• facebook
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం పాత్ర

1. టాల్కమ్ పౌడర్‌లో ప్రధానంగా ఉండే రసాయన పదార్థం ఏది?
జ: మెగ్నీషియం సిలికేట్

 

2. కిందివాటిలో దేన్ని స్మెల్లింగ్ సాల్ట్ అని పిలుస్తారు?
     ఎ) అమ్మోనియం కార్బొనేట్      బి) కాల్షియం కార్బొనేట్     సి) సోడియం సిలికేట్      డి) పొటాషియం సిలికేట్
జ: ఎ (అమ్మోనియం కార్బొనేట్)

 

3. కాయలను కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే హైడ్రోకార్బన్ ఏది?
జ: ఇథిలీన్

 

4. బెంజీన్ రసాయన ఫార్ములా ఏది?
జ: C6H6

 

5. కిందివాటిలో సూపర్ కూల్డ్ లిక్విడ్ (super cooled liquid) ఏది?
     ఎ) గాజు           బి) ఐస్‌క్రీం                సి) మెర్క్యురీ           డి) టెఫ్లాన్
జ: ఎ (గాజు)

 

6. కిందివాటిలో బొగ్గు రూపం ఏది?
     ఎ) గ్రానైట్           బి) మాలగ్నైట్        సి) హైమటైట్          డి) లిగ్నైట్
జ: డి (లిగ్నైట్)

 

7. భారజలం రసాయన ఫార్ములా ఏమిటి?
జ: D2O

 

8. ఆటంబాంబు తయారీలో ఇమిడి ఉన్న సూత్రం ఏది?
జ: కేంద్రక విచ్ఛిత్తి

 

9. సిన్నబార్ అనేది ఏ లోహం ముఖ్య ధాతువు (Ore)?
జ: మెర్క్యురీ

 

10. హైడ్రోజన్ రకాలైన 1H, 1H, 1H లను సాధారణంగా ఏమని పిలుస్తారు?
జ: ఐసోటోప్‌లు

 

11. పారిశ్రామికంగా నూనెలను కొవ్వులుగా మార్చే ప్రక్రియను ఏమంటారు?
జ: క్షయకరణం

 

12. సోడియం క్లోరైడ్ జలద్రావణ స్వభావం ఏమిటి?
జ: తటస్థ స్వభావం

 

13. మున్సిపాలిటీవారు నీటిని శుద్ధి చేయడానికి రసాయనికంగా ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు?
జ: క్లోరినేషన్

 

14. కార్బొరాండం ఫార్ములా ఏది?
జ: SiC

 

15. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్ని ఏమంటారు?
జ: సెమీవాటర్ గ్యాస్

 

16. PVC అనే పాలిమర్‌లోని మోనోమర్ ఏది?
జ: వినైల్ క్లోరైడ్

 

17. కిందివాటిలో దేనికి పేలే స్వభావం (Explosive) ఉంది?
     ఎ) అమ్మోనియా          బి) అమ్మోనాల్          సి) అమ్మోటాల్         డి) పర్‌హైడ్రాల్
జ: బి (అమ్మోనాల్)

 

18. ఏ ఆమ్లాన్ని ఆక్వాపోర్టేస్ అని పిలుస్తారు?
జ: నైట్రిక్ ఆమ్లం

 

19. ఆల్కలీ (Alkali) అని వేటిని అంటారు?
జ: నీటిలో కరిగిన క్షారాలు

 

20. బ్లూ విట్రియోల్ అణులవణం ఏ లోహానికి సంబంధించింది?
జ: కాపర్

 

21. నీటి కాలుష్యానికి సంబంధించిన పదాలైన COD, BODలలో 'D' అనే అక్షరం దేన్ని తెలియజేస్తుంది?
జ: Demand

 

22. బెంగాల్ సాల్ట్ పీటర్ అని ఏ లోహ లవణాన్ని పిలుస్తారు?
జ: పొటాషియం

 

23. కిందివాటిలో దేన్ని డ్రై కోల్డ్, డ్రై ఐస్ అని పిలుస్తారు?
     ఎ) ఘన N2         బి) ఘన O2         సి) ఘన CO2         డి) మంచు
జ: సి (ఘన CO2)

 

24. ఫార్మలీన్ అని దేన్ని పిలుస్తారు?
జ: 40% ఫార్మాల్డీహైడ్

 

25. కిందివాటిలో సూపర్ హాలోజన్ ఏది?
     ఎ) F           బి) Cl           సి) Br           డి) I
జ: ఎ (F)

 

26. యూక్లోరిన్ వేటి మిశ్రమం?
జ: ClO2 + Cl2

 

27. గ్రేప్ షుగర్ (Grape Sugar) అని దేన్ని పిలుస్తారు?
జ: గ్లూకోజ్

 

28. BHC ని సాధారణంగా గమాక్సిన్ అని పిలుస్తారు. దీన్ని చీమల మందుగా ఉపయోగిస్తారు. BHC అంటే...?
జ: Benzene Hexa Chloride

 

29. మొట్టమొదటిసారిగా కృత్రిమంగా తయారుచేసిన సిల్క్?
జ: రేయాన్

 

30. ఏ రెండు పేర్లలోని అక్షరాలతో నైలాన్ (Nylon) అనే పదాన్ని రూపొందించారు?
జ: న్యూయార్క్, లండన్

 

31. సిమెంట్ తయారీలో ఉపయోగించే ముడి ఖనిజాల్లో అత్యధిక శాతం ఉండే పదార్థం?
జ: కాల్షియం ఆక్సైడ్

 

32. కంటి అద్దాల్లో ఉపయోగించే గాజు ఏది?
జ: క్రూక్స్ గాజు

 

33. ప్రయోగశాలలో కార్బొహైడ్రేట్స్/ పిండి పదార్థాలను గుర్తించడానికి ఉపయోగించే రసాయన కారకం పేరు?
జ: మాలిష్ కారకం

 

34. రెక్టిఫైడ్ స్పిరిట్ (Rectified Spirit) లో ఉండే ఇథైల్ ఆల్కహాల్ శాతం?
జ: 96%

 

35. ట్రాన్స్‌యురేనిక్ మూలకాలను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ: సిబోర్గ్

 

36. నెయిల్ పెయింట్ (Nail paint)ను తీసివేయడానికి ఉపయోగించే రసాయన పదార్థం ఏది?
జ: ఎసిటోన్

 

37. భారజలాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ: యూరే

 

38. ఉత్ప్రేరకాన్ని (catalyst) మొదట కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ: బెర్జిలియస్

 

39. 1984లో భోపాల్ పట్టణంలో MIC అనే విషవాయువు విడుదలై అనేక వేలమంది మరణించారు. MIC అంటే ఏమిటి?
జ: మిథైల్ ఐసోసయనేట్

 

40. నీటి కఠినత్వాన్ని లెక్కించడంలో ఉపయోగించే ప్రమాణం ఏది?
జ: ppm

 

41. పెట్రోలియం ఈథర్ అనేది ఒక...
జ: హైడ్రోకార్బన్

 

42. డ్రైక్లీనింగ్‌లో ఉపయోగించే రసాయన పదార్థం ఏది?
జ: బెంజీన్

 

43. పచ్చికాయలను కృత్రిమంగా మగ్గించడానికి ఏ రసాయన పదార్థాన్ని వినియోగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది?
జ: కాల్షియం కార్బైడ్

 

44. గ్యాస్ వెల్డింగ్ చేయడానికి సిలెండర్‌లో నింపే వాయువు ఏది?
జ: ఎసిటలీన్

 

45. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించిన విషవాయువు పేరు 'మస్టర్డ్ గ్యాస్'. దీని తయారీలో ఉపయోగించే హైడ్రోకార్బన్ పేరేంటి?
జ: ఇథిలీన్

 

46. వాతావరణంలో ఉండే నత్రజని, ఆమ్లజని నిష్పత్తి సుమారుగా...
జ: 4 : 1

 

47. నవ్వు పుట్టించే వాయువు (laughing gas) లో ఉండే మూలకాలు ఏవి?
జ: నత్రజని, ఆమ్లజని

 

48. ప్రకృతిలో హీలియం, ఫాస్ఫరస్, సల్ఫర్‌ల స్థిరమైన రూపాలు వరుసగా...
జ: He, P4, S8

 

49. కార్బన్ రూపాంతరమైన బక్‌మినిస్టర్ పుల్లరిన్‌లో ఉండే కనీస కార్బన్ పరమాణువుల సంఖ్య?
జ: 60

 

50. సున్నపురాయి రసాయన ఫార్ములాలో ఉన్న మొత్తం పరమాణువుల సంఖ్య?
జ: 5


ముఖ్యమైన ప్రశ్నలు

1. పోర్ట్‌లాండ్ సిమెంట్‌ను మొదట తయారు చేసింది ఎవరు?
జ: ఎస్పిడిన్

 

2. కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ మిశ్రమాన్ని ఏమంటారు?
జ: సిమెంట్

 

3. పల్వరైజేషన్ అంటే...?
జ: ముడిపదార్థాలను సన్నటి పౌడర్‌గా మార్చడం

 

4. సిమెంట్ తయారీలో ముడిపదార్థాలను కింది ఏ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు?
జ: 1700°C - 1900°C

 

5. ఒక భాగం తడిసున్నం, మూడు భాగాల ఇసుక, నీటి మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు?
జ: లైమ్ మోర్టార్

 

6. గాజు తయారీలో వాడే ముడిపదార్థాలు?
       ఎ) సున్నపురాయి        బి) సిలికా        సి) సోడా యాష్        డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

7. గాజు అంటే...
జ: సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్

 

8. గాజు పాత్రలపై పెయింటింగ్ వేయడానికి ఉపయోగించే ఆమ్లం?
జ: హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం

 

9. ద్రవ గాజును అతినెమ్మదిగా చల్లబరిచే ప్రక్రియను ఏమంటారు?
జ: మందశీతలీకరణం

 

10. కిందివాటిలో అత్యధికంగా చల్లబరిచిన ద్రవపదార్థం?
       ఎ) ఐస్‌క్రీమ్        బి) గ్లాస్        సి) మెర్క్యురీ        డి) టెఫ్లాన్
జ: బి (గ్లాస్)

 

11. గాఢ ఆమ్లాలను నిల్వ చేయడానికి వాడే పాత్ర?
జ: గాజు

 

12. గ్లాస్ బ్లోయింగ్ అంటే ఏమిటి?
జ: మెత్తటి గాజులోకి గాలిని పంపి వివిధ ఆకారాలున్న గాజు పాత్రలను తయారు చేయడం

 

13. ఎలక్ట్రిక్ బల్బ్‌ల తయారీలో ఉపయోగించే గాజు?
జ: ఫ్లింట్ గాజు

 

14. కింది ఏ లోహ లవణం వల్ల గాజుకు ఆకుపచ్చ వర్ణం వస్తుంది?
        ఎ) ఫెర్రిక్ ఆక్సైడ్         బి) మాంగనీస్ ఆక్సైడ్        సి) కాపర్ సల్ఫేట్         డి) క్రోమిక్ ఆక్సైడ్
జ: డి (క్రోమిక్ ఆక్సైడ్)

 

15. కిటికీ అద్దాల తయారీలో ఉపయోగించే గాజు?
జ: సోడా గాజు

 

16. గడ్డం చేసుకోవడానికి వాడే సబ్బులో అధికపాళ్లలో ఉండే రసాయన పదార్థం?
జ: స్టియరిక్ ఆమ్లం

Posted Date : 13-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌