• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు

నమూనా ప్రశ్నలు


1. హిందీ 'కేంద్ర ప్రభుత్వ అధికార భాష' అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
జ‌: 343 (1) నిబంధన

 

2. భారత రాజ్యాంగంలోని అధిక భాగాన్ని దేని నుంచి గ్రహించారు?
జ‌: భారత ప్రభుత్వ చట్టం - 1935

 

3. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది కావడానికి కారణం కానిది?
1) ఏక కేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఉండటం
2) కేంద్ర - రాష్ట్ర సంబంధాలను సవివరంగా పొందుపరచడం
3) ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలను పొందుపరచడం
4) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలను స్పష్టంగా పేర్కొనడం
జ‌: 1(ఏక కేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఉండటం)

 

4. ఏ ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించని అంశం ఏది?
జ‌: పంచాయతీరాజ్ వ్యవస్థ

 

5. 'భారత రాజ్యాంగ పితామహుడు' ఎవరు?
జ‌: డా.బి.ఆర్.అంబేడ్కర్

 

6. కిందివాటిలో భారత రాజ్యాంగానికి సంబంధించి సరికానిది ఏది?
     1) భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం                            2) భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వం ఉంది
     3) అనేక ఏక కేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్య వ్యవస్థ    4) రాజ్యసభ పదవీకాలం 6 సంవత్సరాలు
జ‌: 4(రాజ్యసభ పదవీకాలం 6 సంవత్సరాలు)

 

7. భారత రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి సరైంది ఏది?
1) బిల్లును మొదట లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి   2) మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి
3) ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు                       4) ఉభయ సభల సంయుక్త సమావేశంలో నిర్ణయిస్తారు
జ‌: 3(ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు)

 

8. కిందివాటిని జతపరచండి.
A) బ్రిటిష్ రాజ్యాంగం                    i) అంతర్ రాష్ట్ర వాణిజ్యం
B) అమెరికా రాజ్యాంగం                 ii) యూనియన్ ఆఫ్ స్టేట్స్
C) ఆస్ట్రేలియా రాజ్యాంగం            iii) స్పీకర్ వ్యవస్థ
D) కెనడా రాజ్యాంగం                    iv) ఉపరాష్ట్రపతి
జ‌: A-iii, B-iv, C-i, D-ii

 

9. కిందివాటిని జతపరచండి.
A) ఏక కేంద్ర ప్రభుత్వ లక్షణం       i) మంత్రిమండలి సమష్టి బాధ్యత
B) సమాఖ్య లక్షణం                        ii) ఏక పౌరసత్వం
C) పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం  iii) పార్లమెంట్‌లో 2/3వ వంతు మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించడం
D) దృఢ రాజ్యాంగ లక్షణం             iv) రాజ్యాంగ ఆధిక్యత
‌: A-ii, B-iv, C-i, D-iii

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌