• facebook
  • whatsapp
  • telegram

ముఖ్యమైన వాయువులు: ధర్మాలు, ఆవర్తనాలు

మాదిరి ప్రశ్నలు

1. సల్ఫర్‌ట్రైఆక్సైడ్‌ను నీటిలో కరిగించినప్పుడు ఏర్పడే ఆమ్లం ఏది?

1) సల్ఫ్యూరస్‌ ఆమ్లం     2) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం

3) కార్బోనిక్‌ ఆమ్లం         4) పెరాక్సీసల్ఫ్యూరిక్‌ ఆమ్లం

జ; సల్ఫ్యూరిక్‌ ఆమ్లం

2. కింది వాటిలో వాయువు కానిది?

1) SO         2) SO3       3) NH          4) Br2

జ; Br2

3.  ద్విపరమాణుక వాయువును గుర్తించండి.

1) ఫ్లోరిన్‌              2) క్లోరిన్‌       

3) ఆక్సిజన్‌         4) పైవన్నీ

జ; పైవన్నీ

4. కింది వాటిలో ఏకపరమాణుక వాయువు ఏది?

1) హీలియం      2) హైడ్రోజన్‌      

3) ఆర్గాన్‌           4) 1, 3 

జ; 1, 3 


5. నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఆక్సిజన్‌తో చర్య జరిపి ఏర్పరిచే వాయువు ఏది?

1) నైట్రోజన్‌డైఆక్సైడ్‌         2) నైట్రిక్‌ ఆమ్లం

3) నైట్రస్‌ ఆక్సైడ్‌               4) ఏదీకాదు

జ; నైట్రోజన్‌డైఆక్సైడ్‌ 

6. కింది వాటిని జతపరచండి.

నైట్రోజన్‌ ఆక్సైడ్‌         రసాయన ఫార్ములా

A) నైట్రస్‌ ఆక్సైడ్‌                (i) NO

B) నైట్రిక్‌ ఆక్సైడ్‌                (ii) NO2

C)నైట్రోజన్‌ డైఆక్సైడ్‌          (iii) N2O

1) A-iii, B-ii, C-i            2) A-ii, B-i, C-iii

3) A-iii, B-i, C-ii           4) A-i, B-iii, C-ii

జ; A-iii, B-i, C-ii


7.  కింది వాటిలో ఫాస్ఫీన్‌ వాయువు రసాయన ఫార్ములా ఏమిటి?

1) NH3         2) PH3

3) P2O5       4) PCl3

జ; PH3

8. కింది వాటిలో సరైంది గుర్తించండి.

(i) ఫాస్ఫీన్‌ కుళ్లిన చేపల వాసన గల రంగులేని వాయువు.

(ii) ఫాస్ఫీన్‌ విష స్వభావం ఉన్న వాయువు

(ii) ఫాస్ఫీన్‌ను పొగతెరల్లో(Smoke Screen)ఉపయోగిస్తారు.

1) (i), (ii) మాత్రమే       2) (ii), (iii) మాత్రమే  

3) (i), (iii)మాత్రమే       4) పైవన్నీ

జ;పైవన్నీ


9.  కింది వాటిలో ఆమ్ల ఆక్సైడ్‌కు ఉదాహరణ?

1) CO        2) SO2      3) 1, 2          4) N2O

జ;1, 2


10. వాయుస్థితిలో లభ్యమయ్యే హాలోజన్‌ ఏది?

1) ఫ్లోరిన్‌         2) క్లోరిన్‌      

3) బ్రోమిన్‌      4) 1, 2

జ; 1, 2


11. ప్రతిపాదన A): ఇతర హాలోజన్‌లతో పోలిస్తే ఫ్లోరిన్‌ అనేక ధర్మాల్లో అసంగత ప్రవర్తనను ప్రదర్శిస్తుంది.

కారణం (R):చిన్న పరిమాణం, అత్యధిక రుణవిద్యుదాత్మకత, కనిష్ఠ F-F బంధ విఘటన శక్తి, బాహ్య కర్పరంలోd - ఆర్బిటాళ్లు లేకపోవడం ఫ్లోరిన్‌ అసంగత ప్రవర్తనకు కారణం.

1) (A) నిజం కానీ (R) తప్పు

2) (A) తప్పు కానీ (R) నిజం

3)(A), (R) రెండూ నిజం, (A)కు (R) సరైన వివరణ.

4) (A), (R) రెండూ నిజం, కానీ (A) కు (R)  సరైన వివరణ కాదు.

జ;(A), (R) రెండూ నిజం, (A)కు (R) సరైన వివరణ

12. ఒక మంచి బ్లీచింగ్‌ పౌడర్‌ నమూనాలో ఎంత క్లోరిన్‌ అందుబాటులో ఉంటుంది? 

1) 10 - 15%      2) 35 - 38%       3) 5 - 10%    4) 48 - 58%

జ;35 - 38%


13. కింది వాటిలో హీలియం వాయువునకు సంబంధించి సరైంది ఏది?

(i) హీలియం మండే స్వభావం లేని తేలికైన వాయువు.

(ii) హీలియం వాయువును వాతావరణ పరిశీలనలో ఉపయోగించే బెలూన్‌లను నింపడానికి వాడతారు.

(iii) ద్రవ హీలియంను క్రయోజెనిక్‌ కారకంగా వాడతారు.

1) (i), (ii) మాత్రమే      2) (ii), (iii) మాత్రమే           

3) (i), (iii)మాత్రమే      4) పైవన్నీ

జ; పైవన్నీ

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌