• facebook
  • whatsapp
  • telegram

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12/ఎన్‌వీఎస్‌-01

నావిక్‌ (NavIC)


 నావిక్‌ లేదా IRNSSని భారత ప్రాదేశిక GPS గా వర్ణించవచ్చు. 


1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధ సమయంలో అమెరికా ప్రభుత్వం తన అధీనంలోని  GPS  (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం) సేవలను భారత సైనిక, వైమానిక దళాలకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో దేశీయ నేవిగేషన్‌ వ్యవస్థ అవసరమని గుర్తించిన భారత ప్రభుత్వం 2006 మేలో కొత్త ప్రాజెక్ట్‌కి తన ఆమోదాన్ని తెలిపింది.


 ఇందులో భాగంగా ఏడు ఉపగ్రహాలతో కూడిన నేవిగేషన్‌ ఉపగ్రహాలను IRNSS-1 పేరుతో ప్రయోగించాలని నిర్ణయించారు. 


 ఈ ప్రాదేశిక నేవిగేషన్‌ వ్యవస్థ భారత్‌తో పాటు, భారత ప్రధాన భూభాగం (Mainland) నుంచి 1500 కి.మీ.ల దూరంలోని ప్రాంతాలను కూడా పరిశీలిస్తుంది. 


 2013-16 మధ్యకాలంలో మొత్తం ఏడు ఉపగ్రహాలను  IRNSS-1A, IRNSS-1B, IRNSS-1C, IRNSS-1D, IRNSS-1E, IRNSS-1F, IRNSS-1G  అనే పేర్లతో ప్రయోగించారు. 


 నేవిగేషన్‌ ప్రక్రియలో వస్తువు లేదా వ్యక్తి స్థానాన్ని, గమనాన్ని నిర్ధారించడంలో కచ్చితమైన సమయాన్ని సూచించే పరమాణు గడియారాలను (Atomic Clocks) ఉపగ్రహాల్లో వినియోగిస్తారు. 


IRNSS-1A లో ఉపయోగించిన మూడు రుబీడియం పరమాణు గడియారాలు చెడిపోవడంతో IRNSS-1A స్థానంలోIRNSS-1Hని ప్రయోగించారు. అయితే ఈ ప్రయోగం విఫలమవడంతో IRNSS-1ని 2018లో ప్రయోగించారు. 


 నావిక్‌ ఉపగ్రహాలు ఒక్కొక్కటి సుమారు 1330 కిలోల ద్రవ్యరాశితో ఉంటాయి. 


 ఈ ఉపగ్రహాలు L, S బ్యాండ్‌ పౌనఃపున్యాల అవధిలో భారతదేశంలో 510 మీటర్ల కచ్చితత్వంతో, హిందూ మహాసముద్ర ప్రాంతంలో, విదేశీ పరిసరాల్లో 20 మీటర్ల కచ్చితత్వంతో స్థానాన్ని గుర్తిస్తాయి. 


 ఏడు ఉపగ్రహాల్లో మూడు  32.5°E, 83°E , 131.5°E ల రేఖాంశాల వద్ద భూస్థావర కక్ష్యల్లో(GEO) ఉంటే మిగతా నాలుగు భూఅనువర్తిత (Geo Synchronous Orbit - GSO) కక్ష్యల్లో ఉన్నాయి.


NVS-01


 భారత రెండో తరం నేవిగేషన్‌ ఉపగ్రహ శ్రేణిలో ప్రయోగించనున్న అయిదు ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-01 తొలి ఉపగ్రహం. 


 ఇది L1, L5, S బ్యాండ్లలో పనిచేసే పేలోడ్స్‌ని కలిగి ఉండటంతో పాటు, స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన రుబీడియం పరమాణు గడియారాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. 


 ప్రజలకు స్థానం, నేవిగేషన్, కాలానికి చెందిన PNT (Position Navigation & Timing) సేవలను అందించడంతో పాటు ఇతర GNSS సిగ్నల్స్‌కి కూడా స్పందించే అవకాశాన్ని  L1 నేవిగేషన్‌ బ్యాండ్‌ కల్పిస్తుంది.


 రుబీడియం పరమాణు గడియారాన్ని అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ అభివృద్ధి చేసింది.


GSLV-F12

 జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ - మార్క్‌ ఖిఖి తరహా రాకెట్‌ని బరువైన కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలకు ఇతర గ్రహాంతర పరిశోధనలకు ఉపయోగిస్తారు. 


 420 టన్నుల ‘‘లిఫ్ట్‌ ఆఫ్‌ మాస్‌’’ని కలిగి 2250 కేజీల ద్రవ్యరాశితో ఉండే పేలోడ్‌ని GTO  (భూబదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టడానికి GSLV MK-II ఉపయోగపడుతుంది. 


 సుమారు 51 మీటర్ల పొడవైన GSLV రాకెట్‌లో మూడు అంచెలు ఉంటాయి.  మొదటి అంచెలో ఘన, రెండో అంచెలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తే మూడో అంచెలో క్రయోజెనిక్‌ ఇంధనాన్ని ఉపయోగిస్తారు.


 అతిశీతల ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్‌ల మిశ్రమాన్ని క్రయోజెనిక్‌ ఇంధనాలు అంటారు.


GSLV MK-I లో రష్యా సరఫరా చేసిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ని(Cryogenic Upper Stage - CUS) వాడారు.


GSLV MK-IIలో మూడో అంచెని భారత్‌ అభివృద్ధి చేసింది. 


 నాలుగో తరానికి చెందిన GSLV MK-II మొదటి అంచెలో నాలుగు ద్రవ ఇంధన బూస్టర్‌ రాకెట్లు ఉంటాయి.


 తొలి GSLV MK-IIని 15-04-2010న ప్రయోగించారు. ఇప్పటివరకు చేపట్టిన తొమ్మిది ప్రయోగాల్లో ఆరుసార్లు విజయవంతంగా పేలోడ్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.


GSLV MK-II F-12 రాకెట్‌ 18 నిమిషాల్లోనే NVS-01 ఉపగ్రహాన్ని సుమారు 250 కిలోమీటర్ల ఎత్తులోని భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.


 దీర్ఘవృత్తాకార GTOలోని శాటిలైట్‌ని అనేకసార్లు కక్ష్యల మార్పులకు (Orbit maneuvers) గురిచేసి, చివరగా 36,000 కి.మీ.ల దూరంలోని వృత్తాకార కక్ష్యలోకి బదిలీ చేస్తారు.


IRNSS  శ్రేణి శాటిలైట్ల ద్రవ్యరాశి తక్కువగా ఉండటంతో వాటిని PSLV రాకెట్లతో ప్రయోగిస్తే, NVS-01ని GSLVరాకెట్‌తో ప్రయోగించారు.


PSLV-C55/ TeLEOS-2 మిషన్‌


 ఇస్రో ‘పని గుర్రం’గా (work horse)పేరొందిన PSLV రాకెట్‌ తన 57వ మిషన్‌ PSLV-C55 ద్వారా సింగపూర్‌కి చెందిన ఉపగ్రహాలు TeLEOS-2,  Lumelite-4 లను శ్రీహరికోట నుంచి 22 ఏప్రిల్‌ 2023న విజయవంతంగా ప్రయోగించింది.


 దీంతోపాటుPSLVలో మిగిలిపోయే నాలుగో అంచె PS-4-ని ఇస్రో, మరోసారి శాస్త్ర పరిశోధనల వేదికగా వినియోగించింది. దీన్నే PSLV ఆర్బిటాల్‌ ఎక్స్‌పరిమెంటల్‌ మాడ్యూల్‌(POEM)అని పిలుస్తారు. 


PSLV-C55, న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌కి(NSIL) సంబంధించిన పూర్తి వాణిజ్య ప్రయోగం.


PSLVకి చెందిన PSLV-CA (Core Alone) రకం రాకెట్‌ని ఈ మిషన్‌ కోసం వినియోగించారు. 


TeLEOS-2 74 కిలోగ్రాముల ద్రవ్యరాశితో ఉండే ఉపగ్రహం. ఇది సింథటిక్‌ అపర్చర్‌ రాడార్‌ని(SAR) పేలోడ్‌గా కలిగి ఉంది.


 దీన్ని సింగపూర్‌ ప్రభుత్వ రంగ సంస్థలైన DSTA, ST ఇంజినీరింగ్‌ సంయుక్తంగా నిర్మించాయి. 


 టెలియోస్‌ - 2 అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలపాటు ఉపగ్రహ ఛాయాచిత్రాలను తీస్తుంది. 


Lumelite-4 అనేది 16 కిలోగ్రాముల ద్రవ్యరాశితో ఉండే చిన్న ఉపగ్రహం. ఇది ప్రధానంగా సింగపూర్‌ సముద్ర భద్రతకి సంబంధించి ప్రయోగించిన టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌.


POEM


నాలుగో అంచె (PS4) విడదీయరాని ఏడు పేలోడ్‌లను కలిగి ఉంది. అవి: 

1) ARIS-2 2) PiLOT 3) ARKA 200  4) Straberry 5) DSOL  6) DSOD-3U 7) DSOD-6U 


1. iPiLOT (PSLV in Orbit obc and Thermals) - IIST తిరువనంతపురానికి చెందింది.


2. ARIS-2 (Advanced Retarding Potential analyzer for Ionspheric Studies) - IIST తిరువనంతపురం


3.  ARKA 200 (Bellatrix కి చెందిన విద్యుత్‌ ప్రొపల్షన్‌ సిస్టం)        

4. Straberry (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కి చెందిన పేలోడ్‌)

5. DSOL

6.  DSOD - 3U   ధ్రువ స్పేస్‌కి చెందినవి

7.  DSOD - 6U


PSLV-C55  రాకెట్‌ విశేషాలు


పొడవు - 44 మీటర్లు (సుమారు)


లిఫ్ట్‌ ఆఫ్‌ మాస్‌ - 228 టన్నులు


మొదటి అంచె ఇంధనం - ఘన HTPB ఇంధనం 


రెండో అంచె ఇంధనం - ద్రవ( UH25 + N2O4) ఇంధనం


మూడో అంచె ఇంధనం - ఘన HTPB  ఇంధనం 


నాలుగో అంచె ఇంధనం - ద్రవ MMH + MON3) ఇంధనం


బూస్టర్‌ రాకెట్ల సంఖ్య - లేవు


వివిధ దేశాల నేవిగేషన్‌ వ్యవస్థలు

      నేవిగేషన్‌ వ్యవస్థ                     దేశం  శాటిలైట్ల సమాచారం ప్రాంతీయం/భౌగోళికం 
1   జీపీఎస్‌                  అమెరికా     27
(6కక్ష్యలుx4ఉపగ్రహాలు,
 3 అదనం =  24 + 3) 
 గ్లోబల్‌
2 GLONASS                   రష్యా      24 (3 కక్ష్యలు) (3x824)   గ్లోబల్‌
3  గెలీలియో      యూరోపియన్‌ యూనియన్‌    30 (24 + 6 అదనం)  గ్లోబల్‌
4  బీడౌ (BeiDou)                     చైనా               35  గ్లోబల్‌
5 QZSS                       జపాన్‌                 5 + 2 ప్రాంతీయం
6   నావిక్‌                     భారత్‌                    7 ప్రాంతీయం


navic ఉపయోగాలు


1. వైమానిక, నావిక, భౌగోళిక రంగాలకు నేవిగేషన్‌ సేవలను అందిస్తుంది. 


2. వ్యవసాయరంగంలో సేవలు 


3. భూఉపరితల సర్వే 


4. అత్యవసర సేవలు 


5. వాహన సముదాయాల(Fleet)నిర్వహణ 


6. మొబైల్‌ పరికరాల్లో లొకేషన్‌ ఆధారిత సేవలు. 


7. కృత్రిమ ఉపగ్రహాలకు కక్ష్యల నిర్ధారణ.


8. సముద్రంలో చేపల ఉనికికి సంబంధించి జాలర్లకు సమాచారం అందించడం.


9. ప్రభుత్వ సంస్థలు, పవర్‌ గ్రిడ్, ఆర్థిక సంస్థలకు టైమింగ్‌ సేవలు ఇవ్వడం


10. ఇంటర్నెట్‌ - ఆఫ్‌ థింగ్స్‌కి  (IoT) సంబంధించిన అనువర్తనాలు.


11. వ్యూహాత్మక అనువర్తనాలు.


 ఇప్పటివరకు పంపిన IRNSS ఉపగ్రహాల్లో స్విస్‌ తయారీ పరమాణు గడియారాలను వినియోగించారు. 


 ఇప్పటి నుంచి పంపనున్న  NVS శ్రేణి ఉపగ్రహాలు క్రమక్రమంగా IRNSS -1 శ్రేణి ఉపగ్రహాల స్థానాలను భర్తీ చేయనున్నాయి.


NVS-01 ఉపగ్రహం  IRNSS - 1G ఉపగ్రహం స్థానంలో పనిచేయనుంది. 


 దీని జీవితకాలం సుమారు 12 సంవత్సరాలు.


రచయిత

దురిశెట్టి అనంత రామకృష్ణ


 

Posted Date : 17-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌