ఎవరు ఎవరికి ఏమవుతారో!
ఆత్మీయమైన అమ్మ, అనురాగంగా నాన్న, ఆప్యాయమైన అక్క, అన్నివేళలా అండగా అన్న, చెదరని ప్రేమతో చెల్లి, తరగని ఆదరంతో తమ్ముడు.. అందరి జీవితాల్లోనూ ఉండే బంధాలు. ఎప్పటికీ విడపోని రక్తసంబంధాలు. అభ్యర్థుల విశ్లేషణాత్మక శక్తిని అంచనా వేయడం కోసం ఈ రిలేషన్లపై రీజనింగ్‌లో ప్రశ్నలు వస్తుంటాయి. ఎవరు ఎవరికి ఏమవుతారో కనిపెట్టాలి. తెలిసిన విషయాలే అయినా కాస్త తడబాటుకు గురిచేస్తాయి. కొన్ని నియమాలు నేర్చుకుంటే తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.
* సాధారణంగా సంబంధాలు రెండు రకాలు.
1) రక్త సంబంధాలు
ఉదా: అమ్మ, సోదరి, సోదరుడు, మేనత్త
2) చట్టపరమైన సంబంధాలు
ఉదా: భర్త, భార్య, అల్లుడు, మావయ్య
* సాధారణంగా పరీక్షల్లో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
1) నేరుగా సంబంధాలు (Direct Relations)
2) కుటుంబ సంబంధాలు (Family Relations)
3) తృతీయ వ్యక్తి సంబంధాలు (Indirect Relations)
4) కోడ్ సంబంధాలు (Coded Relations)
సంబంధాలు జనరేషన్ వారీగా కిందివిధంగా ఉంటాయి.
జనరేషన్ 1: తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ
జనరేషన్ 2: తల్లి, తండ్రి, పెదనాన్న/చిన్నాన్న, మేనత్త, మేనమామ, అత్త, మామ
జనరేషన్ 3: సోదరి, సోదరుడు, భార్య, భర్త, వదిన/మరదలు, బావ/బావమరిది
జనరేషన్ 4: కుమారుడు, కుమార్తె, అల్లుడు, కోడలు, మేనల్లుడు, మేనకోడలు
జనరేషన్ 5: మనుమడు, మనుమరాలు
ప్రశ్నలో సాధారణంగా ‘కాదు’ అనే భావనను కిందివిధంగా పరిగణించాలి.
* స్త్రీ కాదు → పురుషుడు
* పురుషుడు కాదు → స్త్రీ
* భార్య కాదు → భర్త
* భర్త కాదు → భార్య
* సోదరుడు కాదు → సోదరి
* తండ్రి కాదు → తల్లి
* కుమారుడు కాదు → కుమార్తె
* సమస్యల సాధనలో సౌలభ్యం కోసం కింది గుర్తులను ఉపయోగిస్తారు.
* ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన జెనరేషన్‌కి చెందితే ‘అడ్డుగీత’ ద్వారా సూచిస్తారు.
ఉదా: A, B సోదరులు
* ఇద్దరు వ్యక్తులు వేర్వేరు జెనరేషన్స్‌కి చెందితే ‘నిలువు గీత’ ద్వారా సూచిస్తారు.
ఉదా: A తండ్రి B
మాదిరి ప్రశ్నలు
1. A, B లు సోదరులు. B కూతురు C. C సోదరి D. A తల్లి E. అయితే D కి E ఏమవుతారు?
1) తాతయ్య 2) మనుమరాలు 3) నానమ్మ 4) మనుమడు
జవాబు: 3
సాధన: A, B లు సోదరులు అంటే
2. A, B లు సోదరులు. C, D లు సోదరీమణులు. C కుమారుడు B. A తండ్రి E అయితే C కి E ఏమవుతారు?
1) భార్య 2) కుమారుడు 3) సోదరుడు 4) భర్త
జవాబు: 4
సాధన: ప్రశ్నలో ఇచ్చిన సంబంధాలను గుర్తుల రూపంలో వ్యక్తపరచగా
3. P + Q అంటే Q కుమార్తె P అని అర్థం. P*R అంటే Q కి భర్త P అని అర్థం. P + Q * R అయితే కిందివాటిలో ఏది సత్యం?
1) P కి తల్లి R 2) P కి చెల్లి R 3) P కి అత్త R 4) P కి సోదరుడు R
జవాబు: 1
సాధన: ప్రశ్నలో ఇచ్చిన కోడ్ సంబంధాలను గుర్తుల రూపంలో వ్యక్తపరచగా

4. A, B, C, D, E, F అనే ఆరుగురు వ్యక్తులున్న కుటుంబంలో సంబంధాలు కిందివిధంగా ఉన్నాయి.
ఎ) కుటుంబంలో ఆడవారి సంఖ్య, మగవారి సంఖ్యకు సమానం.
బి) A, E లు F కు కుమారులు.
సి) ఒక బాలుడు, ఒక బాలిక ఇద్దరికీ తల్లి D.
డి) A కి B కుమారుడు.
ఇ) ప్రస్తుతానికి కుటుంబంలో ఒక వైవాహిక జంట ఉంది. పై సమాచారం నుంచి రాబట్టగల ఒక నిర్ధారణ?
1) A, B, C లు అందరూ ఆడవారే 2) D కి A భర్త
3) F కి D మనుమరాలు 4) E, Fలు D సంతానం
జవాబు: 2
సాధన: ప్రశ్నలో ఇచ్చిన సంబంధాలను గుర్తుల ద్వారా వ్యక్తపరచగా

రచయిత: గోలి ప్రశాంత్‌రెడ్డి