• facebook
  • whatsapp
  • telegram

క్యాలెండర్

1. 17 జూన్ 1998 న ఏ వారం అవుతుంది?
ఎ) సోమవారం            బి) మంగళవారం            సి) బుధవారం            డి) గురువారం
సాధన: మొదట ప్రశ్నలో ఇచ్చిన సంవత్సరానికి ముందున్న సంవత్సరాలను లెక్కించాలి.
1997  1600 + 300 + 97
1600 సంవత్సరాల్లో విషమ దినాలు = 0
300 సంవత్సరాల్లో విషమ దినాలు = 1
97 సంవత్సరాల్లో 24 లీపు సంవత్సరాలు + 73 సాధారణ సంవత్సరాలు
(24 × 2 + 73 × 1) = 48 + 73 = 121 = 2 విషమ దినాలు

విషమ రోజులు మొత్తం = 0 + 1 + 2 + 28 = 31

సంక్షిప్త పద్ధతి: 17 జూన్ 1998
సాధన: ఇచ్చిన రోజులు + నెల కోడ్ + సంవత్సరంలోని చివరి 2 స్థానాలు + అందులో లీపు సంవత్సరాలు + సంవత్సరం కోడ్.
17 + 5 + 98 + 24 + 0 = 144

సంక్షిప్త పద్ధతిలో శేషం 4 వస్తే అది బుధవారం
జవాబు: సి

 

2. 15 ఆగస్టు 2010 ఏ వారం అవుతుంది?
ఎ) ఆదివారం             బి) సోమవారం             సి) మంగళవారం             డి) శుక్రవారం
సాధన: 2009  => 1600 + 400 + 9
1600 సంవత్సరాల్లో విషమ దినాలు = 0
400 సంవత్సరాల్లో విషమ దినాలు = 0
9 సంవత్సరాల్లో 2 లీపు సంవత్సరాలు + 7 సాధారణ సంవత్సరాలు ఉంటాయి.
2 × 2 + 7 × 1 = 4 + 7 = 11


మొత్తం విషమ దినాలు = 0 + 0 + 11 + 31 = 42

సంక్షిప్త పద్ధతి: 15 ఆగస్టు 2010
15 + 3 + 10 + 2 + 6 = 36

జవాబు:

 

3. ఏప్రిల్ 2001లో బుధవారం ఏయే తేదీల్లో వస్తుంది?
ఎ) 1, 8, 15, 22, 29           బి) 2, 9, 16, 23, 30           సి) 4, 11, 18, 25           డి) 6, 13, 20, 27
సాధన: ముందుగా 1 తేదీ ఏ వారం అవుతుందో కనుక్కోవాలి.
            2000   1600 + 400
1600 సంవత్సరాల్లో విషమ దినాలు = 0
400 సంవత్సరాల్లో విషమ దినాలు = 0
2001   జ       ఫి     మా      ఏ
                       3  +  0   +  3   +  1  =  7

1 - ఆదివారం, 2 - సోమవారం, 3 - మంగళవారం, 4 - బుధవారం
4, 11, 18, 25 తేదీలు బుధవారం అవుతాయి.
జవాబు: సి

 

4. 2007 లో ఉండే క్యాలెండర్ కిందివాటిలో ఏ సంవత్సరానికి కూడా వర్తిస్తుంది?
ఎ) 2014                   బి) 2016                   సి) 2017                    డి) 2018
సాధన: 2007 నుంచి మొత్తం విషమ దినాలు సున్నా వచ్చే వరకు లెక్కించాలి.

మొత్తం 14 విషమ రోజులు అంటే 0 విషమ దినాలు. 2007 క్యాలెండర్ 2018 క్యాలెండర్ ఒకటే.
జవాబు: డి
* గమనిక: 2007 లీపు సంవత్సరం కంటే ముందుంది కాబట్టి అలాంటి సంవత్సరం కావాలంటే +11 సంవత్సరాలు చేయాలి.
* లీపు సంవత్సరం కంటే ముందు. ఉదాహరణకు 2009 లాంటి సంవత్సరం కావాలంటే +6 సంవత్సరాలు చేయాలి.
* మధ్య సంవత్సరం అడిగితే +11 సంవత్సరాలు లెక్కించాలి.
* లీపు సంవత్సరాన్నే అడిగితే +28 సంవత్సరాలు చేయాలి.

5. 10 ఆగస్టు 2007 శుక్రవారం అక్షర పుట్టిన రోజు అయితే 10 ఆగస్టు 2015 సంవత్సరంలో ఆమె పుట్టిన రోజు ఏ వారం వస్తుంది?
ఎ) శుక్రవారం               బి) శనివారం               సి) ఆదివారం               డి) సోమవారం
సాధన: 10 ఆగస్టు 2007
             10 ఆగస్టు 2008 - 2 (విషమ దినాలు)
             10 ఆగస్టు 2009 - 1
             10 ఆగస్టు 2010 - 1
             10 ఆగస్టు 2011 - 1
             10 ఆగస్టు 2012 - 2
             10 ఆగస్టు 2013 - 1
             10 ఆగస్టు 2014 - 1
             10 ఆగస్టు 2015 - 1
మొత్తం విషమ దినాలు:
                                   
అంటే శనివారం, అదివారం, సోమవారం
సంక్షిప్త పద్దతి:
2015 - 2007 = 8   లీపు సంవత్సరాలు 2 + 8 = 10
   


అంటే శనివారం, ఆదివారం, సోమవారం అవుతాయి.
జవాబు: డి

6. కిందివాటిలో లీపు సంవత్సరం కానిది ఏది?
ఎ) 1900                  బి) 1984                  సి) 1960                  డి) 1940
సాధన: 400 ల గుణిజాలు 800, 1200, 1600 ...... లాంటివి లీపు సంవత్సరాలు. అలాగే చివరి 2 స్థానాలను 4 తో నిశ్శేషంగా భాగించగలిగితే లీపు సంవత్సరాలు అవుతాయి.
పైవాటిలో 1900 అనేది 400 గుణిజాల్లో లేదు కాబట్టి లీపు సంవత్సరం కాదు.
జవాబు:

 

7. ఈ రోజు సోమవారం అయితే 61 రోజుల తర్వాత వచ్చే వారం?
ఎ) బుధవారం               బి) శనివారం               సి) మంగళవారం               డి) గురువారం
సాధన: ప్రతి 7 రోజులకు అదే వారం వస్తుంది. అంటే 63 రోజుల తర్వాత సోమవారం వస్తుంది. 61 రోజుల తర్వాత అంటే శనివారం అవుతుంది.
జవాబు: బి

 

8. 2016 ఫిబ్రవరి 14 ఏ వారం అవుతుంది?
ఎ) సోమవారం             బి) ఆదివారం               సి) శనివారం                     డి) మంగళవారం
సాధన: 2015  1600 + 400 + 15
           1600 సంవత్సరాల్లో విషమ దినాలు - 0
          400 సంవత్సరాల్లో విషమ దినాలు - 0
          15 సంవత్సరాల్లో 3 లీపు సంవత్సరాలు + 12 సాధారణ సంవత్సరాలు
3 × 2 + 12 × 1 = 6 + 12 = 18
   జ        ఫి
  3    +   14    =   17
మొత్తం విషమ దినాలు 0 + 0 + 18 + 17 = 35
   అంటే ఆదివారం అవుతుంది
సంక్షిప్త పద్ధతి: 14 ఫిబ్రవరి 2016
14 + 4 + 16 + 4 + 6 = 44 - 1 = 43
  అంటే ఆదివారం
జవాబు: బి
గమనిక: ఇచ్చిన ప్రశ్న జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండి, అది లీపు సంవత్సరం అయితే మొత్తం విషమ దినాల నుంచి 1 తీసేసి లెక్క చేయాలి.

9. కిందివాటిలో లీపు సంవత్సరం కానిది ఏది?
ఎ) 700                       బి) 800                       సి) 1200                       డి) 2000
జ: ఎ (700)

 

10. శతాబ్దం ఆఖరి రోజు కానిది ఏది?
జ: మంగళవారం

 

11. ఒక వ్యక్తి 6 ఏప్రిల్ 1976న జన్మించాడు. ఆ రోజు బుధవారమైతే 1990లో అతని పుట్టిన రోజు ఏ వారం అవుతుంది?
జ: శుక్రవారం

 

12. x వారాలు, x రోజుల్లో ఎన్ని రోజులు ఉంటాయి?
జ: 8x

 

13. 2005 మార్చిలో శుక్రవారం ఏయే తేదీల్లో వస్తుంది?
జ: 4, 11, 18, 25

Posted Date : 13-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌