• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక - మానవాభివృద్ధి 

1. ఆర్థికాభివృద్ధి దేన్ని తెలుపుతుంది?
1) ఉత్పత్తి పెరుగుదల    2) దేశ వ్యవస్థాపూర్వక మార్పులు   3) సాంకేతిక మార్పులు   4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

2. 'ఆర్థిక శ్రేయస్సులో పెరుగుదల ఆర్థికాభివృద్ధి'అని అన్నది ఎవరు?
జ: కొలిన్ క్లార్క్

 

3. ఆర్థికాభివృద్ధి లక్షణం ఏది?
1) దీర్ఘకాలానికి చెందింది     2) చలన ప్రక్రియ  3) వ్యవస్థాపూర్వక మార్పులు   4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

4. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశం ఏది?
1) సాంకేతిక పరిజ్ఞానం   2) మూలధనం    3) విదేశీ వాణిజ్యం    4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

5. 'ఆర్థికాభివృద్ధి బహుముఖ ప్రక్రియ'అని పేర్కొన్నది?
జ: మైఖేల్ పి. తొడారో

 

6. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే ఆర్థిక కారకం కానిది ఏది?
 1) విదేశీ వాణిజ్య స్థితి  2) మూల‌ధ‌న సంచ‌య‌నం  3) వ్యవ‌సాయ మిగులు  4) సాంఘిక వ్యవ‌స్థ స్వరూపం
జ: 4(సాంఘిక వ్యవస్థ స్వరూపం)

 

7. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే ఆర్థికేతర కారకం కానిది?
    1) సాంకేతిక స్థితి    2) మానవ వ‌న‌రులు    3) అవినీతి   4) అంత‌ర్జాతీయ వ్యాపారం
జ:  4(అంతర్జాతీయ వ్యాపారం)

 

8. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి పర్యాయ పదాలుగా తెలిపింది ......
జ: లూయిస్

 

9. 'సుస్థిరాభివృద్ధి' భాగమైన అంశం ఏది?
 1) పర్యావరణం   2) సమాజం    3) ఆర్థిక వ్యవస్థ    4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

10. ఆర్థికాభివృద్ధి ద్వారా ప్రజాసంక్షేమాన్ని పెంచే చర్య కానిది ఏది?
1) సాంకేతిక వృద్ధి   2) స్వయం స‌మృద్ధి   3) స్వావ‌లంబ‌న  4) ప్రాంతీయ అస‌మాన‌త‌లు
జ: 4(ప్రాంతీయ అసమానతలు)

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌