• facebook
  • whatsapp
  • telegram

ఔషధ, ఆహార  సంబంధ రసాయనశాస్త్రం

1. కింది వాటిలో ఆదర్శ ఔషధం ధర్మాలు ఏవి?

i)  ఔషధానికి అతి తక్కువ దుష్ఫలితాలు ఉండాలి

ii) ఔషధం నిర్దిష్ట వ్యవస్థపై మాత్రమే పనిచేయాలి

iii)  ఔషధం అపాయం లేకుండా, దీర్ఘకాలం పనిచేయాలి

iv) జీవకణాలకు హాని చేయరాదు

1)  i, ii మాత్రమే    2)  ii, iii మాత్రమే    3) iii, iv మాత్రమే     4) పైవన్నీ


2. కింది వాటిలో సూక్ష్మజీవి వినాశకాలు ఏవి?

1) యాంటీ బయోటిక్‌లు     2) యాంటీ సెప్టిక్‌లు 

3) వైరస్‌ వినాశకాలు    4) పైవన్నీ


3. పెన్సిలిన్‌ అనేది ఒక - 

1) యాంటీ బయోటిక్‌     2) యాంటీ సెప్టిక్‌    3) మలేరియా నిరోధకం     4) పైవేవీ కావు


4. అమోక్సిసిలిన్‌ ఏ రకానికి చెందిన యాంటీ బయోటిక్‌?

1) సెఫాలోస్పోరిన్‌    2) టెట్రాసైక్లిన్‌    3) పెన్సిలిన్‌   4)  మాక్రోలైడ్‌


5. సెఫాలోస్పోరిన్, టెట్రాసైక్లిన్, ఫ్లోరోక్వినోలోన్‌లు ఏ రకానికి చెందిన ఔషధాలు?

1) జ్వర నిరోధకాలు  2) యాంటీ సెప్టిక్‌లు

3) యాంటీ బయోటిక్‌లు    4) బాధ నిరోధకాలు


6. కింది వాటిలో వైరస్‌ వినాశకం ఏది?

1) అసిక్లోవిర్‌   2) అబాకవిర్‌     3) 1, 2    4) క్లోరోక్విన్‌


7. రెమ్‌డెసివిర్‌ అనేది ఒక..........

1) యాంటీ బయోటిక్‌    2)  యాంటీ సెప్టిక్‌

3) వైరస్‌ వినాశకం  4) తీపికారకం


8. కింది వాటిలో మలేరియా నిరోధకానికి ఉదాహరణ ఏది?

1)  క్వినైన్‌   2) క్లోరోక్విన్‌     3) 1, 2   4) సిప్రోఫ్లోక్సాసిన్‌


9. కింది వాటిలో యాంటీ బయోటిక్‌కు ఉదాహరణ ఏది?

1) స్ట్రెప్టోమైసిన్‌     2) జెంటామైసిన్‌     3) నియోమైసిన్‌     4) పైవన్నీ


10. అజిత్రోమైసిన్‌ అనేది ఒక....... 

1) యాంటీ ఆక్సీకరణి    2) యాంటాసిడ్‌

3)అధిక కొవ్వు నిరోధకం   4) యాంటీ బయోటిక్‌


11. క్లోరోక్సైలినోల్, టెర్పినియోల్‌ల మిశ్రమాన్ని ఏమంటారు?

1) డెట్టాల్‌    2) ఫార్మలిన్‌   3)  టింక్చర్‌ ఆఫ్‌ అయోడిన్‌    4) 2, 3


12. కింది వాటిలో యాంటీ సెప్టిక్‌ గుణం  కలిగినవేవి?

1) బిలియనోల్‌     2) డెట్టాల్‌   3) బోరిక్‌ ఆమ్లం  4) పైవన్నీ


13. ఫార్మాల్డిహైడ్‌ జలద్రావణాన్ని ఏమంటారు?

1) ఫినాల్‌  2) ఫార్మలిన్‌     3) ఆస్పిరిన్‌   4)మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా

14. కింది వాటిలో పురుగువ్యాధి నిరోధకం ఏది?

1) మెబెండజోల్‌     2) ఆల్‌బెండజోల్‌    3) 1, 2     4) కెటకొనజోల్‌


15. ఐవర్‌మెక్టిన్‌ అనేది దేనికి సంబంధించింది?

1)  శిలీంధ్రనాశకం   2)  క్రిమిసంహారకం 

3) పురుగువ్యాధి నిరోధకం   4) పైవేవీ కావు


16. కింది ఏ ఔషధం క్షయవ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది?

1) ఆస్పిరిన్‌     2) డైక్లోఫినాక్‌    3) రిఫాంపిసిన్‌     4) క్వినిడిన్‌


17. కేంద్ర నాడీవ్యవస్థపై పనిచేసే ఔషధాలను ఏమంటారు?

1) మనోచికిత్సా కారకాలు    2) సూక్ష్మజీవి వినాశకాలు

3) శరీర ధర్మశీలతా ఔషధాలు    4) పైవేవీ కావు


18. కింది వాటిలో సరైన ప్రవచనం ఏది?

i)  మనోచికిత్సా కారకాలు మనోవైఖరిని ప్రభావితం చేస్తాయి

ii)  నొప్పిని తగ్గించడం లేదా పూర్తిగా నయంచేసే ఔషధాలను ‘నొప్పి నిరోధకాలు’ అంటారు.

1) i మాత్రమే   2)  ii  మాత్రమే    3) i, ii    4) పైవేవీ కావు


19. డైక్లోఫినాక్‌ ఏ రకానికి చెందిన ఔషధం?

1) జ్వర నిరోధకం     2) యాంటీ బయోటిక్‌

3) బాధ నిరోధకం    4) ప్రశాంతకారులు


20. కింది వాటిలో బాధ నిరోధకాలు లేదా నొప్పి నిరోధకాలు ఏవి?

1) ఆస్పిరిన్‌   2)  ఐబుప్రొఫెన్‌    3) 1, 2     4) డాక్సీసైక్లిన్‌


21. ఆస్పిరిన్‌ రసాయన నామం ఏమిటి?

1) బ్యుటైల్‌ ఎసిటేట్‌    2) బ్యుటిరిక్‌ ఆమ్లం

3) ఎసిటైల్‌ అమినో ఫినాల్‌     4)అసిటైల్‌ శాలిసిలిక్‌ ఆమ్లం


22. కింది వాటిలో జ్వరాన్ని తగ్గించే ఔషధం ఏది?

1)  పారాసిటమాల్‌     2) ఆస్పిరిన్‌    3) 1, 2    4) అజిత్రోమైసిన్‌


23. పారాసిటమాల్‌ను పరిమితికి మించి వాడితే శరీరంలోని ఏ భాగం దెబ్బతింటుంది?

1) మెదడు    2) కాలేయం    3) మూత్రపిండాలు    4) పైవేవీ కావు


24. అనవసర ఆందోళన, అత్యుత్సాహాన్ని తగ్గించే ఔషధాలను ఏమంటారు?

1) సమ్మోహనకారులు    2) ప్రశాంతకారులు   3) వణుకు నిరోధకాలు  4) మూర్చవ్యాధి నిరోధకాలు


25. సెరోటోనిన్, డయజీపామ్‌ ఏ రకానికి చెందిన ఔషధాలు?

1) ప్రశాంతకారులు    2) యాంటీ సెప్టిక్‌లు    3) 1, 2    4) మనోవ్యాకులత నిరోధకాలు


26. దీర్ఘనిద్రను కలిగించే ఔషధాలను ఏమంటారు?

1) యాంటాసిడ్‌లు    2) యాంటీ ఆక్సీకరణులు    3) బాధ నిరోధకాలు  4) సమ్మోహనకారులు


27. కింది వాటిలో దీర్ఘనిద్రను కలిగించే ఔషధాలు ఏవి?

1) బెంజోడయజీపైన్‌    2) బార్బిటురేట్‌     3) 1, 2     4) పారాసిటమాల్‌


28. మనోవ్యాకులతను తగ్గించే ఔషధాలకు ఉదాహరణ.... 

1) ఇమిప్రమైన్‌    2) పారాసిటమాల్‌    3) ఆస్పిరిన్‌     4) ఒండాన్‌సెట్రాన్‌


29. పార్కిన్‌సన్‌ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఔషధం ఏది?

1) లీవోడోపా    2) సాల్‌బ్యుటమాల్‌    3) అంబ్రోక్సాల్‌     4) బ్రోమెక్సిన్‌


30. ఉబ్బస వ్యాధి ప్రేరణకు కారణాలు?

1) చల్లని నీరు     2) చల్లని గాలి      3) ధూళి కణాలు     4) పైవన్నీ


సమాధానాలు

1-4 2-4 3-1 4-3 5-3 6-3 7-3 8-3 9-4 10-4 11-1 12-4 13-2 14-3 15-3 16-3 17-1 18-3 19-3 20-3 21-4 22-3 23-2 24-2 25-1 26-4 27-3  28-1 29-1 30-4.


మరికొన్ని..


1. కింది వాటిలో ఉబ్బస వ్యాధి  నిరోధకాలు ఏవి?

1) సాల్‌బ్యుటమాల్‌  2) థియోఫిలిన్‌      3) ఆమ్లడిపైన్‌       4) 1, 2


2. కింది వాటిని జతపరచండి

  జాబితా - A        జాబితా - B 

A. దగ్గు నిరోధకం      i)  క్లోర్‌ఫెనిరమైన్‌

B. అలర్జీ నిరోధకం    ii) ఫినైల్‌ ఎఫ్రిన్‌

C. డీకాంజెసెంట్‌     iii) డెక్ట్రోమిథార్పన్‌

1) A-iii, B-ii, C-i      2) A-ii, B-i, C-iii      3) A-iii, B-i, C-ii    4) A-i, B-iii, C-ii
 

3. కింది వాటిలో గళ్లను పలచబరిచే ఔషధం ఏది?

1) అంబ్రోక్సాల్‌       2) బ్రోమోక్సిన్‌    3) గ్లిమెపిరైడ్‌      4) 1, 2


4. కింది వాటిలో అధిక రక్తపోటు నిరోధకాలకు ఉదాహరణ ఏది?

1) అటినోలాల్‌     2) ఆమ్లాడిపైన్‌     3) ఫెలోడిపైన్‌     4) పైవన్నీ


5. క్యాప్టోప్రిల్, ఇనాలప్రిల్‌ ఔషధాల ఉపయోగం ఏమిటి?

1)  అల్సర్‌ను తగ్గిస్తాయి    2)  రక్తపోటును తగ్గిస్తాయి 

3) జఠరరసాన్ని తటస్థీకరిస్తాయి     4) జ్వరాన్ని తగ్గిస్తాయి


6. యాంటాసిడ్‌గా ఉపయోగించే ఔషధాలు ఏవి?

1)  అల్యూమినియం హైడ్రాక్సైడ్‌     2) మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా 

3)  నైట్రోగ్లిజరిన్‌     4) 1, 2


7. జీర్ణకోశం లేదా పేగుల్లో ఏర్పడే అల్సర్‌ను నయంచేసే ఔషధం ఏది?

1) రానిటిడిన్‌    2) ఒమెప్రజోల్‌    3) పెంటోప్రజోల్‌      4) పైవన్నీ


8. కింది వాటిలో విరోచన నిరోధకాలకు ఒక ఉదాహరణ..... 

1) లోపరమైడ్‌     2) బుమిటనైడ్‌    3) రానిటిడిన్‌   4) పైవేవీ కావు


9. మధుమేహాన్ని నియంత్రించగలిగే ఔషధాలు ఏవి?

1) మెట్‌ఫార్మిన్‌     2) గ్లిమెపిరైడ్‌    3) సాక్సాగ్లిప్టిన్‌     4) పైవన్నీ


10. కింది వాటిలో అధిక కొవ్వు నిరోధకాలుగా పనిచేసేది?

1) అటోర్వాస్టాటిన్‌     2) సిమ్వాస్టాటిన్‌     3)ఫినోఫైబ్రేట్‌     4) పైవన్నీ


11. కింది వాటిలో కృత్రిమ తీపికారకాలు ఏవి?

1) ఆస్పార్టెమ్‌   2) అలిటేమ్‌    3) సుక్రలోజ్‌     4)పైవన్నీ


12. అతి ముఖ్యమైన ఆహార పదార్థాల సంరక్షణకు ఉపయోగించే రసాయనం ఏది?

1) సోడియం బెంజోయేట్‌      2) సుక్రలోజ్‌      3) 1, 2    4) శాకరిన్‌


13. ఆహారంలో యాంటీ ఆక్సీకరణిగా ఉపయోగించే రసాయనాలు ఏవి?

1) సల్ఫర్‌ డైఆక్సైడ్‌    2) BHT     3) BHA     4) పైవన్నీ


14. శాకరిన్‌ అనేది ఒక -

1) ఆహారపు రంగు     2) యాంటీ ఆక్సీకరణి 

3) సుగంధం    4) కృత్రిమ తీపికారకం


15. వాతావరణంలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి ఆహారాన్ని రక్షించే రసాయనాలను  ఏమంటారు?

1) కృత్రిమ తీపికారకాలు     2) యాంటీ ఆక్సీకరణులు  

3) పోషక విలువలు పెంచే పదార్థాలు     4) పైవేవీ కావు


16. అలిటేమ్‌ అనే కృత్రిమ తీపికారకం సహజ చక్కెర కంటే ఎన్ని రెట్లు తియ్యగా ఉంటుంది?

1)  200   2) 2000   3) 1000   4)100


సమాధానాలు

1-4  2-3  3-4  4-4  5-2  6-4  7-4  8-1  9-4 10-4 11-4 12-1 13-4 14-4 15-2 16-2.

Posted Date : 31-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌