• facebook
  • whatsapp
  • telegram

లింగ అసమానతలు - రకాలు

ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంఘీభావ ఉద్యమం (UN Global Solidarity Movement)
* ఇది లింగ సమానత్వం కోసం చేపట్టిన ఉద్యమం.
* ఐక్యరాజ్య సమితి సాధారణ సభ దీన్ని 2014, సెప్టెంబరు 20న ప్రారంభించింది.
* దీనికి మరో పేరు 'He for She' ఉద్యమం.
ఆర్థికపరమైన అసమానతలు (Economic Inqualities):
* స్త్రీలకు ఆర్థిక విషయాల్లో భాగస్వామ్యం లేకపోవడం అసమానతలకు ప్రధాన కారణం.
* స్త్రీలు పురుషులతో పాటు అన్ని రకాల పనుల్లో భాగస్వాములైనప్పటికీ సమాన వేతనం అందడంలో అసమానతలు కనిపిస్తున్నాయి.
* పురుషులు, స్త్రీల Wage Gap Ratio: 1.87
* స్త్రీలకు కేవలం సూక్ష్మ రుణాలు (Micro - Credit) మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
* తండ్రి ఆస్తిలో ఇవ్వాల్సిన సమాన హక్కు వాటాను పొందడంలో కూడా అసమానతలు కనిపిస్తున్నాయి.
* ఆస్తి హక్కు భావనను తెలిపే చట్టాలు
   1. హిందూ వారసత్వ చట్టం - 1956
   2. వివాహితల ఆస్తి హక్కు చట్టం - 1974
* స్త్రీలకు ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం అందడం లేదు.
* మార్క్సిస్ట్ భావజాలం ఉన్న కారల్‌మార్క్స్, ఎంగెల్స్ ప్రకారం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లేదు.
* 2011 భారత జనాభా లెక్కల ప్రకారం దేశంలో పని చేయగలిగిన వయసులో (15-65 సంవత్సరాలు.) ఉన్న మహిళలు 35 కోట్ల మంది.
* 2010 జాతీయ శాంపిల్ సర్వే (NSS) ప్రకారం 11.2 కోట్ల మంది మహిళలు మాత్రమే తమను తాము ఆదాయం కోసం పనిచేసే వారిగా ప్రకటించుకున్నారు.

 

సామాజిక అసమానతలు (Social Inequalities):
భారత సమాజంలో లింగపరమైన అసమానతలు సామాజిక కోణంలో కిందివిధంగా ఉన్నాయి.
  1. వరకట్నం
  2. మహిళలపై హింస
  3. బాలికలు, మహిళల అక్రమ రవాణా
  4. పడుపు వృత్తి
  5. భ్రూణ హత్యలు
  6. లైంగిక దాడులు
  7. యాసిడ్ దాడులు
8. గృహహింస
9. జోగినీ వ్యవస్థ
10. దేవదాసి వ్యవస్థ
11. సరోగసి (అద్దె గర్భం)
* కొండేపూడి నిర్మల 'లేబర్ రూమ్' అనే తన రచనలో గర్భం దాల్చడం, భ్రూణ హత్యల గురించి పేర్కొన్నారు.

 

ఆరోగ్యపరమైన అసమానతలు:
* మహిళలు వివిధ రకాల ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
    1) టీకాలు అందుబాటులో లేకపోవడం.
    2) రెండేళ్ల వయసున్న వారిలో టీకాల అందుబాటు బాలురలో 45.3%, బాలికల్లో 41.7%గా ఉంది.

విద్యాపరమైన అసమానతలు:

* సహస్రాభివృద్ధి లక్ష్యాల (Millennium Development Goals) ప్రకారం 2015 నాటికి లింగ సారూప్యత  సాధించాలి.
అమెరికాకు చెందిన వాణిజ్య విభాగం భారత్‌లో చేసిన అధ్యయనం ప్రకారం విద్యాపరమైన అసమానతలకు ప్రధాన కారణాలు:
  1. పాఠశాల సదుపాయాలు సరిపోయేంతగా లేకపోవడం
  2. మహిళా ఉపాధ్యాయుల కొరత
  3. పాఠ్య ప్రణాళికలో లింగ పక్షపాత వైఖరి
 4. బాలికల పట్ల తల్లిదండ్రుల పక్షపాత వైఖరి వల్ల స్థూల నమోదు నిష్పత్తి (GER) తగ్గుతుంది. ఇది ప్రాథమిక స్థాయిలో 48.5%, ప్రాథమికోన్నత స్థాయిలో 48.1%  ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యత రేటు 82.14% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 65.46%
మాత్రమే.
* మన దేశంలో కేవలం కేరళ, మిజోరం రాష్ట్రాలు మాత్రమే మంచి బాలికా అక్షరాస్యతా రేటును సాధించాయి.
* మాధ్యమిక విద్య పూర్తి చేసిన బాలికలు మన దేశంలో 26.6% ఉండగా, బాలురు 50.4%.
* పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్య ప్రపంచ సగటు 20%. 
   ఈ సగటు కంటే తక్కువ ఉన్న దేశాలు
   1. భారత్ (11.27% , 15వ లోక్‌సభ ఆధారంగా)
   2. శ్రీలంక (4.89%)
  3. అఫ్గనిస్థాన్ (27%, సార్క్ దేశాల్లో మొదటి స్థానం)
  4. పాకిస్థాన్ (1.35%)

 

లింగ అసమానతలు - కారణాలు (Causes of Gender Inequalities)
*
లింగ అసమానత ప్రపంచ వ్యాప్తంగా ఉందని తెలిపింది లోర్బర్.

1. పితృస్వామ్య సమాజం (Patriarchal Society):

* భారత్‌లో కుటుంబ కర్తగా పురుషుడు ఉండటం. అధికార రీత్యా, నాయకత్వ రీత్యా పర్యవేక్షణ పాత్రను పోషించడం, స్త్రీలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం అసమానతకు మౌలిక కారణం.
* ఈ సమాజంలో తండ్రి నుంచి వారసత్వం కొడుకులకు వస్తుంది.
* ఈ వ్యవస్థలో తండ్రి బలమైన వ్యక్తిగా ఉంటాడని తెలిపింది సిల్వియా వాల్చి.
* మనుధర్మ శాస్త్రం ప్రకారం మహిళ పెళ్లికి ముందు తండ్రి, పెళ్లైన తర్వాత భర్త, వృద్ధాప్యంలో లేదా వితంతువుగా ఉన్నప్పుడు కొడుకు సంరక్షణలో ఉండాలి.

 

2. పుత్ర ప్రాధాన్యం:
* అనాది కాలం నుంచి 'పుత్రుడు నరకం నుంచి రక్షిస్తాడు' అనే నమ్మకం ఆడపిల్లలకు ప్రాధాన్యం తగ్గించింది.
* వివిధ పండుగలు, పూజల్లో పుత్రుడికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

 

లింగ సమానత్వం ఎందుకు?
 UN గణాంకాల ప్రకారం: ప్రపంచంలో మొత్తం పని నిర్వహణలో మహిళా భాగస్వామ్యం 2/3వ వంతు.
* ప్రపంచంలో మొత్తం ఆదాయ సంపాదనలో మహిళా భాగస్వామ్యం 1/10వ వంతు.
* ప్రపంచంలో మొత్తం నిరక్షరాస్యతలో మహిళా భాగస్వామ్యం 2/3వ వంతు.
* ప్రపంచంలో మొత్తం ఆస్తులున్న వారిలో మహిళా భాగస్వామ్యం 1/100వ వంతు.

 

రాజ్యాంగపరమైన రక్షణలు (Constitutional Safeguards for Women)
1. ప్రాథమిక హక్కులు:
* ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే.
* ఆర్టికల్ 15(1): లింగపరంగా ఏ పౌరుడిని, పౌరురాలిని వివక్షతకు లోను చేయవద్దు.
* ఆర్టికల్ 15(3): రాజ్యం మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చు.
* ఆర్టికల్ 16: రాజ్యంలోని ఏ హోదాలోనైనా ఉద్యోగావకాశాల్లో సమానత్వం ఉండాలి.
* ఆర్టికల్ 23: వెట్టి చాకిరి, దేవదాసి వ్యవస్థ నిషేధం.

 

2. ఆదేశిక సూత్రాలు: 
* ఆర్టికల్ 39 (a): మహిళలు, పురుషుల జీవనోపాధి రక్షణలో సమానత్వాన్ని పాటించడానికి రాజ్యం
విధానాలను రూపొందించాలి.
* ఆర్టికల్ 39(d): స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం.
* ఆర్టికల్ 42: మాతా, శిశు సంక్షేమానికి ప్రత్యేక సౌకర్యాల కల్పన. (పని ప్రదేశాల్లో మర్యాదకర పరిస్థితులు)
* ఆర్టికల్ 46: విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలను సామాజిక దోపిడీ నుంచి రక్షించడం.
* ఆర్టికల్ 47: ఆరోగ్యం, పోషక విలువల పెంపుదలపై రాజ్యం కృషి చేస్తుంది.

 

3. ప్రాథమిక విధులు: 
* ఆర్టికల్ 51A(c): మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించకూడదు.
 

4. రాజకీయపరమైన రక్షణలు:
* ఆర్టికల్ 243 (D): స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి (1/3 వ వంతు).
*  ఆర్టికల్ 243 (T): నగరపాలక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి (1/3వ వంతు).

 

లింగ అసమానతలు - చట్టాలు

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌