• facebook
  • whatsapp
  • telegram

ప్రాంతీయ కూటములు

1. 1976లో ఎక్కడ జరిగిన సమావేశంలో G-7 (గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌) కూటమి  ఏర్పడింది? 

1) పారిస్‌ (ఫ్రాన్స్‌) 

2) సాన్‌జువాన్‌ (పోర్టారికో)

3) టెహ్రాన్‌ (ఇరాన్‌)  

4) టోక్యో (జపాన్‌) 


2. G-7 దేశాల కూటమిలో లేని దేశాన్ని గుర్తించండి.

1) ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా 

2) బ్రిటన్, ఇటలీ, జపాన్‌    

3) స్వీడన్‌      

4) కెనడా

3. G-7 కూటమి లక్ష్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం

బి) వర్థమాన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం

సి) ద్రవ్యోల్బణం, నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయడం

డి) వాణిజ్య సంబంధమైన అంశాలను చర్చించడం

1) ఎ, బి, సి సరైనవి 

2) ఎ, సి, డి సరైనవి

3) ఎ, బి, డి సరైనవి 

4) పైవన్నీ


4. 1997లో ఎక్కడ జరిగిన సమావేశంలో G-7 (గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌) దేశాల కూటమి G-8 (గ్రూప్‌ ఆఫ్‌ ఎయిట్‌) కూటమిగా అవతరించింది?

1) డెన్వర్‌         2) రియాద్‌      

3) వర్జీనియా     4) సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌


5. G-7 దేశాల కూటమిలో ఏ దేశం చేరడంతో G-8 కూటమి అవతరించింది?

1) సోవియట్‌ రష్యా      2) భారతదేశం

3) దక్షిణాఫ్రికా              4) బ్రెజిల్‌


6. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు G-20 (గ్రూప్‌ ఆఫ్‌ ట్వెంటీ) దేశాల కూటమి ఎప్పుడు ఏర్పడింది?

1) 1997     2) 1998 

3) 1999     4) 2001


7.G-20 కూటమిలోని దేశాలను గుర్తించండి.

ఎ) అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణకొరియా

బి) యూరోపియన్‌ యూనియన్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ

సి) మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా

డి) పాకిస్థాన్, నార్వే, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేసియా

1) ఎ, సి, డి        2) ఎ, బి, డి

3) ఎ, బి, సి      4) పైవన్నీ

8. G-20 దేశాల కూటమి తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

1) బెర్లిన్‌         2) మాస్కో     

3) సిడ్నీ          4) జకార్తా


9.G-20 కి సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) ప్రపంచ జీడీపీలో దీని వాటా 85 శాతం.   

బి) అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం వాటా ఉంది.

సి) ప్రపంచ జనాభాలో 2/3 వ వంతు ఉంది.

డి) ఈ కూటమి తీసుకునే నిర్ణయాలకు అంతర్జాతీయంగా చట్టబద్ధత ఉంది.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి

3) ఎ, బి, డి     4) పైవన్నీ


10. 2008 నుంచి G-20 కూటమిలో శాశ్వత ఆహ్వానిత దేశంగా  కొనసాగుతోన్న దేశం ఏది? 

1) శ్రీలంక            2) సింగపూర్‌ 

3) ఫిలిప్పీన్స్‌      4) స్పెయిన్‌


11. G-20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన దేశాలకు సంబంధించి కిందివాటిలో సరైంది? 

ఎ) 14వ సమావేశం - జపాన్‌ - 2019

బి) 15వ సమావేశం - సౌదీఅరేబియా - 2020

సి) 16వ సమావేశం - ఇటలీ - 2021

డి) 17వ సమావేశం - ఇండోనేసియా - 2022

1) ఎ, బి, డి     2) ఎ, బి, సి

3) ఎ, సి, డి     4) పైవన్నీ


12.G-20 18వ శిఖరాగ్ర సదస్సు 2023లో ఏ దేశంలో జరగనుంది?

1) ఇండియా     2) బ్రెజిల్‌

3) చైనా            4) టర్కీ


13. G-20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం ఎప్పుడు స్వీకరించింది?

1) 2021, డిసెంబరు 21 

2) 2020, డిసెంబరు 1

3) 2022, డిసెంబరు 1 

4) 2022, నవంబరు 19


14. ‘21వ శతాబ్దంలో అందరికీ అవకాశాలను గుర్తించడం’ అనే నినాదంతో జరిగిన G-20 సమావేశం ఎన్నోది? 

1) 13వ సమావేశం    2) 14వ సమావేశం

3) 15వ సమావేశం    4) 16వ సమావేశం


15. SAARC (సార్క్‌)ను విస్తరించండి.

1) South Association Agreement for Regional Co-operation

2) South Asian Association for Regional Co-operation

3) South Association Activities For Rural Contribution

4) South Audit Accommodation for Regular Connectivity


16. దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ‘సార్క్‌’ను ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదన చేసింది ఎవరు? 

1) జియావుర్‌ రెహమాన్‌ (బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షుడు)

2) ఆంగ్‌సాన్‌ సూకీ (బర్మా ప్రజాస్వామ్య పోరాట యోధురాలు)

3) బెనజీర్‌ భుట్టో (పాకిస్థాన్‌ మాజీ ప్రధాని)

4) రాజీవ్‌గాంధీ (భారత మాజీ ప్రధాని)


17. 1985, డిసెంబరు 8న ఎక్కడ నిర్వహించిన సమావేశంలో ‘సార్క్‌’ను ఏర్పాటు చేశారు?

1) న్యూదిల్లీ - ఇండియా 

2) ఢాకా - బంగ్లాదేశ్‌   

3) ఇస్లామాబాద్‌ - పాకిస్థాన్‌ 

4) కొలంబో - శ్రీలంక


18. ‘సార్క్‌’కు సంబంధించి కిందివాటిలో సరైంది గుర్తించండి.

ఎ) దీన్ని ప్రారంభించినప్పుడు సభ్యదేశాల సంఖ్య - 7

బి) ఇందులోని ప్రస్తుత సభ్యదేశాల  సంఖ్య - 8

సి) దీని ప్రధాన కార్యాలయం - ఖాట్మండులో ఉంది

డి) అయిదేళ్లకొకసారి సార్క్‌ సమావేశాలు జరుగుతాయి.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి 

3) ఎ, బి, డి      4) పైవన్నీ

19. 2007లో న్యూదిల్లీలో జరిగిన ‘సార్క్‌’ సమావేశాల్లో 8వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది?

1) మయన్మార్‌     2) పాకిస్థాన్‌      

3) ఆఫ్గనిస్థాన్‌      4) నేపాల్‌


20. ‘సార్క్‌’ సభ్యదేశాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌

బి) ఇండియా, మాల్దీవులు, నేపాల్‌

సి) మయన్మార్, తైవాన్‌

డి) పాకిస్థాన్, శ్రీలంక

1) ఎ, బి, డి     2) ఎ, బి, సి

3) ఎ, సి, డి     4) పైవన్నీ

మరికొన్ని...

1. ‘సార్క్‌’ సమావేశాలకు పరిశీలక హోదా లేని దేశాలు ఏవి?

1) అమెరికా, చైనా 

2) యూరోపియన్‌ యూనియన్‌

3) జపాన్, ఇరాన్‌     

4) నార్వే, స్వీడన్‌


2. ‘సార్క్‌’ లక్ష్యాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం

బి) సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించి, సుస్థిర ప్రగతి, శాంతిని సాధించడం

సి) పేదరిక నిర్మూలన, అక్షరాస్యత పెరుగుదలకు కృషి చేయడం

డి) ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయడం

1) ఎ, బి, సి     2) ఎ, బి, డి

3) ఎ, సి, డి     4) పైవన్నీ


3. ‘సార్క్‌’ ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించి కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

1) వ్యవసాయ సమాచార కేంద్రం - ఢాకా

2) మానవ వనరుల అభివృద్ధి కేంద్రం - ఇస్లామాబాద్‌

3) అటవీ కేంద్రం - ఇండోర్‌

4) సాంస్కృతిక కేంద్రం - శ్రీలంక


4. ‘సార్క్‌’ దేశాల ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) విపత్తు నిర్వహణ కేంద్రం - న్యూదిల్లీ

బి) ఇంధన కేంద్రం - ఇస్లామాబాద్‌

సి) వాతావరణ పరిశోధన కేంద్రం - ఢాకా

డి) కోస్తా ప్రాంతాల నిర్వహణ కేంద్రం - మాల్దీవులు

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి

3) ఎ, బి, సి     4) పైవన్నీ


5. ‘సార్క్‌’ దేశాలకు సంబంధించిన ‘దక్షిణాసియా విశ్వవిద్యాలయం’ ఎక్కడ ఏర్పాటైంది?

1) న్యూదిల్లీ     2) ఖాట్మండు       

3) కొలంబో     4) ఢాకా


6. 'SAFTA' (ఎస్‌ఏఎఫ్‌టీఏ)ను విస్తరించండి.

1) South Asian Fund for Trade Agreement

2) South Asian Free Trade Agreement

3) South Asian Forehead Trade Agreement

4) South Asian Family Trade Agreement


7. 2010 నాటికి ‘సార్క్‌’ ఏర్పడి పాతికేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘రజతోత్సవ సదస్సు’ ఎక్కడ నిర్వహించారు?

1) థింపూ     2) ఖాట్మండు    

3)మాలె     4) కొలంబో


8. దక్షిణాసియా దేశాల స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందం (SAFTA) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 

1) 2006, జులై 1       2) 2007, జులై 1

3) 2008, జులై 1      4) 2001, జులై 1

Posted Date : 05-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌