రెండు కర్ణాలు.. నాలుగు కోణాలు!
నాలుగు భుజాలు సమానమైతే చతురస్రం. ఎదురెదురు భుజాలు సమానమైతే దీర్ఘచతురస్రం. అన్ని చతురస్రాలు, దీర్ఘచతురస్రాలవుతాయి. కానీ ఏ దీర్ఘచతుర్రసం, చతురస్రం కాదు. రెండింటిలోనూ రెండు కర్ణాలు, నాలుగు కోణాలు మాత్రమే ఉన్నప్పటికీ పరీక్షల్లో ప్రశ్నలు మాత్రం అనేక రకాలుగా వస్తుంటాయి.
చతురస్రం
దీర్ఘచతురస్రం
మాదిరి ప్రశ్నలు
1. వాహనాలు నిలిపే స్థలం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దానికి మూడు వైపులా రంగు వేశారు. రంగు వేయని భుజం 9 మీ. రంగు వేసిన భుజాల మొత్తం పొడవు 37 మీ. అయితే ఆ స్థల వైశాల్యం ఎంత?
1) 46 మీ. 2) 81 మీ. 3) 126 మీ. 4) 252 మీ.
జవాబు: 3

2. దీర్ఘచతురస్రం చుట్టుకొలత 206 మీ. దాని పొడవు, వెడల్పుల తేడా 23 మీ. అయితే దాని వైశాల్యం ఎంత?
1) 1520 మీ.2 2) 2420 మీ.2 3) 2480 మీ.2 4) 2520 మీ.2
జవాబు: 4
3. 90 మీ. పొడవు, 50 మీ. వెడల్పు గల స్థలం చుట్టూ ముళ్ల కంచె వేయాలి. 5 మీ. దూరంలో స్తంభాలు పాతడానికి ఎన్ని స్తంభాలు కావాలి?
1) 55 2) 56 3) 57 4) 58
జవాబు: 2
4. ఒక టవల్ తడిపితే పొడవు 20%, వెడల్పులో 10% తగ్గింది. అయితే దాని వైశాల్యం తగ్గుదల శాతం ఎంత?
1) 10% 2) 10.08% 3) 30% 4) 28%
జవాబు: 4
5. ఒక వృత్తం వైశాల్యం 220 మీ.2, దాని లోపల ఒక పెద్ద చతురస్రాన్ని నిర్మిస్తే ఆ వృత్త వైశాల్యం ఎంత?
1) 140 మీ.2 2) 70 మీ.2 3) 210 మీ.2 4) 280 మీ.2
జవాబు: 1
6. ఒక వ్యక్తి చతురస్రాకార స్థలంలో కర్ణం వెంబడి నడిచాడు. భుజాల వెంబడి నడవకపోవడం వల్ల అతడికి తగ్గిన దూరం శాతం?
1) 20% 2) 24% 3) 30% 4) 33%
జవాబు: 3
7. ఒక గది పొడవు 5.2 మీటర్లు, దాని వెడల్పు 2.0 మీటర్లు. ఆ గదిని కచ్చితంగా చతురస్ర పలకాలతో పరచాలంటే కావాల్సిన పలకల సంఖ్య?
1) 96 2) 85 3) 75 4) 65
జవాబు: 4
8. ఒక దీర్ఘచతురస్రం పొడవు దాని వెడల్పునకు రెట్టింపు కంటే అయిదు ఎక్కువ. దాని వైశాల్యం 273 చ.సెం.మీ. అయితే ఆ దీర్ఘ చతురస్రం వెడల్పును వ్యాసార్ధంగా గల వృత్త వైశాల్యం (చ.సెం.మీ.లలో)?
1) 346.5 2) 123.35 3) 140 4) 210
జవాబు: 1
9. ఒక దీర్ఘచతురస్రం పొడవు 20 మీ., వెడల్పు 14 మీ. దాని లోపల పెద్ద వృతం నిర్మిస్తే ఆ వృత్త వైశాల్యం ఎంత?
1) 208 మీ.2 2) 154 మీ.2 3) 616 మీ.2 4) 308 మీ.2
జవాబు: 2
10. ఒక చతురస్ర వైశాల్యం 69% పెంచితే దాని భుజంలో పెంపుదల శాతం?
1) 13% 2) 30% 3) 39% 4) 69%
జవాబు: 2
రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్ రెడ్డి