మనం ఆధునికమని భావించే ఆధునిక భౌతికశాస్త్రం సుమారు 100 సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైంది. 'మాక్స్‌ప్లాంక్' అనే శాస్త్రవేత్త, 1900 సంవత్సరంలో, కృష్ణవస్తు వికిరణాన్ని వివరించడానికి ప్రతిపాదించిన 'క్వాంటం సిద్ధాంతం' సంప్రదాయ భౌతిక శాస్త్ర భావనలకు చరమగీతం పాడింది. సంప్రదాయ భౌతికశాస్త్రం, ద్రవ్యాన్ని స్థూల స్థాయి (macro level) లో పరిగణిస్తే, ఆధునిక భౌతిక శాస్త్రం సూక్ష్మస్థాయి (macro level) లో అంటే పరమాణు స్థాయిలో పరిగణిస్తుంది. సంప్రదాయ, ఆధునిక భౌతిక భావనలు, భౌతిక శాస్త్రానికి రెండు కళ్లలాంటివి.
అవిభాజ్యం...
ద్రవ్యం (matter) అవిచ్ఛిన్నం (continuous) గా కనిపించినా, జ్ఞానేంద్రియాలు గుర్తించలేని సూక్ష్మ స్థాయిలో నిర్ణీత విచ్ఛిన్న (discrete)నిర్మాణాన్ని కలిగి ఉందేమోనని భావించిన మానవాళికి 150 సంవత్సరాల తర్వాత, పరమాణు నిర్మాణంపై ఒక అవగాహన కలిగింది. పదార్థం లేదా ద్రవ్యాన్ని విభజిస్తూ పోతే, మిగిలే అవిభాజిత కణమే పరమాణువు (atom). ఒక మూలక పరమాణువు చిన్నదే అయినప్పటికీ, అది ఆ మూలక ధర్మాల ప్రతినిధి. వేర్వేరు మూలక పరమాణువులు, వేర్వేరు ధర్మాలతో ఉంటాయి. క్రీ.పూ. 600 నాటికే వైశేషిక వ్యవస్థను రూపొందించిన 'కణాదుడు' పదార్థ సూక్ష్మ, మౌలిక కణాలను గుర్తించాడు. 1803లో 'డాల్టన్' ప్రతిపాదించిన 'పరమాణు సిద్ధాంతం' ప్రకారం ద్రవ్యం విచ్ఛిన్నంగా ఉండే పరమాణువులతో నిర్మితమైంది.
ఆధునిక భౌతికశాస్త్రం
Posted Date : 13-10-2020
కానిస్టేబుల్స్ : ప్రిలిమ్స్
పాత ప్రశ్నపత్రాలు
- టీఎస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - 28-08-2022
- టీఎస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - 28-08-2022
- టీఎస్ పోలీసు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష
- టీఎస్ పోలీసు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష
- టీఎస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - 28-08-2022
విద్యా ఉద్యోగ సమాచారం
- TSPSC: 7.41 లక్షలు దాటిన గ్రూప్-4 దరఖాస్తులు
- Latest Current Affairs: 27-01-2023 Current Affairs (English)
- Latest Current Affairs: 27-01-2023 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- Latest News: 28-01-2023 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
- IT Jobs: కార్స్24లో 500 ఉద్యోగాలు
- Job Fair: 30న జాబ్ మేళా
నమూనా ప్రశ్నపత్రాలు
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ 2 - 2022
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ 3 - 2022
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ - 1 2022
- ఎస్సై మోడల్ పేపర్ 1 - 2022
- ఎస్సై మోడల్ పేపర్ 2 - 2022