• facebook
  • whatsapp
  • telegram

మన విశ్వం - సౌరకుటుంబం

1. జియోగ్రఫీ అనే పదాన్ని మొదట ఉపయోగించింది?
జ: ఎరతోస్తీన్స్

 

2. బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించిన వ్యక్తి?
జ: జార్జియస్ లెమెట్రీ

 

3. విశ్వం, మహావిస్ఫోటం వల్ల ఏర్పడిందని, అందుకే రేడియేషన్ ఉందని కనిపెట్టిన పెన్‌జియాస్, విల్సన్‌లకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పుడు ప్రకటించారు?
జ: 1964

 

4. నక్షత్రాలకు జన్మస్థానం ఏది?
జ: నిహారికలు

 

5. అవసాన దశకు చేరుకున్న నక్షత్రాలు అధిక కాంతిని, ఉష్ణశక్తిని విడుదల చేసి, విస్ఫోటానికి గురైతే వాటిని ఏమంటారు?
జ: సూపర్ నోవా

 

6. కృష్ణ బిలాలను కనిపెట్టిన శాస్త్రవేత్త?
జ: స్టీఫెన్ హాకిన్స్

 

7. సూర్యుడు ఇంకా ఎంతకాలం ప్రకాశమంతంగా ఉంటాడు?
జ: 50 బిలియన్ల సంవత్సరాలు

 

8. ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలిచే యూనిట్‌ను ఏమంటారు?
: కాంతి సంవత్సరం

 

9. 2012 లో కనుక్కున్న అతిదూరంలో ఉన్న గెలాక్సీకి నాసా పెట్టిన పేరు?
జ: MACS 0647 JD

 

10. కాస్మిక్ సంవత్సరం అంటే..?
జ: సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ పరిభ్రమించడం

 

11. సౌరకుటుంబం మొత్తం పరిమాణంలో సూర్యుడు వ్యాపించిన శాతం ఎంత?
జ: 99.8%

 

12. గ్రహాలను ఆయా అక్షాల మీద ఉంచే అంశాలు ఏవి?
జ: గురుత్వాకర్షణ బలం, అపకేంద్ర బలం

 

13. పడమరన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం ఏ గ్రహంలో చూడొచ్చు?
జ: శుక్రుడు

 

14. ప్లూటోను గ్రహస్థాయి నుంచి ఎప్పుడు తొలగించారు?
జ: 2006 అక్టోబరు 26

 

15. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల్లో ఎక్కువ సాంద్రత ఉన్నది?
జ: భూమి

 

16. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే నిర్దిష్ట మార్గాన్ని ఏమంటారు?
జ: భూకక్ష్య

 

17. ఆస్టరాయిడ్‌లు ఏర్పరచిన గోతిలో నీళ్లు చేరడం వల్ల రూపొందే సరస్సును ఏమంటారు?
జ: క్రేటర్ లేక్

 

18. 2013 ఫిబ్రవరి 15 న భూ వాతావరణంలోకి చొచ్చుకు వచ్చిన ఆస్టరాయిడ్‌కు ఏమని పేరు పెట్టారు?
జ: 2012 DA 14

 

19. ఇటీవల కనుక్కున్న వజ్రపు గ్రహం పేరేంటి?
జ: 55 Cancrie

 

20. 2013 ఫిబ్రవరి 15 న ఏ నగరంపై ఉల్కలు పడి ఇళ్లు ధ్వంసమయ్యాయి?
జ: చెల్యాబిన్స్క్ (Chelyabinsk)

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌