• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - భౌతిక అమరిక

చారిత్రక నేపథ్యం

 భారతదేశాన్ని పురాణాల్లో ‘జంబూద్వీపం’గా పేర్కొన్నారు. 

 భరతుడనే రాజు ఈ దేశాన్ని పాలించడం వల్ల అతడి పేరు మీదుగా ‘భరతుడి దేశం’ (భారతదేశం) అనే పేరు వచ్చిందని కొంతమంది భావన. 

 భారతదేశానికి ఉత్తర, వాయవ్యంలో సింధూ నది ప్రవహిస్తుంది. దీన్ని ఆంగ్లంలో ఇండస్‌ (Indus) అంటారు. అందుకే మన దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.

 ఇండస్‌ నది పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలను గ్రీకు వారు ‘ఇండోయిలు’ అని  పిలిచారు. 

 బ్రిటిష్‌ వారు ఇండోయిలను ‘ఇండియన్స్‌’గా పేర్కొన్నారు.


ఉనికి 


భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో, రేఖాంశాలపరంగా పూర్వార్ధగోళంలో ఉంది.

భారతదేశం 8°.4' నుంచి 37°.6' ఉత్తర అక్షాంశాలు, 68°.7' నుంచి 97°.25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.

భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో, హిందూ మహాసముద్రానికి ఎగువ (ఉత్తరం) భాగాన ఉంది.

భారతదేశం మీదుగా దాదాపు 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు వెళ్తున్నాయి.


విస్తీర్ణం 

 భారతదేశం 32,87,263 చ.కి.మీల భూభాగ విస్తీర్ణం కలిగి, ప్రపంచంలోని పెద్ద దేశాల్లో 7వ స్థానంలో ఉంది.

 ప్రపంచంలో భూభాగ విస్తీర్ణంలో మన దేశం కంటే పెద్ద దేశాలు వరుసగా - రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా.

 ప్రపంచ భూభాగంలో భారతదేశం 2.42 శాతం విస్తరించి ఉంది.


రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాలు


స్వాతంత్య్రానికి ముందు భారతదేశాన్ని 562 సంస్థానాలు, 9 బ్రిటిష్‌ ప్రావిన్సులుగా విభజించి, పరిపాలించారు.

స్వాతంత్య్రానంతరం మన దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

 రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కోసం 1953లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 

 దీనికి ఫజల్‌ అలీ అధ్యక్షులుగా, కె.ఎం.ఫణిక్కర్, హృదయనాథ్‌ కుంజ్రు సభ్యులుగా ఉన్నారు. దీన్ని ఫజల్‌ అలీ కమిషన్‌ అని కూడా అంటారు.

 ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం State Reorganization Act 1956  (SRC Act), ని తీసుకొచ్చింది. దీన్ని పార్లమెంట్‌ 1956లో ఆమోదించింది.

 రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.

భాషా ప్రాతిపదికన జరిగిన విభజన ప్రకారం ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.


దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు

గోవా                 1987

ఛత్తీస్‌గఢ్‌       2000, నవంబరు 1

ఉత్తరాఖండ్‌      2000, నవంబరు 9

ఝార్ఖండ్‌        2000, నవంబరు 15

తెలంగాణ       2014, జూన్‌ ప్రస్తుతం భారత్‌లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.

కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్పు

 భారత పార్లమెంట్‌ 2019, ఆగస్టులో జమ్మూ-కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ చట్టం చేసింది. దీని ఆధారంగా 2019, అక్టోబరు 31న జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి.

డామన్‌ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాన్ని దానికి దగ్గరగా ఉండే మరొక కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హవేలీలో విలీనం చేయడానికి 2019లో చట్టం చేశారు. దీని ప్రకారం 2020, జనవరి 26న డామన్‌ డయ్యూను దాద్రానగర్‌ హవేలీలో విలీనం చేశారు.


కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు


లద్దాఖ్‌    -    లేహ్‌ (వేసవి రాజధాని),  కార్గిల్‌ (శీతాకాల రాజధాని)

జమ్మూ-కశ్మీర్‌  -  శ్రీనగర్‌ (వేసవి రాజధాని), జమ్మూ (శీతాకాల రాజధాని)

అండమాన్‌ నికోబార్‌ దీవులు  - పోర్ట్‌బ్లెయిర్‌

దిల్లీ    -    న్యూదిల్లీ

దాద్రానగర్‌ హవేలీ,  -  డామన్‌  డామన్‌ డయ్యూ

పాండిచ్చేరి    -    పాండిచ్చేరి

చండీగఢ్‌    -    చండీగఢ్‌

లక్షదీవులు    -    కవరత్తి

 జాతీయ రాజధాని హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం దిల్లీ.

రెండు రాష్ట్రాలకు (పంజాబ్, హరియాణా) ఉమ్మడి రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం - చండీగఢ్‌విస్తీర్ణపరంగా పెద్ద రాష్ట్రాలు వరుసగా..

 రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ.

విస్తీర్ణపరంగా చిన్న రాష్ట్రాలు వరుసగా..

 గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మిజోరం.

అక్షాంశాలు - రేఖాంశాలు భారతదేశానికి మధ్యగా వెళ్లే అక్షాంశం: 


 231/2 ఉత్తర అక్షాంశ రేఖ అయిన కర్కట రేఖ భారతదేశం మధ్యగా వెళ్తుంది. 

 కర్కట రేఖ భారతదేశంలో సుమారు 2678 కి.మీ. దూరంతో 8 రాష్ట్రాల మీదుగా వెళ్తోంది. అవి పడమర నుంచి తూర్పునకు వరుసగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ్‌ బంగా, త్రిపుర, మిజోరం.

 కర్కట రేఖ మన దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం - మధ్యప్రదేశ్, అత్యల్ప దూరం ప్రయాణించే రాష్ట్రం - రాజస్థాన్‌


భారతదేశానికి మధ్యగా వెళ్లే రేఖాంశం


82 1/ తూర్పు రేఖాంశం దాదాపుగా భారతదేశానికి మధ్యగా తూర్పు నుంచి దక్షిణానికి వెళ్తుంది.

82 1/2 తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక కాలరేఖగా గుర్తించారు. 

భారత కాలమానం గ్రీనిచ్‌ కాలమానం కంటే 5.30 గంటలు ముందు ఉంటుంది.

82 1/2 తూర్పురేఖాంశం మన దేశంలో 5 రాష్ట్రాల మీదుగా వెళ్తోంది. 

అవి: ఉత్తర్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌.


 ఛత్తీస్‌గఢ్‌లోని ‘బైకుంఠాపూర్‌’ వద్ద కర్కట రేఖ, భారత ప్రామాణిక కాలరేఖలు ఖండించుకుంటాయి.  భారత ప్రామాణిక కాలరేఖ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అలహాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పట్టణాల మీదుగా వెళ్తోంది.

 భారతదేశంలో మొదటగా సూర్యోదయం అయ్యే  రాష్ట్రం - అరుణాచల్‌ప్రదేశ్‌.  భారతదేశంలో తూర్పు, పడమరల చివరి ప్రాంతాల మధ్య సమయ వ్యత్యాసం - 2 గంటలు. 


భారతదేశంలోని చివరి ప్రాంతాలు


  తూర్పు: అరుణాచల్‌ప్రదేశ్‌లోని ద్వీపూ కనుమ.

 పడమర: గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌

 ఉత్తరం: ఇందిరాకాల్‌ (కారాకోరం శ్రేణిలోని కిలికిధావన్‌ కనుమలో ఉంది.)

 దక్షిణం: తమిళనాడులోని    కన్యాకుమారి (ప్రధాన భూభాగంలో); ఇందిరాపాయింట్‌ లేదా ఫిగ్మోలియన్‌ పాయింట్‌. ఇది గ్రేట్‌ నికోబార్‌ దీవిలో ఉంది. (దక్షిణ చివరి కొన).

రచయిత

పి.కె. వీరాంజనేయులు

విషయ నిపుణులు 

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌