• facebook
  • whatsapp
  • telegram

పడవలు - ప్రవాహాలు

మాదిరి సమస్యలు

1. ఒక ఈతగాడు నదీ ప్రవాహానికి అభిముఖంగా  8 కి.మీ./గం. వేగంతో, ప్రవాహానికి వాలుగా  10 కి.మీ./గం. వేగంతో ఈదుతాడు. అయితే నిశ్చల నీటిలో అతడి వేగం ఎంత? (కి.మీ./గం.లలో)

1) 10                       2) 6                       3) 12                  4) 9

సాధన:

సమాధానం: 4

2. ఒక మోటారు పడవ నదీ ప్రవాహానికి అభిముఖంగా 24 కి.మీ./గం. వేగంతో, ప్రవాహానికి వాలుగా  30 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తుంది. అయితే నీటిప్రవాహ వేగం ఎంత? (కి.మీ./గం.లలో) 

1) 4                                 2) 3                           3) 2                  4) 2.5

సాధన:

సమాధానం: 2

3. ఒక మోటారు పడవ ఒక ఓడరేవు నుంచి మరొక ఓడరేవుకు ప్రవాహానికి వాలుగా ప్రయాణించడానికి 4 గంటల సమయం పట్టింది. అంతే దూరాన్ని ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించడానికి 5 గంటల సమయం పట్టింది. నీటి ప్రవాహ వేగం 2 కి.మీ./గం. అయితే ఆ రెండు ఓడరేవుల మధ్య దూరం ఎంత? (కి.మీ.లలో)

1) 80                    2) 75                      3) 60                  4) 65

సాధన:

సమాధానం: 1

4. నిశ్చల నీటిలో ఒక పడవ వేగం 15 కి.మీ./గం. ఆ పడవ ప్రవాహానికి అభిముఖంగా ఒక స్థానం నుంచి 30 కి.మీ. దూరానికి వెళ్లి, తిరిగి అంతే దూరాన్ని ప్రవాహానికి వాలుగా ప్రయాణించింది. బయలుదేరిన చోటికి చేరడానికి పడవకు 4 గం. 30 ని. సమయం పడితే, ఆ నదీ ప్రవాహ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)

1) 4                             2) 5                            3) 6                      4) 3

సాధన:

సమాధానం: 2

5. ఒక పడవ వేగానికి, నదీ ప్రవాహ వేగానికి మధ్య నిష్పత్తి 36 : 5. ఆ పడవ నదీ ప్రవాహానికి వాలుగా కొంత దూరం ప్రయాణించడానికి 5 గం. 10 ని. సమయం పట్టింది. అయితే తిరిగి ప్రవాహానికి అభిముఖంగా అంతేదూరం ప్రయాణించడానికి పట్టే సమయం ఎంత?

1) 6 గం. 10 ని.                       2) 6 గం. 30 ని. 

3) 6 గం. 45 ని.                       4) 6 గం. 50 ని.

సాధన: 

సమాధానం: 4

6. ఒక ఈతగాడు నదిలో  కి.మీ. దూరాన్ని ప్రవాహానికి అభిముఖంగా ఈదడానికి  నిమిషాల సమయం పట్టింది. అంతే దూరాన్ని ప్రవాహానికి వాలుగా ఈదడానికి ​​​​​​​ నిమిషాల సమయం పట్టింది. అయితే నిలకడ నీటిలో ఆ ఈతగాడి వేగం ఎంత? (కి.మీ./గం.లలో)

1) 7                              2) 8                         3) 5                        4) 6

సాధన: 

సమాధానం: 3

7. ఒక పడవ కొంతదూరాన్ని ప్రవాహానికి వాలుగా ప్రయాణించడానికి పట్టిన సమయం, అంతే దూరాన్ని ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించడానికి పట్టిన సమయంలో సగం ఉంది. అయితే నిశ్చల నీటిలో పడవ వేగానికి, నదీ ప్రవాహ వేగానికి మధ్య ఉన్న నిష్పత్తి...

1) 3 : 1                     2) 3 : 2                   3) 2 : 3                     4) 1 : 3

సాధన:

 సమాధానం: 1

8. ఒక పడవ నదీ ప్రవాహానికి వాలుగా ప్రయాణించేటప్పుడు దాని వేగం, ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించేటప్పుడు ఉన్న వేగానికి 

 రెట్లు ఉంది. ఆ పడవ నదీ ప్రవాహానికి వాలుగా 3 గంటల్లో 38.4 కి.మీ. దూరం ప్రయాణించింది. అయితే నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)

1) 10              2) 12                 3) 14                   4) 15

సాధన: 

సమాధానం: 1

అభ్యాస ప్రశ్నలు

1. ఒక పడవ నదీ ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించేటప్పుడు 24 కి.మీ. దూరాన్ని 6 గంటల్లో చేరుకుంది. నదీ ప్రవాహానికి వాలుగా ప్రయాణించేటప్పుడు 20 కి.మీ. దూరాన్ని 4 గంటల్లో చేరింది. అయితే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)

1) 5.5                2) 4.5                  3) 6.5                4) 3.5

2. ఒక నదీ ప్రవాహ వేగం 5 కి.మీ./గం. ఒక మోటారు పడవ నదీ ప్రవాహానికి ఎదురుగా 10 కి.మీ. దూరం ప్రయాణించి, తిరిగి బయలుదేరిన  స్థానానికి చేరడానికి 50 ని. సమయం పట్టింది. అయితే నిలకడ నీటిలో మోటారు పడవ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)

1) 20                   2) 26             3) 25               4) 27


సమాధానాలు: 1 - 2        2 - 3

Posted Date : 27-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌