• facebook
  • whatsapp
  • telegram

వాతావరణం

మాదిరి ప్రశ్నలు

1. వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏది?
1) ఒక ప్రదేశం ఎత్తు         2) నీటి ఆవిరి           3) వాయుప్రవాహాలు                4) ఇవన్నీ
జ: ఇవన్నీ

 

2. ఎత్తయిన ప్రదేశానికి వెళ్లేకొద్ది అక్కడ వాతావరణ పీడనం స్థితి ఏ విధంగా ఉంటుంది?
జ: తగ్గుతుంది

 

3. ప్రపంచంలో ఇప్పటివరకు సముద్రమట్టం వద్ద నమోదైన అత్యధిక వాతావరణ పీడనం ఎంత?
జ: 1083.3 మిల్లీబార్లు

 

4. సముద్ర మట్టం నుంచి ప్రతి 10 మీటర్ల ఎత్తుకు పోయేకొద్ది వాతావరణ పీడనం ఎన్ని మిల్లీబార్ల చొప్పున తగ్గుతుంది?
జ: 13333.2

 

5. భూ ఉపరితలంపై ఏదైనా ఒక విశాల ప్రాంతంలో చాలా ఎక్కువ కాలానికి సంబంధించిన వాతావరణ స్థితుల సరాసరిని ఆ ప్రాంతంలోని ఏ అంశంగా పిలుస్తారు?
జ: శీతోష్ణస్థితి

 

6. అత్యధిక వాతావరణ పీడనం నమోదైన ప్రాంతం ఏది?
జ: సైబీరియాలోని అగాటా

 

7. భూమి ఉపరితలంపై ఎన్ని పీడన మేఖలు ఉన్నాయి?
జ: 7

 

8. సముద్రమట్టం వద్ద టిప్ అనే ప్రాంతంలో నమోదైన అత్యల్ప వాతావరణ పీడనం ఎంత?
జ: 870 మిల్లీబార్లు

 

9. సముద్ర మట్టం వద్ద సామాన్య వాతావరణ పీడనం ఎంత?
జ: 760 మి.మీ.

 

10. వాతావరణంలో ఎక్కువ సాంద్రత ఉన్న పొర ఏది?
జ: ట్రోపో

 

11. జెట్ విమానాలు ప్రయాణించడానికి అనువైన స్థితిగతులు ఉన్న పొర ఏది?
జ: స్ట్రాటో

 

12. రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేసేది?
జ: ఐనో

 

13. భూమి ఉపరితలం నుంచి పైకిపోయేకొద్ది ఉష్ణోగ్రత, వాయుపీడనం....
జ: తగ్గుతాయి

 

14. మనకు ఏమాత్రం తెలియకుండానే మనపై / మానవ శరీరంపై వాతావరణం ఎన్నిటన్నుల బరువును మోపుతుంది?
జ: 20 టన్నులు

 

15. భూమిని ఆనుకుని ఉన్న గాలి వేడెక్కి, వ్యాకోచించి తేలికై, పైకిపోయి చల్లబడటం అనే ప్రక్రియను ఏమంటారు?
జ: సంవహన క్రియ

 

16. ట్రోపో ఆవరణంలో ఎత్తు - ఉష్ణోగ్రత మధ్య సంబంధం..?
జ: విలోమానుపాతం

 

17. స్ట్రాటో ఆవరణంలో ఎత్తు - ఉష్ణోగ్రత మధ్య సంబంధం..?
జ: అనులోమానుపాతం

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌