• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు

1. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది?
జ: 4 రాష్ట్రాలు

 

2. రంగారెడ్డి జిల్లా ఏ తేదీన ఏర్పడింది?
జ: 15 ఆగస్టు 1978

 

3. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత?
జ: 3.52 కోట్లు

 

4. అమ్రాబాద్ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
జ: మహబూబ్‌నగర్

 

5. తెలంగాణలోని ఏ ప్రాంతంలో దక్కన్ నాపలను అధికంగా చూడొచ్చు?
జ: పశ్చిమ ప్రాంతం

 

6. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మండలాలున్న జిల్లా ఏది?
జ: మహబూబ్‌నగర్

 

7. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జన సాంద్రత ఉన్న జిల్లాల్లో మొదటిది హైదరాబాద్ అయితే రెండో జిల్లా ఏది?
జ: రంగారెడ్డి

 

8. వైశాల్యపరంగా తెలంగాణ భారతదేశంలో ఎన్నో అతి పెద్ద రాష్ట్రం?
జ: 12

 

9. ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక సరిహద్దు ఉంది?
జ: ఆంధ్రప్రదేశ్

 

10. తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?
జ: మహబూబ్‌నగర్

 

11. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తేదీ ఏది?
జ: జూన్ 2, 2014

 

12. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధిక జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్న తెలంగాణ జిల్లా ఏది?
జ: ఖమ్మం

 

13. తెలంగాణలో అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లా ఏది?
జ: ఆదిలాబాద్

 

14. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి?
జ: 6

 

15. హైదరాబాద్ సముద్ర మట్టానికి సుమారు ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
జ: 600 మీ

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌