• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ సంబంధ సమకాలీన అంశాలు

అభ్యాస ప్రశ్నలు

1. 2017 అక్టోబరులో 'ఇండియా వాటర్ వీక్ 2017' ను ప్రారంభించింది ఎవరు?
జ‌: రామ్‌నాథ్ కోవింద్

 

2. భారతదేశ ఈశాన్య ప్రాంతంలో జలవనరుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఎవరు ప్రధాన అధిపతిగా వ్యవహరించనున్నారు?
జ‌: డా. రాజీవ్‌కుమార్

 

3. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వశాఖ నిర్వహించే ప్రకృతి కోజ్ అనేది.....
జ‌: దేశవ్యాప్తంగా నిర్వహించే క్విజ్ కార్యక్రమం

 

4. ఓజోన్ పొరకు పడిన రంధ్రాన్ని (Ozone Hole) ప్రతి సంవత్సరం దాని పెరుగుదలను, తరుగుదలను కింది ఏయే సంస్థలు సూచిస్తాయి?
    i) NOAA (National Oceanic and Atmospheric Administration)
    ii) NASA (National Aeronautics and Space Administration)
    iii) ESA (European Space Agency)
    iv) ISRO (Indian Space Research Organisation)
జ‌: i, ii మాత్రమే

 

5. రైల్వే స్టేషన్లలో సుమారు 30 శాతం విద్యుత్ శక్తిని అందించేలా తొలిసారి 2017 అక్టోబరులో సోలార్ ప్లాంట్స్‌ను వినియోగించారు. ఈ ఆవిష్కరణ ఎక్కడ జరిగింది?
జ‌: దిల్లీ

 

6. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, లోతైన ఏ సరస్సు జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు? (కుళ్లిన శైవలాలు ఈ సరస్సు తన జీవవైవిధ్య ప్రత్యేకతను కోల్పోయేంత ప్రమాద స్థాయిలో పేరుకున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.)
జ‌: బైకాల్ సరస్సు

 

7. క్లీన్ సీ - 2017 దేనికి సంబంధించింది?
జ‌: తైల కాలుష్య నివారణకు సంబంధించింద.

 

8. ఇటీవల నేచర్ పరిశోధక పత్రిక ఆధారంగా మానవ ప్రేరిత సల్ఫర్ డై ఆక్సైడ్ ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న దేశం ఏది?
జ‌: భారతదేశం

Posted Date : 13-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌