• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యం - భావనలు

1. ద్రవ్య ఆవిర్భావానికి పూర్వం ఆర్థిక వ్యవహారాలు అమల్లో ఉన్న పద్ధతి -
జ: వస్తు మార్పిడి పద్ధతి

 

2. 'ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం' అని అన్నదెవరు?
జ: వాకర్

 

3. కిందివాటిలో చట్టబద్ధ ద్రవ్యాన్ని జారీ చేసేది?
 1) కేంద్ర బ్యాంకు      2) వాణిజ్య బ్యాంకు     3) విదేశీ బ్యాంకు  4) ఏదీకాదు
జ: 1 (కేంద్ర బ్యాంకు)

 

4. కిందివాటిలో ఐచ్ఛిక ద్రవ్యం ఏది?
 1) బాండ్లు     2) సెక్యూరిటీలు    3) చెక్కులు   4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

5. కిందివాటిలో అధిక ద్రవ్యత్వం ఉన్నదేది?
 1) బంగారం   2) వెండి  3) షేర్లు     4) 1000 రూపాయల నగదు
జ: 4 (పైవన్నీ)

 

6. బ్యాంకులు సృష్టించే ద్రవ్యం -
జ: పరపతి ద్రవ్యం

 

7. కిందివాటిలో ఆర్థిక వ్యవహారాల అమలుకు సాధనమయ్యే ద్రవ్యం విధి?
1) వినిమయ మాధ్యమం    2) విలువల కొలమానం   3) విలువల నిధి    4) విలువల బదిలీ
జ: 1) వినిమయ మాధ్యమం

 

8. ద్రవ్య విధులను చలన, నిశ్చల విధులుగా ఎవరు వర్గీకరించారు?
జ: పాల్ ఐంజంగ్

 

9. M1లో లేని అంశాలు 
1) కరెన్సీ   2) డిమాండ్ డిపాజిట్లు   3) ఆర్బీఐ వద్ద ఇతర డిపాజిట్లు   4) పోస్టాఫీసు డిపాజిట్లు
జ: 4) పోస్టాఫీసు డిపాజిట్లు

 

10. కిందివాటిలో అధిక ద్రవ్యత్వం ఉన్నది-
     1) M1       2) M2       3) M3       4) M4
జ: 1 (M1)

 

11. నారోమనీ (సంకుచిత ద్రవ్యం) దేనికి చెందింది?
జ: M1

 

12. కిందివాటిలో దేన్ని 'విశాలద్రవ్య కొలమానం'గా పిలుస్తారు?
     1) M1       2) M2       3) M3       4) M4
జ: 3 (M3)

 

13. కిందివాటిలో అతి తక్కువ ద్రవ్యత్వం ఉన్నదేది?
     1) M1       2) M2       3) M4       4) M3
జ: 3 (M4)

 

14. కిందివాటిలో బ్రాడ్‌మనీ అని దేనికి పేరు?
     1) M1      2) M2       3) M4      4) M3
జ: 3 (M4)

 

15. అధిక శక్తి ఉండే ద్రవ్యాన్ని జారీ చేసేది?
జ: ఆర్‌బీఐ

Posted Date : 07-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌