• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ నదీ వ్యవస్థ

1. గోదావరి నదికి అతి ముఖ్యమైన కుడి ఉపనదిగా దేన్ని పేర్కొంటారు?
జ: మంజీర

 

2. మంజీరా నది మీద కట్టిన ముఖ్యమైన ప్రాజెక్టు ఏది?
జ: నిజాంసాగర్

 

3. గోదావరి నది ఆదిలాబాద్‌లోని ఏ ప్రాంతం నుంచి తెలంగాణలోనికి ప్రవేశిస్తుంది?
జ: బాసర

 

4. గోదావరి నది మొత్తం పొడవు ఎంత?
జ:1465 కి.మీ.

 

5. ద్వీపకల్ప నదుల్లో అతి పొడవైన నది ఏది?
జ: గోదావరి

 

6. Bison Gorge లోయ ఏ నదీ ప్రవాహం వల్ల ఏర్పడింది?
జ: గోదావరి

 

7. కృష్ణానది ఏ ప్రాంతం నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
జ: తంగడి

 

8. డిండి నది ఏ నదికి ఉపనది?
జ: కృష్ణా

 

9. డిండి నది ఏ పర్వతాల్లో జన్మిస్తుంది?
జ: షాబాద్ కొండలు

 

10. ప్రాణహిత నది గోదావరి నదిలో కలిసే ప్రాంతం?
జ: చెన్నూర్

 

11. మంజీరా నది ఏ జిల్లా నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
జ: మెదక్

 

12. కృష్ణా నది మొత్తం పొడవు సుమారుగా ఎంత?
జ: 1400 కి.మీ.

 

13. మూసీ నది ఒడ్డున వెలసిన మహానగరం ఏది?
జ: హైదరాబాద్

 

14. మూసీ నది ఏ నదికి ఉపనది?
జ: కృష్ణా

 

15. తుంగభద్ర నదికి ముఖ్య ఉపనది ఏది?
జ: హగరి

 

16. మూసీ నది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది?
జ: వజీరాబాద్

 

17. మూసీ నది పొడవు సుమారుగా ఎంత?
జ: 250 కి.మీ.

 

18. డిండి నది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది?
జ: ఏలేశ్వరం

 

19. మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?
జ: డిండి

 

20. ఆలేరు ఏ నదికి ముఖ్య ఉపనది?
జ: మూసీ

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌