• facebook
  • whatsapp
  • telegram

అనువాదం

ఇంగ్లిష్, తెలుగు రెండు విభాగాల్లోనూ 'అనువాదం' అంశం ఉంది. ఆంగ్లం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించమని అడుగుతారు. ఒక భాషలోని అంశాలను మరో భాషలో చెప్పడమే అనువాదం. మూలంలోని భావాలకు అనుగుణంగానే అనువాదం సాగాలి. అనువాదం సహజంగా, సరళంగా ఉండాలి. మూలానికి భంగం వాటిల్లకూడదు. విషయాన్ని అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పగలిగితే చాలు.

ఆంగ్లంలోకి అనువదించండి:
1.
చలనచిత్రం శక్తిమంతమైన ప్రసార మాధ్యమం. అది రెండు వైపులా పదునున్న ఆయుధం. అన్ని రంగాల్లోని జీవితాలను వినోదపరుస్తుంది. అది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే సాధనం. ప్రస్తుతం చలనచిత్రం వినోద సాధనంగా ప్రాచుర్యం పొందింది. నేటి యువత వ్యాపార ధోరణి ఉన్న చలనచిత్రాల పట్ల ఆకర్షితులు కాకూడదు. వ్యాపార ధోరణితో చలనచిత్రాలు తీసే నిర్మాతలు మన సాంస్కృతిక విలువలు, సామాజిక సమస్యలకు అధిక ప్రాధాన్యమివ్వాలి.
(మాధ్యమం = Medium; అన్ని రంగాలు = All walks of life; నిరక్షరాస్యులు = Illiterate masses; నేటి యువత = Present day youth; సాంస్కృతిక విలువలు = Cultural values; సామాజిక సమస్యలు = Social problems)

అనువాదం: Cinema is a powerful medium. It is a double edged weapon. It entertains people of all walks of life. It is easy to educate illiterate masses through this medium. Today, cinema has gained more popularity as an entertainment channel. Present day youth should not be carried away by the commercial values in cinema. Producers of such films should give importance to our cultural values and social problems.
 

2. మానవ జాతి అంతా ఒకటేననీ, అవిభక్తమనీ విజ్ఞానశాస్త్ర యుగం మనకు బోధిస్తోంది. సముద్రాలూ, పర్వతాలూ దేశాలను, ఖండాలను విభజిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ, మానవాళి శాంతి సౌభాగ్యాల ఆశయాలకే కట్టుబడి ఉంది. ప్రపంచంలో ఒక ప్రాంతంలో యుద్ధం వస్తే, మరో ప్రాంతంలో శాంతి ఉండటం సాధ్యంకాదు. అదేవిధంగా దారిద్య్రం, ఆకలి కూడా!
(మానవ జాతి లేదా మానవాళి = Mankind; అవిభక్త = Indivisible; కట్టుబడి ఉంది = Is bound;
శాంతి సౌభాగ్యాలు = Peace and prosperity; అదేవిధంగా = So also; ఖండాలు = Continents)
అనువాదం: The age of science has taught us that mankind is one and indivisible. Oceans and mountains may seem to separate countries and continents. But humanity today is bound by a common desire for peace and prosperity. If there is war in one part of the world, there cannot be peace in another. So also with poverty and hunger.

3. మన దేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది. కాబట్టి దాన్ని విస్తారంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. భూమిని విస్తరించలేం కాబట్టి, ఉన్న భూమినే సాధ్యమైనంత వరకు సాగుకు వినియోగించాల్సి ఉంది. ఒక పంటను పండిస్తున్న పొలంలో రెండు పంటలు పండించాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రసాయనిక ఎరువులను బాగా ఉపయోగించుకోవాలి. చీడపురుగులు, తెగుళ్ల నివారణను మర్చిపోకూడదు.
(వెన్నెముక = Backbone; విస్తారంగా =Intensively; పంటలు = Crops; వ్యవసాయం = Agriculture, Cultivation; రసాయనిక ఎరువులు = Chemical fertilizers; తెగుళ్ల నివారణ = Pest control)
అనువాదం: Agriculture is the backbone of our country and so it has to be developed intensively. Since land cannot be expanded, the available land has to be put to maximum use. We have to grow two crops now where we were growing only one. Modern methods of cultivation and the use of chemical fertilizers should be more extensively used. Pest control can not be forgotten.
 

4. శాంతి అంటే సహనం. ప్రకృతి వైపరీత్యాలు మనుషులు సృష్టించుకునే సమస్యలు, ఆర్థిక సమస్యలు వారి మనుగడకి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ప్రపంచ శాంతి అంటే ఆకాశం కింద ఉన్న ప్రతి మనిషి తిండీ, దుస్తులతో ప్రశాంతంగా జీవించడమే. ప్రకృతి వైపరీత్యాలు మానవాళికి కష్టాలు కలిగిస్తాయి. వరదలు, భూకంపాలు, కరవులు, తుపాన్లు వంటి వాటి వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. శాస్త్రవేత్తలు వాటి వల్ల కలిగే బాధలను (నష్టాలు) తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
(సహనం = Tolerance; వైపరీత్యాలు = Calamities; కరవు = drought)

Peace means tolerance. The natural calamities, man made problems, the financial problems lead to difficulties for the mankind. World peace means that every human being under the sky live a life having adequate food and clothing. Natural calamities bring difficulties to the people. People face problems due to floods, earth-quakes, drought and cyclones. Scientists are working out how to minimise their sufferings.
 

5. మన రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా 1990లో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అంచెలంచెలుగా అన్ని జిల్లాలకు విస్తరింపజేసింది. మధ్యలో చదువు మానేసిన పిల్లలు తిరిగి చదువు కొనసాగించడానికి వీలుగా 'మళ్లీ బడికి' కార్యక్రమం ప్రవేశపెట్టింది. 6-11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో 'మా బడి' కార్యక్రమం ఆరంభమైంది. 'చదువుకుందాం' అనే మరో కార్యక్రమం ద్వారా చదువు మధ్యలో ఆపేసిన బాలబాలికలను, ఇంకా పాఠశాలకు వెళ్లని 5-14 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్లను ప్రోత్సహించి పాఠశాలల్లో చేర్పించాలని ప్రయత్నిస్తున్నారు.
(సంపూర్ణ అక్షరాస్యత = Total Literacy; అంచెలంచెలుగా = in a phased manner; ప్రవేశపెట్టింది = introduced; చదువు మధ్యలో ఆపడం = dropouts to the school; పాఠశాలల్లో చేర్పించడం = to join the schools)
The state government had introduced first time the total literacy programme in the year 1990. After that it extended to other districts in a phased manner. For the dropouts or those who discontinue schooling in the middle, a new programme by name "Mallee Badiki" has been introduced. "Maa Badi" had been initiated with an idea of giving education for the children within age group of 6-11. There was another programme by name "Chaduvukundam" - with an aim of bring back the dropouts to the school and to encourage the children in the age group of 5-7 to join the schools.

ఆంగ్లం నుంచి తెలుగులోకి

1. Buddhism was founded by Gautama who lived  in 6th century. Gautama otherwise known as Siddhartha, was the son of an Indian King Suddhodana, the chief of Sakyas. The sorrows and sufferings of the world dormented his loving heart and left his princely house, his wife and child. Gautama at last found enlightenment while meditating under a great tree. From that day, he came to be known as Buddha. (Otherwise = మరో విధంగా; Dormented= కలచివేశాయి (బాధించాయి); Princely house= రాజభవనం; Meditation = ధ్యానం.)
అనువాదం: గౌతముడు ఆరోశతాబ్దంలో బౌద్ధమతాన్ని స్థాపించాడు. గౌతముడు సిద్ధార్థుడిగా కూడా ప్రసిద్ధిగాంచాడు. శాక్య వంశ సార్వభౌముడైన శుద్ధోధనుడి కుమారుడే గౌతముడు. ప్రపంచంలోని దుఃఖాలు, బాధలు (సమస్యలను) తన కోమల హృదయాన్ని కలచివేయగా రాజభవనాన్ని, భార్యను, బిడ్డను విడిచి వెళ్లాడు. గౌతముడు ఒక మహావృక్షం కింద ధ్యానంలో ఉండగా జ్ఞానోదయమైంది. అప్పటి నుంచి అతడు బుద్ధుడిగా పేరుపొందాడు.
 

2. In my opinion, the existing system of education is very defective. It is based on foreign culture. It ignores the culture of the heart and the land and confines itself to the head. Real education is impossible through a foreign medium. The foreign medium has made our children practically foreigners in their own land.

(Defective = లోపభూయిష్టం; Ignore= నిర్లక్ష్యం, ఉపేక్ష; Confine = పరిమితం; Foreign medium= విదేశీ భాషా మాధ్యమం; Practically = పూర్తిగా, అక్షరాలా)
నా దృష్టిలో నేటి విద్యా విధానం చాలా లోపభూయిష్టమైంది. ఇది విదేశీ సంస్కృతిపై ఆధారపడి ఉంది. సాంస్కృతిక హృదయాన్ని (కళా హృదయాన్ని) ఉపేక్షించి కేవలం మెదడుకే పరిమితమైంది. విదేశీ భాషా మాధ్యమం ద్వారా అసలైన విద్యను సాధించలేం. ఈ రకమైన విద్య మన పిల్లలను స్వదేశంలోనే విదేశీయులుగా చేస్తోంది.

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌