• facebook
  • whatsapp
  • telegram

రక్త సంబంధాలు  

మాదిరి సమస్యలు


1. ఒక కుటుంబంలో Q, P, R, S, T అనే అయిదుగురు వ్యక్తులు ఉన్నారు.

i) P, Sలు పెళ్లయిన జంట

ii) S పురుషుడు కాదు

iii) P కుమారుడు T, Q కుమారుడు P

iv) T సోదరి R

అయితే S, Q కు ఏమవుతారు?

1) మనవరాలు        2) కోడలు     3) కుమార్తె        4)  తల్లి 

సాధన: i. P, Sలు పెళ్లయిన జంట. వారిని కింది విధంగా సూచించవచ్చు.


                                                                సమాధానం: 2


2. B సోదరి A, B తల్లి C, C తండ్రి D, D తల్లి E. అయితే D కి A ఏమవుతారు?

1) మనవరాలు        2) కుమార్తె           3) అత్తయ్య         4)  తండ్రి 

సాధన: దత్తాంశం ప్రకారం, మొత్తం కుటుంబ చిత్రాన్ని కింది విధంగా సూచించవచ్చు.


                                                                         సమాధానం: 1


3. P, Q , R, S, T, U అనే పిల్లలు ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. వారిలో P, T లు సోదరులు. T కి సోదరి U. P పినతండ్రి కొడుకు R. R తండ్రి సోదరుడి కుమార్తెలు Q, S. అయితే U కి R ఏమవుతారు?

1) సోదరి        2) సోదరుడు          3) కుమారుడు        4) మామయ్య 

సాధన: దత్తాంశం ప్రకారం, మొత్తం కుటుంబాన్ని కింది విధంగా సూచించవచ్చు.


పై చిత్రం ఆధారంగా U కి ళR సోదరుడు అవుతాడు.     

                                                                          సమాధానం: 2


4. P కుమారుడు Q, Q కుమార్తె X, X మేనత్త R, R కుమారుడు L. అయితే P కి L ఏమవుతారు?

1) మనవడు        2) మనవరాలు         3)  కుమార్తె        4)  మేనకోడలు 

సాధన: దత్తాంశం ప్రకారం,

5. Q తండ్రి B. Bకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. R సోదరుడు Q. P కుమార్తె R. P మనవరాలు A, A తండ్రి S. అయితే S కి Q ఏమవుతారు?

1) కుమారుడు        2) అల్లుడు       3)  సోదరుడు        4)  బావ

సాధన: దత్తాంశం ప్రకారం Q తండ్రి B, B కు ఇద్దరు పిల్లలు, R సోదరుడు Q


పై చిత్రం ఆధారంగా B, P లు భార్యా భర్తలు, P మనవరాలు A, A తండ్రి S. మొత్తం కుటుంబ చిత్రాన్ని కింది విధంగా గీయొచ్చు.


పై చిత్రం నుంచి S కి Q బావ అవుతాడు.

                                                                       సమాధానం: 4


6.  A, Q, Y, Z లు వేర్వేరు వ్యక్తులు. Q తండ్రి Z. Y కుమార్తె  A, Z  కుమారుడు Y. Y కుమారుడు P, P సోదరుడు B అయితే,

1) B, Y లు సోదరులు    2) B సోదరి A      3) Bమామయ్య Z        4) Q, Y లు సోదరులు 

సాధన: దత్తాంశం ప్రకారం,

పై చిత్రం ఆధారంగా 'B సోదరి A'

                                                                  సమాధానం: 2


7. K సోదరుడు D, K సోదరి M. Tఅనే వ్యక్తి R కి తండ్రి, M కి సోదరుడు R. K తల్లి F. అయితే T, F లకు కనీసం ఎంతమంది కుమారులు ఉన్నారు?

1) 2      2) 3      3) 4      4)చెప్పలేం 

సాధన: దత్తాంశం ప్రకారం,


         పై చిత్రం నుంచి T, F ల పిల్లలు R, M, K, D. ప్రశ్నలో K నిర్దిష్టమైన లింగాన్ని పేర్కొనలేదు. T, F ల కొడుకులు D, R. కాబట్టి T, F లు కనీసం ఇద్దరు మగ సంతానాన్ని కలిగి ఉన్నారు.

                                                               సమాధానం: 1


వివిధ రక్త సంబంధాలు

* తండ్రి లేదా తల్లి కుమారుడు - సోదరుడు

* తండ్రి లేదా తల్లి కుమార్తె - సోదరి

* తండ్రి సోదరుడు - పినతండ్రి (బాబాయ్‌)

* తల్లి సోదరుడు - మేనమామ

* తండ్రి సోదరి - మేనత్త

* తల్లి సోదరి - పినతల్లి (పిన్ని)

* తల్లి లేదా తండ్రికి తండ్రి - తాత

* కుమార్తె భర్త - అల్లుడు

* భర్త లేదా భార్య సోదరి - మరదలు

* భర్త లేదా భార్య సోదరుడు - మరిది

* కుమార్తె భర్త - అల్లుడు

* భార్య లేదా భర్త తండ్రి - మామయ్య

* భార్య లేదా భర్త తల్లి - అత్తయ్య

* అన్న భార్య - వదిన

* తమ్ముడి భార్య - మరదలు

* సోదరి కొడుకు/ కూతురు : పురుషుడికి - మేనల్లుడు/ మేనకోడలు; మహిళకు    - కొడుకు/ కూతురు 

* తాతయ్య ఏకైక కుమారుడు - నాన్న

* తాతయ్య ఏకైక కుమార్తె - అమ్మ

* అమ్మ లేదా నాన్న ఏకైక కుమారుడు - అతడే

* అమ్మ లేదా నాన్న ఏకైక కుమార్తె - ఆమే

గమనిక: రక్త సంబంధాలపై అడిగే  ప్రశ్నల్లో ఇంగ్లిష్‌ - తెలుగు వర్షన్లలో కొంచెం తేడా ఉంటుంది. అభ్యర్థులు ఏదో ఒకదాన్ని మాత్రమే అనుసరించాలి. ఉదా: మనం పిన్ని లేదా పెద్దమ్మ కూతురు, కొడుకులను తెలుగులో అక్క, చెల్లి, అన్న, తమ్ముడిగా సంబోధిస్తే, ఇంగ్లిష్‌లో వారందరినీ ‘కజిన్‌’గా పిలుస్తారు.


 

Posted Date : 27-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌