• facebook
  • whatsapp
  • telegram

సూపర్ కంప్యూటర్స్

* ఇది ప్రోగ్రాంలను అతివేగంగా చేస్తుంది.
* సూపర్ కంప్యూటర్‌ను 'సీమోర్ క్రే' అనే అమెరికా శాస్త్రవేత్త కనుక్కున్నారు.
* ఇతడు రూపొందించిన తొలి సూపర్ కంప్యూటర్ CDC (Controls Data Corporation) 6600.
* సూపర్ కంప్యూటర్‌లలో అనేక ప్రాసెసర్‌లను సమాంతరంగా కలపడం వల్ల వాటి సామర్థ్యం ఎక్కువగా  ఉంటుంది.
* సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని కొలవడానికి 'FLOPS' (Floating Points per Second) ఉపయోగిస్తారు.


భారతదేశంలో సూపర్ కంప్యూటర్‌లు
i) పరమ్ సూపర్ కంప్యూటర్‌:
* దీన్ని మహారాష్ట్రలోని 'పూణె'లో ఉన్న 'సెంటర్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్' (CDAC) సంస్థ రూపొందించింది.
దీనిలోని రకాలు
i) పరమ్ - 8000 (ఇది భారతదేశ తొలి సూపర్ కంప్యూటర్)
ii) పరమ్ - 8600
iii) పరమ్ - 9900
iv) పరమ్ - 10,000
పరమ్ - 10000 సామర్థ్యాన్ని అనంతంగా పెంచి పరమ్ అనంత్ అంటారు. దీన్ని జర్మనీ, రష్యా,
* సింగపూర్, కెనడాకు ఎగుమతి చేశారు.
* ప‌ర‌మ్‌యువ‌ - 1 ను 2008 నవంబరులో ఆవిష్కరించారు.
* ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ పరమ్ యువ - 2. దీని వేగం సెకనుకు 520 టెరా ఫ్లోప్స్.
* భారతదేశంలో 500 టెరా ఫ్లోప్స్ దాటిన ఏకైక సూపర్ కంప్యూటర్ ఇది.
దీన్ని 2013, ఫిబ్రవరి 8న  C - DAC వారు రూపొందించారు.
ప్రాసెసర్ ఫర్ ఏరోడైనమిక్ కంప్యూటేషన్ అండ్ ఎవాల్యూయేషన్ (PACE): దీన్ని తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్' కోసం రూపొందించారు. దీనికి మరొక పేరు అనురాగ్. (ANURAG - Advanced Numerical Research Analytical Group)
* పేస్‌ను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవోలోని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్ ల్యాబరేటరీ రూపొందించింది. దీన్ని రక్షణ రంగంలో ఉపయోగిస్తున్నారు.
* 2013, ఆగస్టు 26న ధ్రువ - 3 అనే మరొక సూపర్ కంప్యూటర్‌ను రూపొందించింది.
FLOSOLVER: దీన్ని  బెంగళూరులోని 'నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీ' రూపొందించింది. దీన్ని రక్షణ  రంగంలో ఉపయోగిస్తున్నారు.


అనుపమ్ (ANUPAM):
* అనుప‌మ్‌ను బార్క్ శాస్త్రవేత్తలు రూపొందించి రక్షణ రంగంలో ఉపయోగిస్తున్నారు.
దీన్నిBARC Parallel Processing System అని అంటారు.
దీనిలోని శ్రేణుల్లో ముఖ్యమైనవి
     ANUPAM - Adhya, Xenon
                         Ameya, Pentium
                         Ajeya, Alpha
                         Aruna, Ashva


SAGA - 220: దీన్ని ఇస్రో విభాగం విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC - త్రివేండ్రం) 2011 మేలో నిర్మించింది. దీని సేవలను ఏరోనాటికల్ సైన్స్‌లో ఉపయోగిస్తున్నారు. వ్యయం రూ.14 కోట్లు.
అన్నపూర్ణ (ANNAPURNA): దీన్ని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ రూపొందించింది.
అశోక (ASHOKA): దీన్ని భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీని సేవలను దేశ వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్నారు.
ఆదిత్య (ADITHYA): దీన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ రూపొందించింది. వాతావరణ విశ్లేషణకు ఉపయోగిస్తున్నారు.
విక్రమ్ - 100: దీన్ని అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీలో ప్రొఫెసర్ యు.ఆర్. రావు 2015, జూన్ 26న ఆవిష్కరించారు. అంతరిక్ష పరిశోధనకు ఉపయోగిస్తున్నారు.


ఏక సూపర్ కంప్యూటర్
* సంస్కృతంలో ఏక అంటే మొదటిది అని అర్థం.
* పూణెలోని టాటా గ్రూపుకు చెందిన 'కంప్యూటేషనల్ రీసెర్చ్ ల్యాబరేటరీ' (CRL) సంస్థ దీన్ని రూపొందించింది.
* ఇది అమెరికాలోని నెవెడాల్ రెనోలో 2007, నవంబరు 7న విడుదల చేసిన అత్యంత వేగవంతమైన టాప్
* 500 సూపర్ కంప్యూటర్‌లలో నాలుగో స్థానం పొందింది. ఈ కంప్యూటర్ సుమారు 2010 వరకు 4వ స్థానంలో ఉంది.
* భారత ప్రభుత్వం 4500 కోట్ల రూపాయల అంచనాతో నేషనల్ సూపర్ కంప్యూటర్ గ్రిడ్‌ను 2015 మార్చిలో ఆమోదించింది.
* సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను బెంగళూరులో ఏర్పాటు చేశారు.
VIRGO: దీన్ని ఐఐటీ చెన్నైలో ఏర్పాటు చేశారు.


 ప్రపంచంలోని సూపర్ కంప్యూటర్‌లు:
2015 వరకు ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ తియాన్ హే - 2.
* ఇది చైనా నిర్మించిన తియాన్ హే - 1 కంటే 200 రెట్లు అధిక వేగంతో పనిచేస్తుంది.
* రెండో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ 'టైటాన్‌'ను అమెరికాలోని 'క్రే' సంస్థ రూపొందించింది.
* సీకోయూ లేదా బ్లూజీన్ క్యూ సూపర్ కంప్యూటర్‌ను ఐబీఎం రూపొందించింది.


 ఎక్కువ సంఖ్యలో సూపర్ కంప్యూటర్‌లను తయారు చేసిన దేశాలు

i) అమెరికా 266
ii) చైనా 63
iii) జపాన్ 28
iv) యు.కె 23
v) ఫ్రాన్స్ 22
vi) జర్మనీ 20
vii) భారత్ 12

* మనదేశంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం సబ్సిడీ ధరలపై అందింస్తున్న చిన్న కంప్యూటర్ 'ఆకాశ్ టాబ్లెట్ PC I & II'
* భారతదేశంలో 1965 నుంచి కంప్యూటర్ల అభివృద్ధి ప్రారంభమైంది.
* భారతదేశంలో కంప్యూటర్ల వినియోగానికి రూపకల్పన చేసిన రాష్ట్రం కేరళ. వీటిని 'లక్ష్య' అనే ప్రాజెక్టు ద్వారా ప్రారంభించారు.
* కంప్యూటర్ పాలసీని భారత ప్రభుత్వం 1984 నవంబరులో రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో ప్రకటించింది.
* భారతదేశంలో మొదటి కంప్యూటర్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ.
* భారతదేశంలో మొదటిసారిగా ఇంటర్‌నెట్‌ను అందించిన దినపత్రిక ది హిందూ.
* ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ 'సన్‌వే తైహులైట్'. దీని సామర్థ్యం 124.5 పెటా ఫ్లాప్‌లు.
* సమాచార ప్రసారానికి, వృద్ధికి కంప్యూటర్లు, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను సమగ్రంగా ఉపయోగించుకోవడాన్ని   'సాంకేతిక సమాచార విజ్ఞానం' (Information Technology) అంటారు.
* సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా పంపడానికి కంప్యూటర్స్ తోడ్పడతాయి.


కొన్ని సమాచార పద్ధతులు:
i) నిక్‌నెట్: నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అనే సంస్థ కంప్యూటర్‌లను ఉపయోగించి వివిధ జిల్లాలు, రాష్ట్ర రాజధానులను, దేశ రాజధానితో అనుసంధానం చేసి సమాచార ప్రసారానికి వీలు కల్పించింది.
ii) జిస్టినిక్: (GISTINIC): ఇది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ మరొక వ్యవస్థ. విశ్వవిద్యాలయం కోర్సులు, సరుకుల ధరలు, టూరిస్టుల గురించి సమాచారాన్ని అందిస్తోంది.
iii) ఇండోనెట్(Indonet): సీఎంఎస్ రూపొందించిన ఇండోనెట్‌కు 10 నగరాల్లో కేంద్రాలు ఉన్నాయి. ఇది ఒక సమగ్ర కార్యనిర్వహణా వ్యవస్థ. కానీ దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సమృద్ధిగా లేదు.
iv) ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్ ఛేంజ్ (EDI): భారతదేశపు మొదటి ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్ ఛేంజ్ సదుపాయాన్ని 1994, ఫిబ్రవరి 11న బొంబాయిలోని విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ (VSNL) ప్రారంభించింది.
v) సెల్యులార్ ఫోన్ (Cellular Phone): ఇది మొబైల్ కమ్యూనికేషన్‌లో ఉపయోగించే పరికరం.
* దీన్ని నిర్ణీత ప్రదేశంలోనే ఉపయోగించే వీలుంటుంది. సిస్టమ్ కవరేజ్ ఏరియా అంటారు.
* వీటిని ఎఫ్ఎంసీ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ బాండ్, ఛాన‌ల్‌కు కేటాయిస్తారు.
* సెల్యులార్ ఫోన్లను మొబైల్ యూనిట్లలో ఏర్పాటు చేశారు.


ఆపరేటింగ్ సిస్టమ్ (OS)
* కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో వినియోగదారులను సమన్వయ పరిచే ఒక ప్రోగ్రాం.
* కంప్యూటర్‌ను ఆన్ చేసిన హార్డ్‌వేర్ డిస్క్‌లో నుంచి ప్రధాన మెమొరీలోకి ఆపరేటింగ్ సిస్టమ్‌లోడ్ అవుతుంది.
* ఈ ప్రక్రియను 'బూటింగ్' అంటారు.
ఉదా: MS-DOS
         UNIX, LINUX, Windows X-P, Vista, Mac
* మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు: Android, Black Berry, IOS, Symbain etc.


వరల్డ్ వైడ్ వెబ్ (WWW)
* దీన్ని కనుక్కున్న శాస్త్రవేత్త టిమ్ బెర్నర్‌లీ
* దీని ద్వారా ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్‌కు ఇంటర్‌నెట్ ద్వారా సమాచారాన్ని సరఫరా చేస్తారు.
* 1991, ఆగస్టు 6న తొలి వెబ్‌సైట్‌ను కనుక్కున్నారు.
* ప్రపంచంలో తొలి వెబ్‌సైట్ info.cern.ch


బ్రౌజర్:
* కంప్యూటర్‌ను ఇంటర్‌నెట్‌తో అనుసంధానం చేసేదే బ్రౌజర్.
    ఉదా: Chorme, Mozilla Fire fox, Opera.
* ప్రపంచంలో తొలి వెబ్ బ్రౌజర్ NET Scape Navigator.


ఇ-కామర్స్:
* కంప్యూటర్ నెట్‌వర్క్ ద్వారా సమాచారం; వస్తువుల, సేవల క్రయ విక్రయాలను చేపట్టడమే ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఇ - కామర్స్.
* వివిధ వ్యవస్థల, వ్యాపారవేత్తల, వినియోగదారుల అవసరాలను తక్కువ వ్యయంతో తీర్చే ఆధునిక సాంకేతిక విధానమిది.
* తక్కువ సమయంలోనే సమాచార వినిమయం, వస్తుసేవల నాణ్యత మెరుగవడం లాంటివి ఇ-కామర్స్ వద్ద సాధ్యమవుతాయి.


విక్రమ్ ఇన్‌మర్‌సత్ భూకేంద్రం:
* ఈ కేంద్రం భారతదేశంలో మొదటిది. శాటిలైట్ భూకేంద్రాన్ని తీరం నుంచి నౌకకు, నౌక నుంచి తీరానికి టెలిఫోన్, ఫాక్స్ సర్వీసులను ఇన్‌మరత్ ద్వారా కల్పిస్తూ హిందూ మహాసముద్రం, పుణె సమీపంలోని ఆర్వి వద్ద 1992, జులై 11న ఏర్పాటు చేశారు. దీన్ని విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.


ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే:
* దీని ద్వారా పెద్ద పరిమాణంలో ఆడియో, వీడియో, గ్రాఫిక్ సమాచారాన్ని అతి త్వరగా వివిధ ప్రాంతాలకు పంపడం సాధ్యమవుతుంది. ఇది ఉపగ్రహం, కంప్యూటర్ అండ్ ఆప్టికల్ ఫైబర్‌తో కూడుకున్న వ్యవస్థ.


డిజిటల్ లైబ్రరీలు:
* ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చేవి డిజిటల్ లైబ్రరీలు.
* దీని వల్ల వ్యక్తిగత స్థాయిలో సేకరించిన సమాచారాన్ని, గ్రంథాలయాల్లోని గ్రంథాలయ సమాచారాన్ని, శాస్త్రవేత్తల వద్ద ఉండే సమాచారాన్ని ఉమ్మడిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.


పర్చ్యువల్ లాబ్స్:
* ప్రపంచ వ్యాప్త వెబ్ స్టాండర్డ్, స్టాండర్డ్ కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించడం ద్వారా గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ విశ్వవిద్యాలయాల్లో ప్రయోగాలు నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం అందించడంలో తోడ్పడతాయి.
* వీటిని 2012, ఫిబ్రవరి 23న ప్రారంభించారు.


WIMAX: (Wireless Inter Ferability Microwave Accecibility)
* మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో వైర్‌లెస్ సహాయంతో ఇంటర్నెట్, టెలిఫోన్, టెలిగ్రాఫిక్‌తోపాటు అనేక ఇతర సేవలను అందించవచ్చు.
* ఈ సేవలను మొదటగా మహారాష్ట్రలోని బారామతిలో ప్రారంభించారు.


ఇంటర్‌నెట్:
* ఈ వ్యవస్థను మొదట అమెరికా అడ్వాన్సుడ్ రీసెర్చ్ ప్రాజెక్టు నెట్‌వర్క్ (ARPANET) అనే పేరుతో తన రక్షణ అవసరాల కోసం 1960లో ఏర్పాటు చేశారు.
* పూర్తిస్థాయి ఇంటర్నెట్‌ను అమెరికా శాస్త్రవేత్తలైన వింట్ సెర్ఫ్, రాబర్ట్ ఖాన్ 1969, అక్టోబరు 29న  ఆవిష్కరించారు.
* వింట్ సెర్ఫ్‌ను ఇంటర్‌నెట్ పితామహుడు అంటారు.
* దీని సేవలు 1983, జనవరి 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి.
* 1973లో తొలిసారిగా ఇంగ్లండ్, నార్వే మధ్య సమాచారం బదిలీ అయ్యింది.
* ప్రొఫెసర్ టిమ్. బెర్నర్‌లీ 1989, మార్చి 12న వరల్డ్ వైడ్ వెబ్‌ను (www) కనుక్కున్నారు.
* దీని సేవలు 1991, ఆగస్టు 6 నుంచి అందుబాటులోకి వచ్చాయి.
* టిమ్ బెర్నర్‌లీని వరల్డ్ వైడ్ వెబ్ (www) పితామహుడు అని పిలుస్తారు.
* భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను 'గేట్‌వే ఆఫ్ ఇంటర్నెట్ యాక్సిస్ సర్వీస్' అనే పేరుతో VSNL ద్వారా 1995, ఆగస్టు 10న ప్రారంభించారు.
* ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.
* ఇంటర్నెట్ సేవల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా.
* రెండు, మూడు స్థానాల్లో వరుసగా చైనా, భారతదేశం ఉన్నాయి.


ఖండాల పరంగా
మొదటి స్థానం     -          ఆసియా (45%)
రెండో స్థానం        -          యూరప్ (20%)
* మూడో స్థానం      -          ఉత్తర అమెరికా (11.4%)
* ఇటీవల గూగుల్ సంస్థ వేగవంతమైన గూగుల్ ఫైబర్ సర్వీస్ ఇంటర్నెట్ ప్రసార పద్ధతిని ప్రవేశపెట్టింది.
* దీనిలో భాగంగా 1 GB వేగంతో ఇంటర్నెట్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి.


NETIZEN:
* ఇంటర్‌నెట్ వినియోగదారులను నెటిజెన్స్ అని పిలుస్తారు.


VIRUS: (Vital Information Resource Under Seize)
* కంప్యూటర్‌లోని సమాచారాన్ని క్రమరహితంగా చేయడం లేదా కొంత లేదా పూర్తి సమాచారాన్ని తొలగించడం.
* 1986 లో ప్రపంచంలో మొదట వైరస్‌ను పాకిస్థాన్‌లోని 'బాసిత్ అండ్ అంజద్ షారుక్ అల్వి కనుక్కున్నారు.


ముఖ్యమైన వైరస్‌లు
C - Brain
Smile
Sunday
Pingpong
Acid (1992)
Creepal
Kamasutra (2006)


http (hyper text transfer protocal):
* ఇంటర్నెట్ ద్వారా అత్యధిక సమాచారాన్ని పదాల రూపంలో తెలుసుకోవడాన్ని hyper text tranfer protocol అంటారు.


హోమ్‌పేజీ (Home Page):
*  ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు తన అవసరాల కోసం ఇంటర్నెట్‌లో ఏర్పాటు చేసుకున్న పేజీని హోమ్‌పేజీ అంటారు.


Virtual Reality:
*  ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు తన అవసరాలకోసం కంప్యూటర్‌లో కృత్రిమంగా సృష్టించుకున్న 3 - D ప్రపంచాన్ని "Virtual Reality" అంటారు.


ఇ-మెయిల్(e-mail):
*  ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని పదాల్లో మరొక కంప్యూటర్‌కు పంపించే పద్ధతిని ఇ-మెయిల్ అంటారు.
*  రే థామ్స్‌లైన్‌ను ఇ-మెయిల్ పితామహుడు అంటారు.


ట్విటర్ (TWITTER):
* కేవలం 140 పదాలతో చాలా వేగంగా ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడం.
* ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు ఒకేసారి పది ట్వీట్‌లను పంపించవచ్చు.
* దీన్ని మొదటిసారి జాక్ డోర్‌సే 2006, మార్చి 21న ప్రారంభించారు.


ఫేస్‌బుక్
* దీన్ని మార్క్‌జుకర్ బర్గ్ 2004, ఫిబ్రవరి 4న ప్రారంభించారు.
* ఇంటర్నెట్‌లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన పూర్తి సమాచారం దీనిలో ఉంటుంది.


బ్లాగ్ (BLOG)
* దీని పూర్తి పేరు వెబ్ బ్లాగ్.
* ఒక వ్యక్తి దైనందిన చర్యలను ఒక డైరీలా ఇంటర్నెట్‌లో పొందుపరచడాన్ని బ్లాగ్ అంటారు.
* దీని ద్వారా వినియోగదారులు ఇంటర్నెట్‌లో ఒక అంశం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు.


హాకింగ్ (HACKING)
* ఇంటర్నెట్ వినియోగదారుడి అనుమతి లేకుండా అందులో ఉన్న సమాచారాన్ని దొంగిలించడాన్ని హాకింగ్ అంటారు.
* ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను హాకర్స్ అంటారు.


సైబర్ క్రైమ్ (CYBER CRIME)
* ఇంటర్నెట్‌తోపాటు ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించి నేరం చేసినట్లయితే దాన్ని సైబర్ క్రైమ్ అంటారు.
* భారత ప్రభుత్వం 2013, జులైలో జాతీయ సైబర్ రక్షణ పాలసీని ప్రకటించింది.
* ఇంటర్నెట్‌లో కనిపించే మ్యాగజైన్‌ను E.Zine అంటారు.


హాంగ్ (HANG)
* కంప్యూటర్ అకస్మాత్తుగా పనిచేయకపోవడాన్ని హాంగ్ అంటారు.
* కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని ఫైల్స్‌ను మెమొరీలోకి లోడ్ చేయడాన్ని 'బూటింగ్' అంటారు.
* కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో వచ్చే దోషాన్ని 'బగ్' అంటారు.


యూట్యూబ్ ((YOUTUBE)
* దీన్ని అమెరికాలో స్టీవ్‌చెన్, చాద్ హర్లే, టావెడ్ కరీం 2005, ఫిబ్రవరి 14న ప్రారంభించారు. కానీ 2006, నవంబరు 1న గూగుల్ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది.


గూగుల్ (Google)
* లారీపేజ్, సెర్జిబ్రిన్‌లు 1998, సెప్టెంబరు 4న అమెరికాలో ప్రారంభించారు. ప్రస్తుతం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.
Yahoo.comను జెర్రియంగ్, డేవిడ్‌ఫెలో ప్రారంభించారు.
* ఆపిల్ సంస్థను 1976, ఏప్రిల్ 1న స్టీవ్‌జాబ్స్ అండ్ స్టీవ్ ఓజ్నయిక్ స్థాపించారు.
* ఇంటర్నెట్‌లో ఉపయోగించే వాయిస్ మెయిల్ (Voice mail) ను గోర్డన్ మాథ్యూస్ కనుక్కున్నారు.

GPS (Global Positioning System)
* దీన్ని అమెరికా 1978లో ప్రారంభించింది. భూమిపై ఉన్న వస్తువుల స్థితిగతులు దీని సహాయంతో తెలుసుకోవచ్చు.
GIS (Geographical Information System)
* భౌగోళిక ఉపరితలానికి సంబంధించిన అన్ని వివరాలు, లక్షణాల సమాచారాన్ని భద్రపరిచే కంప్యూటర్ వ్యవస్థనే భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) అంటారు.


ఇ - గవర్నెన్స్
* ప్రభుత్వానికి సంబంధించిన‌ సేవలను, సమాచారాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందజేయడాన్ని ఇ-గవర్నెన్స్ అంటారు.
* ఇ - గవర్నెన్స్‌ను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

 తెలంగాణ మీసేవ
ఆంధ్రప్రదేశ్ మీసేవ
తమిళనాడు రాశి
కర్ణాటక భూమి
మహారాష్ట్ర వారాణా
కేరళ అక్షయ
మధ్యప్రదేశ్ జ్ఞానదూత్
హిమాచల్‌ప్రదేశ్ లోకమిత్ర
రాజస్థాన్ మండి
ఉత్తర్ ప్రదేశ్ లోక్‌వాణి

 భూ వివరాల కంప్యూటరీకరణ 8

ఆంధ్రప్రదేశ్ భూభారతి
కర్ణాటక భూమి
తమిళనాడు తమిళనాలం
గోవా ధరణి
చత్తీస్‌గడ్ భుయాన్
రాజస్థాన్ అప్నాకట
గుజరాత్ ఈ-ధార్
మధ్యప్రదేశ్ హిమభూమి

      
నేషనల్ ఇ-గవర్నెన్స్ ప్రణాళిక
* సాధారణ ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలను అందించే లక్ష్యంతో 2006లో దీన్ని ప్రారంభించారు.
దీనిలో పేర్కొన్న సేవలను మిషన్ మోడ్ ప్రాజెక్ట్సు (MMP) అంటారు.
* దీని అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు స్టేట్ డాటా సెంటర్స్ (SDS).
ఈ కేంద్రాలను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

ఆంధ్రప్రదేశ్ APSWAN
కేరళ, కర్ణాటక సింగిల్ విండో సిస్టమ్
గుజరాత్, తమిళనాడు ఈ-డిస్ట్రిక్స్
మధ్యప్రదేశ్ జ్ఞానదూత్


డిజిటల్ ఇండియా:
* భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్న వివిధ రకాల ఇ-గవర్నెన్స్
* కార్యక్రమాలను ఏకీకృతం చేయడానికి 2015, జులై 1న నరేంద్ర మోదీ ప్రారంభించారు.
* దీని నినాదం Power to Empower.
* టెక్నాలజీ రంగంలో భారతదేశాన్ని సాధికారత వైపు తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యం.
* భారత దేశంలోని 17 నగరాల్లో 40 పరిశోధనా సంస్థలను సూపర్ కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేసి ఏర్పాటు చేసిన జాతీయ గ్రిడ్ కంప్యూటర్ నెట్‌వర్క్ గరుడ.
* గ్రామీణ భారతానికి సమాచార, సాంకేతిక సేవలను అందించడానికి ఉద్దేశించిన పథకం సైబర్ గ్రామీణ్.
* భారతీయ పౌరులను దేశపాలన, అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు 2014లో ''Mygov.in"వెబ్‌సైట్  ప్రారంభించారు.
*  ''Mygov.in" వెబ్‌సైట్ నినాదం My Country, My Government, My Voice.


భారతవాణి:
* 2016, మే 26న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు.
*  ఈ వెబ్‌సైట్‌లో 22 భాషల్లో విజ్ఞాన సమాచారాన్ని అందిస్తారు.
* త్వరలో 100 భాషల్లో విజ్ఞాన సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు.

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌