• facebook
  • whatsapp
  • telegram

భూగోళ‌శాస్త్రం

* పదో పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి భారతదేశంలో నీటిపారుదల సౌకర్యం కల్పించడానికి అంచనా వేసిన సాగుభూమి ఎంత?
జ: 109 మిలియన్ హెక్టార్లు

 

భారీ నీటిపారుదల ప్రాజెక్టు కింద సాగయ్యే భూమి ఎంతకు మించి ఉండాలి?
జ: పదివేల హెక్టార్లు (దాదాపు 25 వేల ఎకరాలు)

 

* పదోపంచవర్ష ప్రణాళిక చివరినాటికి దేశంలోని మొత్తం భారీ నీటిపారుదల ప్రాజెక్టుల సంఖ్య ఎంత?
జ: 162

 

* చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టు అంటే ఏమిటి?
జ: రెండువేల హెక్టార్ల కంటే తక్కువ నీటిపారుదల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు

 

* సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు?
జ: నర్మదా నది

 

* రావి నదిపై నిర్మాణంలో ఉన్న బాగ్లీహార్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
జ: జమ్ము-కాశ్మీర్

 

* మహాకాళి ప్రాజెక్టు ఒప్పందం ఏయే దేశాల మధ్య జరిగింది?
జ: భారతదేశం, నేపాల్

 

బన్సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు?
జ: సోన్ నది

 

* ఆహార ధాన్యాలు అంటే ఏమిటి?
జ: అపరాలు, పప్పుధాన్యాలు

 

* 2005-06 సంవత్సరంలో భారతదేశంలో ఉత్పత్తి చేసిన ఆహార ధాన్యాల పరిమాణం ఎంత?
జ: దాదాపు 210 మిలియన్ టన్నులు

 

* పసుపు విప్లవం (Yellow Revolution) దేనికి సంబంధించింది?
జ: నూనెగింజల అధిక దిగుబడి

 

* భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
జ: పశ్చిమ బెంగాల్

 

* చంబల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
జ: రాజస్థాన్

 

* బియాస్ ప్రాజెక్టు ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకం?
జ: పంజాబ్, హర్యానా, రాజస్థాన్

 

* భాగీరథి-హుగ్లీ నదీవ్యవస్థ ప్రాంతాన్ని నౌకాయాన యోగ్యతను మెరుగుపరచడం ద్వారా కోలకతా రేవు పరిరక్షణ, నిర్వహణకు సంబంధించిన అవసరాన్ని తీర్చడానికి ఏ ప్రాజెక్టును నిర్మించారు?
జ: ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు

 

* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని టెనిస్‌వ్యాలీ కార్పొరేషన్ తరహాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఏది?
జ: దామోదర్‌లోయ కార్పొరేషన్

 

* భారతదేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది?
జ: భాక్రానంగల్ ప్రాజెక్టు

 

*దేశంలో చెరువుల ద్వారా వ్యవసాయ భూములకు ఎక్కువగా నీటి వసతులను కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
జ: ఆంధ్రప్రదేశ్

 

* దేశంలో నీటిపారుదల వనరుల సాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
జ: పంజాబ్

 

* దేశంలో కాలువలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది?
జ: ఉత్తరప్రదేశ్

 

* ఖరీఫ్ పంటలు అంటే ఏమిటి?
జ: జూన్-జులైలో విత్తనాలు వేసి అక్టోబర్-నవంబరులో కోసే పంటలు

 

* గోధుమను ఏ పంటకాలంలో పండిస్తారు?
జ: రబీ

 

* రెండు వేర్వేరు పంటలను ఒకేసారి ఒకే భూమిలో అంటే, ఏకకాలంలో పండించే పంటల విధానాన్ని ఏమంటారు?
జ: అంతర పంటలు

 

* భారతదేశంలో విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పంట ఏది?
జ: వరి

 

* ముఖ్యమైన ఖరీఫ్ పంటలు ఏవి?
జ: వరి, జొన్న, మొక్కజొన్న, వేరుసెనగ మొదలైనవి

 

* ప్రపంచంలో వరి ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
జ: రెండో స్థానం (మొదటి స్థానం చైనా)

 

* కళ్యాణ్, సోనాలీకా అనే అధిక దిగుబడి వంగడాలు ఏ పంటకు సంబంధించినవి?
జ: గోధుమ

 

* గోధుమ పంటను అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
జ: ఉత్తరప్రదేశ్

 

* జనుము పంటను అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
జ: పశ్చిమ బెంగాల్

 

* ప్రపంచంలో అత్యధికంగా చెరకును పండించే దేశం ఏది?
జ: భారతదేశం

 

* పొగాకు ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ: గుజరాత్

 

*'సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం' అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
జ: కేరళ

 

* భారతదేశంలో మలబార్ తీరప్రాంతం దేనికి ప్రసిద్ధి?
జ: కొబ్బరి, రబ్బరు, కాఫీ మొదలైనవి

 

* భారతదేశంలో పట్టుపురుగుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ: కర్ణాటక

 

* భారతదేశంలో హరితవిప్లవాన్ని ప్రవేశపెట్టడంలో విశేష కృషి చేసిందెవరు?
జ: ఎం.ఎస్.స్వామినాథన్

 

* శ్వేతవిప్లవాన్ని ప్రవేశపెట్టడంలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరు?
జ: వర్గీస్ ఎన్.కురియన్

 

* తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
జ: ఎపికల్చర్

 

* చేపల ఉత్పత్తిని అధికం చేసేందుకు చేపట్టిన పథకం ఏది?
జ: నీలివిప్లవం

 

* భారతదేశంలో ఖనిజసంపద అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
జ: జార్ఖండ్

 

* కర్ణాటకలోని కుద్రెముఖ్ ప్రాంతం ఏ ఖనిజానికి ప్రసిద్ధి?
జ: ఇనుప ధాతువు

 

* తమిళనాడులోని నైవేలీ ప్రాంతం ఏ రకానికి చెందిన బొగ్గుకు ప్రసిద్ధి?
జ: లిగ్నైట్

 

దిగ్బాయ్, శివసాగర్, రుద్రసాగర్ మొదలైన చమురు క్షేత్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ: అసోం

 

* రాతి ఉప్పును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
జ: హిమాచల్‌ప్రదేశ్

 

* కోయాలీ చమురు శుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: గుజరాత్

 

* భారతదేశంలో యురేనియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
జ: జార్ఖండ్

 

* ఖనిజ అన్వేషణ సంస్థ కేంద్ర కార్యాలయం ఎక్కడుంది?
జ: నాగపూర్

 

ఖేత్రి రాగి గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ: రాజస్థాన్

 

* దేశంలో బైరైటీస్ ఖనిజం ఎక్కువగా లభించే ప్రాంతం ఏది?
జ: ఆంధ్రప్రదేశ్‌లోని మంగంపేట

 

* భారతదేశంలో అత్యధిక చమురు నిల్వలున్న చమురు క్షేత్రం ఏది?
జ: బాంబే హై

 

* మనదేశంలో సహజ వాయువును మొదటిసారిగా ఎక్కడ కనుక్కున్నారు?
జ: హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాముఖి

 

* కుడంకులం అణువిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: తమిళనాడు

 

* సంప్రదాయేతర ఇంధన వనరులు ఏవి?
జ: సౌరశక్తి, పవన శక్తి, తరంగ శక్తి, బయోగ్యాస్, బయోమాస్

 

* భారతదేశంలో ఉపాధికి సంబంధించి అతిపెద్ద పరిశ్రమ ఏది?
జ: నూలువస్త్ర పరిశ్రమ

 

* భారతదేశ మాంచెస్టర్ అని ఏ నగరానికి పేరు?
జ: ముంబయి

 

భారతదేశంలో అత్యధికంగా పంచదార పరిశ్రమలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ: ఉత్తరప్రదేశ్

 

భారతదేశంలో మొదటి ఇనుము-ఉక్కు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు?
జ: పశ్చిమ బెంగాల్‌లోని కుల్టి వద్ద (1870లో)

 

* టాటా ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు?
జ: జంషెడ్‌పూర్ (జార్ఖండ్)

 

బొకారో ఉక్కు కర్మాగారాన్ని (జార్ఖండ్) ఏ దేశ సహకారంతో నెలకొల్పారు?
జ: రష్యా

 

* హిందుస్థాన్ షిప్‌యార్డ్ నౌకానిర్మాణ కేంద్రం ఎక్కడ ఉంది?
జ: విశాఖపట్నం

 

భారతదేశంలో అతిపెద్ద నౌకానిర్మాణ కేంద్రం ఏది?
జ: హిందూస్థాన్ షిప్‌యార్డ్ (విశాఖపట్నం)

 

భారతదేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో అత్యధిక భాగం ఏ ప్రాంతంలో లభిస్తుంది?
జ: ఛోటానాగపూర్ పీఠభూమి

 

భారతదేశంలోని రైల్వేలను ఎన్ని మండలాలుగా విభజించారు?
జ: 16

 

భారతదేశంలోని రైల్వే మండలాలన్నింటిలోకి అత్యధిక పొడవు విస్తరించి ఉన్న రైల్వే మండలం ఏది?
జ: ఉత్తర రైల్వే

 

* నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
జ: బెంగళూరు

 

* ఉత్తర మధ్య రైల్వే ఎక్కడ ఉంది?
జ: అలహాబాద్

 

* ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న సంస్థ ఏది?
జ: భారతీయ రైల్వే

 

* బ్రాడ్‌గేజ్ పట్టాల మధ్య దూరం ఎంత?
జ: 1.676 మీటర్లు

 

* ప్రపంచంలో మిక్కిలి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ఏది?
జ: ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్)

 

రైలు పెట్టెల కర్మాగారం 'కపుర్తలా' ఏ రాష్ట్రంలో ఉంది?
జ: పంజాబ్

 

* భారతదేశంలో నిర్మించిన మొదటి మెట్రోరైల్వే ఏది?
జ: కలకత్తా మెట్రోరైల్వే (1984-85)

 

* భారతదేశంలో పెట్రో రసాయన పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏది?
జ: గుజరాత్

 

* 'నవసేవ' ఓడరేవు ఉన్న రాష్ట్రం ఏది?
జ: మహారాష్ట్ర

 

* భారతదేశం తీరప్రాంతంలో నెలకొల్పిన ఏకైక ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది?
జ: విశాఖపట్నం

 

భారతదేశంలో బొగ్గునిల్వలు అత్యధికంగా ఉన్న మొదటి మూడు రాష్ట్రాలు వరుసగా-
జ: జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్

 

ప్రభుత్వరంగంలో మొదటిసారిగా ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది?
జ: సింద్రీ

 

* దేశంలో 'అంబాసిడర్' కార్లను ఉత్పత్తి చేసే నగరం ఏది?
జ: కోల్‌కతా

 

.ఎన్.జి.సి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
జ: డెహ్రాడూన్

 

* 'సుందర వనాలు' ఉన్న రాష్ట్రం ఏది?
జ: పశ్చిమ బెంగాల్

 

* భారతదేశంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది?
జ: మధ్యప్రదేశ్

 

* భారతదేశంలో ఏ ఓడరేవును 'క్వీన్ ఆఫ్ అరేబియా' అని పిలుస్తారు?
జ: కొచ్చి

 

* 'సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీ'  సంస్థను ఎక్కడ స్థాపించారు?
జ: చెన్నై

 

తెహ్రీ జలవిద్యుత్ కేంద్రాన్ని ఏ నదిపై నిర్మించారు?
జ: భాగరథీ

 

* సిమ్లీపాల్ జీవావరణ రక్షితకేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: ఒడిశా

 

* నందాదేవి జీవావరణ రక్షిత కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: ఉత్తరాఖండ్ (ఉత్తరాంచల్)

 

* భారతదేశంలో పులుల సంరక్షణ, అభివృద్ధి కోసం 'ప్రాజెక్టు టైగర్' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1973

 

పుష్పాల లోయ (Valley of Flowers) అని ఏ రాష్ట్రానికి పేరు?
జ: ఉత్తరాఖండ్ (ఉత్తరాంచల్)

 

* అడవుల పరిశోధనా సంస్థను ఎక్కడ నెలకొల్పారు?
జ: డెహ్రాడూన్

 

* సలీం అలీ పక్షి పరిశోధనా కేంద్రం, సహజ చరిత్ర కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పారు?
జ: కోయంబత్తూర్

 

Eco-Mark లేబుల్‌ను ఏ రకమైన ఉత్పత్తులకు ఇస్తారు?
జ: ఇకో ఫ్రెండ్లీ ఉత్పత్తులకు

 

* కేంద్ర గొర్రెల పెంపక పరిశోధనా సంస్థ ఎక్కడుంది?
జ: హిసార్, హర్యానా

 

* ముద్దనూర్ థర్మల్ పవర్‌స్టేషన్ ఎక్కడ ఉంది?
జ: కడప, ఆంధ్రప్రదేశ్

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌