• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో సామాజిక వికాస పథకాలు

1. మన దేశంలో గ్రామ పంచాయతీల ఏర్పాటును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?
జ: ఆర్టికల్‌ 40

 

2. సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని (సీడీపీ) జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
జ: 1952, అక్టోబరు 2

 

3. సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదటిసారిగా ఎంపిక చేసిన 50 జిల్లాల్లో ఎన్ని బ్లాకుల్లో ప్రారంభించారు?
జ: 55

 

4. సమాజ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏయే రంగాల్లో సమగ్రాభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు?
     1) వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, ప్రాథమిక విద్య     2) ప్రజారోగ్యం, ఆర్థికప్రగతి, గృహవసతి
     3) సామాజిక సేవ, సాంఘిక సంక్షేమం                       4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

5. సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి గ్రామస్థాయిలో నియమించిన అధికారి ఎవరు?
జ: గ్రామ సేవక్‌

 

6. కిందివాటిలో సరికానిది.
1) NESS అంటే National Extension Service Scheme     
2) NESS ను 1953, అక్టోబరు 2న ప్రారంభించారు. 
3) NESSను శాశ్వత ప్రాతిపదికపై రూపొందించారు.
4) NESS ను మూడేళ్ల కాలపరిమితితో రూపొందించారు.
జ: 4 (NESS ను మూడేళ్ల కాలపరిమితితో రూపొందించారు.)

 

7. NESS పథకాన్ని సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: ఎస్‌.కె. డే

 

8. CDP, NESS లపై సమీక్షించేందుకు 1957లో ఏర్పాటైన కమిటీ?
జ: బల్వంతరాయ్‌ మెహతా కమిటీ

 

9. మనదేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫారసు చేసిన కమిటీ?
జ: బల్వంతరాయ్‌ మెహతా కమిటీ

 

10. మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని మొదటిసారిగా రాజస్థాన్‌లో ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1959, అక్టోబరు 2

 

11. ఆంధ్రప్రదేశ్‌లో మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని 1959, నవంబరు 1న ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రారంభించారు?
జ: నీలం సంజీవరెడ్డి

 

12. 1977 డిసెంబరులో పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం కోసం అశోక్‌మెహతా కమిటీని నియమించిన ప్రధాని ఎవరు?
జ: మొరార్జీ దేశాయ్‌

 

13. అశోక్‌మెహతా కమిటీ సిఫారసు చేసిన రెండంచెల పంచాయతీరాజ్‌ విధానంలో అత్యంత కీలకమైన అంచె?
జ: మండల పరిషత్‌

 

14. అశోక్‌మెహతా కమిటీ గ్రామ పంచాయతీలను రద్దుచేసి వాటి స్థానంలో వేటిని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది?
జ: గ్రామ కమిటీలు

 

15. కిందివాటిలో అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల్లో లేనిది?
1) స్థానిక సంస్థల పదవీకాలం నాలుగేళ్లు ఉండాలి.
2) పంచాయతీరాజ్‌ మంత్రిని ఏర్పాటుచేయాలి.
3) పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలి.
4) పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయకూడదు.
జ: 4 (పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయకూడదు.)

 

16. అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల్లో కీలకమైన మండల పరిషత్‌ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం?
జ: కర్ణాటక

 

17. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మండలాలను ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది?
జ: 1985

 

18. అశోక్‌మెహతా కమిటీ మొత్తం ఎన్ని సిఫారసులు చేసింది?
జ: 132

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌