• facebook
  • whatsapp
  • telegram

గణిత పరిక్రియలు

1. + అంటే గుణకారం, % అంటే తీసివేత, × అంటే భాగహారం, - అంటే కూడిక అయితే 58-6×3+4%2 విలువ ఎంత?
జవాబు: 64 అవుతుంది.
ఈ ప్రశ్నలో ముందుగా ఇచ్చిన గుర్తులను వాటికి అనుబంధ గుర్తుల్లోకి మార్చాలి.
58-6×3+4%2 = 58+6%3×4-2. BODMAS సూత్ర ప్రకారం, ఇందులో ముందు భాగహారం చేయాలి. 
58 + × 4 - 2 తర్వాత గుణకారం చేయాలి. 
58 + 8 - 2 ఇప్పుడు +, - అనేవి అన్నదమ్ములు అంటే ముందుగా ఎవరినైనా సాధించవచ్చు.
66-2 = 64 అవుతుంది.


2. A అంటే కూడిక, B అంటే తీసివేత, C అంటే భాగహారం, D అంటే గుణకారం అయితే 18A12C6D2B5=?
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమీకరణం 18A12C6D2B5 సరైన గుర్తులను ప్రతిక్షేపించి
రాస్తే 18 + 12 / 6 × 2 - 5

BODMAS ప్రకారం
 18+ × 2-5 = 18+4-5  
          = 22-5 = 17

 

3. ఒకవేళ × అంటే భాగహారం, - అంటే గుణకారం, % అంటే కూడిక, + అంటే తీసివేత అయితే
(3-15%19) × 8 + 6 = ?
జవాబు: 2 అవుతుంది.
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమీకరణం (3-15%19) × 8+6 సరైన గుర్తులను ప్రతిక్షేపించి రాస్తే (3×15+19) % 8-6. BODMAS ప్రకారం ఇందులో ముందుగా బ్రాకెట్ ఉంది. అందులో 2 గుర్తులు ఉన్నాయి. కాబట్టి బ్రాకెట్‌లో కూడా BODMAS సూత్రం ఉపయోగించాలి.
    (45+19)%8-6 = 64%8-6 అప్పుడు భాగహారం చేయాలి.
        - 6 = 8 - 6 = 2 అవుతుంది.

 

4. % అంటే కూడిక, - అంటే భాగహారం, × అంటే తీసివేత, + అంటే గుణకారం అయితే 
జవాబు: 0 అవుతుంది.
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమీకరణాలకు సరైన గుర్తులను ప్రతిక్షేపించిన తర్వాత BODMAS సూత్రం ఉపయోగించివాటిని సాధించాలి.

ఇచ్చిన సమాసం

  
 

5. 2?6-12%4+2 = 11 సమీకరణంలో ? స్థానంలో ఉండాల్సిన గుర్తు ఏది?
జవాబు: × అవుతుంది.
ఈ రకమైన ప్రశ్నలలో ప్రత్యేకమైన పద్ధతి ఉండదు. కాబట్టి కింది ఇచ్చిన a, b, c, d జవాబుల్లో ఏదో ఒక్కటి ప్రతిక్షేపించి సమాధానం కనుక్కోవాలి.
2×6-12%4+2 BODMAS ప్రకారం 
2×6 - + 2 = 2×6 - 3+2
                         = 12-3+2       = 14-3
= 11 కాబట్టి ? స్థానంలో × ఉండాలి.

6. A అంటే కూడిక, B అంటే తీసివేత, c అంటే గుణకారం అయితే (10c4) A (4c4) B6 =?
జవాబు: 50 అవుతుంది.
ఈ ప్రశ్నలో ముందుగా ఇచ్చిన A, B, C గుర్తులను మార్చి రాయాలి. తర్వాత BODMAS సూత్రం ప్రకారం విడదీయాలి.
   (10 × 4) + (4 × 4) - 6 
   = 40+16-6 = 56 - 6 = 50 అవుతుంది.

 

7. ఒకవేళ A = 16,      C = 8,     D = 3 ,     B = 9 అయితే C+ A × B%D =? 
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాసం గుర్తులను మార్చి రాయాలి తర్వాత A, B, C, D విలువలను ప్రతిక్షేపించి BODMAS సూత్రం ప్రకారం చేయాలి.
= 8 + 16 ×  9%3 
= 8 + 16 x 
= 8 + 48 = 56 అవుతుంది.

8. ఒక వేళ x అంటే కూడిక, y అంటే తీసివేత, z అంటే భాగహారం, p అంటే గుణకారం అయితే (7P3) y6x5 విలువ ఎంత?
జవాబు: 20 అవుతుంది.
ఈ ప్రశ్నలో x, y, z , p గుర్తులను ప్రతిక్షేపించి దానిని BODMAS సూత్ర ప్రకారం విడదీయాలి.
(7 × 3)- 6+5 = 21-6+5 
    = 26-6 = 20 అవుతుంది.

 

9. ఒకవేళ - అంటే భాగహారం, + అంటే గుణకారం, % అంటే తీసివేత, × అంటే కూడిక అయితే కింద ఇచ్చిన సమీకరణాల్లో ఏది సరైంది?
జవాబు: 52%4+5×8-2 = 36 అవుతుంది.
ఈ ప్రశ్నలో ముందుగా ఇచ్చిన సమీకరణాల్లో గుర్తులను మార్చి రాసిన తర్వాత వాటిని BODMAS సూత్రం ప్రకారం సాధించాలి.
(a) 52-4 × 5+8 % 2 = 52-4 × 5 + 

 
       = 52-4 × 5+4 = 52 - 20 + 4
       = 56-20 = 36 (సరైంది)

 

(d) 36 %12+6 - 3×4 =  + 6-3 × 4 

             = 3+6 - 12 

             = 9-12= -3 (సరికాదు) 

               కాబట్టి జవాబు (a) అవుతుంది.

10. +, /, 2, 4 ఈ గుర్తులను, సంఖ్యలను మార్చి రాస్తే కింద ఇచ్చిన సమీకరణాల్లో ఏది సరైంది?

జవాబు: 2+4/6 = 8 అవుతుంది.

ఈ ప్రశ్నలో + స్థానంలో /, / స్థానంలో + రాసి, తర్వాత 2 స్థానంలో 4 ను, 4 స్థానంలో 2 ను రాయాలి. 

(a) 2 + 4/3 = 3 =>  4/2+3 = 3 = + 3 = 3 

                   = 5 = 3 (సరికాదు)

(b) 4+2/6 = 1.5 => 2/4+6 =1.5 

    1/2 + 6 = 1.5 

= 13/2 = 6.5 => 6.5 = 1.5 (సరికాదు)

(c) 4/2+3 = 4 

      2+4/3 = 4

      6/3 = 4

2 = 4 (సరికాదు)

(d) 2+4/6 = 8 
     => 4/2+6 = 8
      2+6 = 8
8=8 (సరైంది) కాబట్టి సమాధానం(d) అవుతుంది.

 

11. ఒకవేళ 40+10 = 30, 18+8 =10 అయితే 60+60 = ?
జవాబు: 0 అవుతుంది.
ఈ ప్రశ్నను జాగ్రత్తగా పరిశీలిస్తే మొదట 40+10=30 అవుతుందని చెప్పారు. వాటిని కలిపితే 30 రాదు. కాబట్టి వాటిని తీసేయాలి. అంటే + స్థానంలో - రాయాలి. 40-10= 30 అవుతుంది. రెండోది 18+8=10. ఇందులో కూడా 18-8=10 అవుతుంది. ఈ ప్రశ్నలో + స్థానంలో - ప్రతిక్షేపించి సమాధానం రాబట్టాలి.
60 - 60 = 0 అవుతుంది.

 

12. 5+6 / 3-12 × 2 = 17 కింద ఇచ్చిన గుర్తుల్లో దేన్ని ఉపయోగించి సరైన సమాధానం రాబట్టవచ్చు?
జవాబు: /, × అవుతుంది.
ఈ ప్రశ్నలో (a) లో ఉన్న గుర్తులను మార్చి రాశారు.
(a) 5+6/32×2 = 17 => 5+6×3-12/2 
     = 5+18-6 = 17
కాబట్టి (a) సరైంది.

Posted Date : 10-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌