• facebook
  • whatsapp
  • telegram

వైశాల్యాలు

1.  ఒక దీర్ఘ చతురస్రాకార స్థలం పొడవు 13.5 మీ, వెడల్పు 8 మీ అయితే దాని వైశాల్యం ఎంత?
జ:   108 చ.యూ.

2. ఒక దీర్ఘచతురస్రం పొడవు, వెడల్పులను 20 శాతం పెంచితే దాని వైశాల్యంలో మార్పు ఎంత శాతం?
జ:   44% 

3. ఒక దీర్ఘ చతురస్రం పొడవు 60% పెంచితే, దాని వైశాల్యంలో మార్పు లేకుండా ఉండాలంటే, వెడల్పు ఎంత శాతం తగ్గించాలి?
జ:   37 1/2% 

4. రెండు చతురస్రాల్లో ఒకదాని కర్ణం పొడవు మరోదాని కర్ణం పొడవుకు రెట్టింపు అయితే ఆ రెండు చతురస్ర వైశాల్యాల నిష్పత్తి ఎంత?
జ:   4 : 1

5. వృత్తం వ్యాసార్ధం 7 యూనిట్లయితే వైశాల్యం ఎంత?
జ:  154 చ.యూ. 

6. ఒక వృత్తం వైశాల్యం 220 చ.సెం.మీ. దాని లోపల ఒక పెద్ద చతురస్రాన్ని నిర్మిస్తే చతురస్ర వైశాల్యం ఎంత?
జ:  140 సెం.మీ.2

7. ఒక దీర్ఘచతురస్రం పొడవు 18 సెం.మీ., వెడల్పు 14 సెం.మీ.  దాని లోపల నిర్మించగల పెద్ద వృత్త వైశాల్యం ఎంత?
జా:  154  సెం.మీ.2

8. ఒక అర్థవృత్తం వ్యాసార్ధం r. దాని లోపల ఒక పెద్ద త్రిభుజాన్ని నిర్మిస్తే త్రిభుజ వైశాల్యం ఎంత?
జ:   r2

9. 7 సెం.మీ. వ్యాసార్ధమున్న 4 వృత్తాకార కార్డుబోర్డు ముక్కలను ఒకదానిపక్కన ఒకటి, ప్రతి రెండూ కలిసేలా అమరిస్తే, దాని మధ్య భాగంలో ఖాళీ స్థల వైశాల్యం ఎంత?
జ:   42 సెం.మీ.2 

10. ఒక వృత్త వ్యాసార్ధాన్ని రెట్టింపు చేస్తే దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది?
జ:  300%

11. రాంబస్ వైశాల్యం 25 చ.సెం.మీ. దాని ఒక కర్ణం పొడవు మరో కర్ణం పొడవుకు రెట్టింపు అయితే, రెండు కర్ణాల మొత్తం ఎంత?
జ:  15 సెం.మీ.

Posted Date : 27-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌