• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - నైసర్గిక స్వరూపాలు

1. దేశంలో విస్తరించి ఉన్న మొత్తం భూభాగంలో పీఠభూములు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమించాయి?
జ: 27.7%

 

2. దేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏ పర్వత ప్రాంతంలో విస్తరించి ఉంది?
జ: కారాకోరం పర్వత ప్రాంతాలు

 

3. హిమాలయాల ఉద్భవం ఏ కాలంలో ప్రారంభమైంది?
జ: టెర్షియరీ

 

4. హిమాలయాల్లోని ఏ ప్రాంతం వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందింది?
జ: హిమాచల్ పర్వతాలు

 

5. హిమాలయ పర్వత పాదాలు అని వేటిని పిలుస్తారు?
జ: శివాలిక్ హిమాలయాలు

 

6. చైనా దేశంతో వర్తక, వాణిజ్యాలను కొనసాగించడానికి వీలుగా ఉన్న నాధులా, జీలప్‌లా కనుమలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ: సిక్కిం

 

7. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కశ్మీర్ లోయ ఏయే పర్వతాల మధ్య ఉంది?
జ: హిమాద్రి - పీర్‌పంజాల్"

 

8. పూర్వాంచల్ పర్వతాలను అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ: అరకన్ యోమా కొండలు

 

9. అసోం హిమాలయాలు ఏయే నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
జ: తీస్తా - బ్రహ్మపుత్ర

 

10. హిమాలయ ప్రాంతాల్లో శృంగాకారపు అరణ్యాలు విస్తరించిన ఉన్న ప్రాంతం?
జ: హిమాచల్ ప్రాంతం

 

11. దేశంలో అత్యంత పురాతన పర్వతాలు?
జ: ఆరావళి పర్వతాలు

 

12. పూర్వాంచల్ పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం?
జ: సారామతి

 

13. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం?
జ: గురుశిఖర్

 

14. పండ్ల తోటలకి ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వత ప్రాంతం?
జ: హిమాచల్

 

15. బాహ్య హిమాలయాలు అని వేటిని పిలుస్తారు?
జ: శివాలిక్

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌