231.525

రెండో ఏడాది ఆదా చేసింది = రూ.200

వడ్డీరేటు (R) = 5%

n = 2

మూడో సంవత్సరంలో ఆదా చేసింది = రూ.200

మూడో ఏడాది చివర అన్నారు కాబట్టి

R = 5% pa

3 సంవత్సరాల తర్వాత అతడి ఆదా = 231.525 +  220.5 + 210 = రూ.662.025

జ: 3


3.  కొంత అసలుపై రెండేళ్లలో 4% (సంవత్సరానికి) చొప్పున చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య భేదం రూ.1 అయితే అసలు ఎంత?

1) రూ.625   2) రూ.630    3) రూ.640    4) రూ.650

వివరణ: చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య భేదం

జ: 1


4.  ఏ వడ్డీరేటు మీద అసలు రూ.5000 లపై 2 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ, సాధారణ వడ్డీల భేదం రూ.72 అవుతుంది?

1) 8%   2) 10%   3) 12%     4) 6%

వివరణ: అసలు = రూ.5000

కాలం = 2 సంవత్సరాలు

రెండేళ్లకు చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య భేదం = రూ.72

జ: 3


5.  6% నామ మాత్రపు వడ్డీ రేటుకు అనురూపమైన, అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే సార్ధక వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత?

1) 6.09%   2) 8.06%   3) 3%    4) 6%

వివరణ: వడ్డీ రేటు (R) = 6% (సంవత్సరానికి)

వడ్డీ రేటు (R) = 3% (అర్ధ సంవత్సరానికి)

అసలు (P) = రూ.100 అనుకుంటే

జ: 1

6.  చక్రవడ్డీకి పెట్టుబడి పెట్టిన దానిపై మూడేళ్లలో రూ.800; 4 సంవత్సరాలకు రూ.840 వడ్డీ వచ్చింది. అయితే సంవత్సరానికి వడ్డీరేటు ఎంత? ​​​​​​​
వివరణ: 4 సంవత్సరాలు - రూ.840

R = 5%

జ: 3


7.  చక్రవడ్డీకి పెట్టిన పెట్టుబడి మూడేళ్ల తర్వాత రూ.13,380; 6 సంవత్సరాలకు రూ.20,070 మొత్తం అయితే పెట్టుబడి ఎంత?

1) రూ.8800    2) రూ.8890    3) రూ.9000    4) రూ.8920

​​​​​​​

P = రూ.8920

జ: 4


8.  ఒక వ్యక్తి రూ.2550 లను సంవత్సరానికి 4% వడ్డీరేటు చొప్పున తీసుకున్న డబ్బును రెండు వార్షిక సమాన వాయిదాల్లో రెండేళ్లకు తీర్చాల్సి వస్తే ప్రతీ వాయిదా ఎంత?

1) రూ.1352    2) రూ.1000    3) రూ.4990    4) పైవేవీకావు

వివరణ: అసలు(P) = 2550

వడ్డీరేటు (R) = 4%

వాయిదాల సంఖ్య (n) = 2

చక్రవడ్డీలో సమాన వాయిదాలకు సూత్రం

​​​​​​​

జ: 1


9.  శివ కొంత డబ్బును కొంత వడ్డీరేటుతో అప్పుగా ఇస్తే వచ్చే చక్రవడ్డీకి అదే డబ్బుపై వచ్చే సరళ వడ్డీకి తేడా వరుసగా 3, 2 సంవత్సరాలకు   25 : 8గా గుర్తిస్తే వడ్డీ రేటు ఎంత?

1) 10%   2) 11%   3) 12%   4) 12.5%

వివరణ: 2, 3 సంవత్సరాల కాలానికి మధ్య భేదం

 
రచయిత : కంచుమర్తి దొర

Posted Date : 26-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌