• facebook
  • whatsapp
  • telegram

Active Voice and Passive Voice

  ఇంగ్లిష్ గ్రామర్‌లో Voice అనేది చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా మనం ఇంగ్లిష్ భాషలో మాట్లాడుతున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు మనకు (Verb-క్రియ) ఉపయోగానికి సంబంధించి చాలా సందేహాలు వస్తుంటాయి. మనం ఉపయోగిస్తున్నVerb సరైనదా? కాదా? అన్న సందేహం తలెత్తుతుంది. సరైన రీతిలో ఉపయోగించకపోతే విపరీతార్థాలు రావడానికి అవకాశం ఉంది. అదెలాగో చూద్దాం.Tense కు సంబంధించి కింది ప్రశ్నను గమనించండి.

1. Rajiv Gandhi .................. at Sriperambudur.

1) assassinated

2) has assassinated

3) had assassinated

4) was assassinated

  పై వాక్యం subject (she) గురించి చెబుతుంది. Subject కు ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి పై వాక్యాన్ని Active Voice లో ఉందని చెబుతారు. ఇదే వాక్యాన్ని Passive Voice లోకి మారిస్తే An apple was eaten by her అని వస్తుంది. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇది subject కు కాకుండా object (apple) కు ప్రాధాన్యం ఇచ్చినట్టు, Object గురించి చెప్పినట్టు గ్రహించవచ్చు. కాబట్టి ఈ వాక్యాన్ని Passive Voice లో ఉందని చెబుతారు. దీనిని బట్టి మనం కింది విషయాలను గ్రహించవచ్చు. అవి:

Subject కు importance ఇచ్చి Subject గురించి చెప్పేది Active Voice.

Object కు importance ఇచ్చిObject  గురించి చెప్పేది Passive Voice.

ఒక వాక్యాన్ని Active Voice లో నుంచి Passive Voice లోకి మార్చినప్పుడు వచ్చే మార్పులను గమనిద్దాం.

పట్టికనుంచి గమనించాల్సిన ముఖ్యవిషయాలు:
1. Active Voice  లో వాక్యాల్లో మనకు  V1, V2, V3, V4 లాంటి విభిన్న క్రియారూపాలు ఉంటాయి. కానీ PV లో ఎప్పుడూ ఒకే రకమైన క్రియారూపం ఉంటుంది. అదే 'Be' form+V3.
2. ఒక వాక్యాన్ని AV లో నుంచి PV లోకి మార్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోను Tense మార్చకూడదు. అంటే Present Tense  లోని వాక్యం Present tense  లో, Past tense లోని వాక్యం Past tense లో, Future Tense లోని వాక్యం Future Tense లో ఉంటుంది.
3. PV లోని వాక్యంలోని ప్రతి Verb, 'Be' form + V3 ను కలిగి ఉండాలి. దీనినే Heart of  PV అంటారు.
4. Active Voice లో - ing (V4) ఉన్న ప్రతి వాక్యంలోను PV  లో being కలుస్తున్నట్లు గ్రహించవచ్చు.
5. AV లో have/ has/ had ఉన్న ప్రతి వాక్యంలోను PV లో been కలుస్తున్నట్టు గ్రహించవచ్చు.
6. AV లో will/ shall/ can etc. ఉన్న ప్రతి వాక్యంలోను PV లో be కలుస్తున్నట్టు గ్రహించవచ్చు.
7. ఇంగ్లిష్‌లో మొత్తం 12 tense  లు ఉండగా అందులో కేవలం '8' tenses కు మాత్రమే PV ఉంటుంది. మిగతా 4 Tenses కు PV  సాధ్యం కాదు.
PV కి సంబంధించి అత్యంత కీలకమైనవి మూడు అంశాలు ఉన్నాయి. వాటిని కింది పట్టికలో గమనించండి.


PV  ప్రధానంగా పైన ఇచ్చిన మూడు సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మూడు అంశాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.

Sentences with two objects: ఒక్కొక్కసారి ఇచ్చిన వాక్యంలో రెండు objects ఉంటాయి. అలాంటప్పుడు రెండింటిలో ఏ ఒక్క object నైనా ఉపయోగించి ఆ వాక్యాన్ని PV లోకి మార్చవచ్చు. కింది వాక్యాలను గమనించండి.

2. Mr. Reddy teaches us English.

   PV: English is taught to us by Mr. Reddy.
                              (or)
 We are taught English by Mr.Reddy.

Passive Voice without 'by': ఒక వాక్యాన్ని PV  లోకి మార్చినప్పుడు అందులో by  ఉండి తీరాలన్న నియమం లేదు. 'By' ఉండాలా? లేదా? అనేది . AV  లో మనకిచ్చిన వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. AV  లో ఇచ్చిన వాక్యంలోని subject కు ప్రాముఖ్యం ఉన్నప్పుడు లేదా ఫలానా అని కచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే దానిని తిరిగి PV  లో రాయాలి. అలాకాని పక్షంలో అంటే subject ప్రాముఖ్యం లేనప్పుడు లేదా ఫలానా అని కచ్చితంగా తెలియనప్పుడు తిరిగి దానిని PV లో ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు 'by' అవసరం లేదు. కింది ఉదాహరణలను గమనించండి. 
    1.  AV: People speak English all over the world.
        PV: English is spoken by people all over the world.

పై వాక్యంలో by people అవసరం లేదు. ఎందుకంటే సహజంగా ఇంగ్లిష్‌ను ప్రజలు మాట్లాడతారు కాబట్టి.

    2. AV: Somebody has stolen my car.
        PV: My car has been stolen by somebody. 
    (ఇక్కడ subject  ఎవరో కచ్చితంగా తెలియదు కాబట్టి)
Changing Imperative sentences into PV (కర్తలేని వాక్యాలు)
                 (ఆజ్ఞలు, అభ్యర్థనలను PV లోకి మార్చడం)
a) Commands/ Orders
'Let' అనే పదాన్ని ఉపయోగించి మనం commands/ orders  బను శిజులోకి మార్చవచ్చు. అందుకు కింది structure ఉపయోగపడుతుంది.

                                                       Let + Object + (not) + be + V3
e.g.:
    1. Close the door (AV)
          Let the door closed (PV) 
    2. Don't waste your time (AV)
         Let your time not be wasted (PV)
    3. Open the window (AV)
         Let the window be opened (PV)
Note: Object లేని వాక్యాలకు You are ordered to అని వస్తుంది. ఉదాహరణకు Get out (AV)
            You are ordered to get out (PV)
b) Changing requests in to passive voice
ఈ వాక్యాలు సాదారణంగా please తో మొదలవుతాయి. వాటిని PV లోకి మార్చడానికి please బదులు you are requested to అని మార్చి మిగిలిన బాగాన్ని యదాథదంగా రాయాలి.
                                          Please → you are requested to 
e.g. 1. Please listen to me (AV)
           You are requested to listen to me (PV)
       2. Please take your seat (AV)
            You are requested to take your seat (PV)

Changing Interrogative Sentences (Questions) in to PV
a) Questions with 'Do' forms
ఇక్కడ 'Do' form, 'Be' form గా మారుతుంది.
e.g: 1. Do you play cricket? (AV)
           Is cricket played by you? (PV)
2. Did you write the letter? (AV)
     Was the letter written by you? (PV)
b) Questions with 'Be' forms
      వీటిలో  being  రాయాలి.
1. Is she cooking food? (AV)
    Is food being cooked by her (PV)
2. Were they watching cricket? (AV)
     Was cricket being watched by them? (PV)

c) Questions with 'Have' forms
    ఇందులో been రాయాలి
1. Have you seen this movie? (AV)
    Has this movie been seen by you? (PV)
 2. Has she painted this picture? (AV)
    Has this picture been painted by her? (PV)
d) Questions with Model Auxiliaries
ఇందులో 'Be' రాయాలి 
1. Can you solve this problem? (AV)
    Can this problem be solved by you? (PV)
2. Should we follow the traffic rules? (AV)
    Should the traffic rules be followed by us (PV)

Questions with 'WHO'
'WHO' తో ప్రారంభమైన ప్రశ్నలకు సమాదానం PV, By Whom తో మొదలవు తుంది.
e.g.: 1. Who wrote this poem? (AV)
             By whom was this poem written? (PV)
        2. Who teaches English? (AV)
            By whom is English taught? (PV)
Changing to infinitives and gerund forms in to PV
            AV                            PV
       to + V1             → to + be + V3
           V4                 → being + V3 
e.g: 1. I want to buy a car (AV)
            I want a car to be bought (PV)
        2. She likes people praising her (AV)
            She likes being praised (PV)
Note 1:        AV                         PV
They / people say ----           It is said that-----
They / people believe          It is believed that -----
They / people said -----        It was said that ----
They / people believed --    It was believed that -- 
e.g.: 1. They say ghosts live in the house over there (AV)
             It is said that ghosts live in the house over there (PV)
        2.  People believed that the earth was flat (AV)
             It was believed that the earth was flat (PV)
Note 2: సాదారనంగా PV లో by వస్తుంది అని మనకు తెలుసు కాని కొన్నిVerbs కు మాత్రం  by కాకుండా వేరే preposition వస్తుంది. అవి

e.g.: 1. The results surprised me (AV)
              I was surprised at the results (PV)
        2.  I satisfied my teachers (AV)
              My teachers were satisfied with me (PV)
        3.  He knows to me (AV)
              I am known to him (PV)
        4.  The jug contains water (AV)
              Water is contained in the jug (PV).

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌