1. మానవ వనరుల్లో ముఖ్యమైంది ఏది?
1) జనాభా 2) సహజ వనరులు
3) భౌతిక వనరులు 4) పైవేవీకావు
2. ఆర్థికాభివృద్ధి భౌతికమైన సహజ వనరులపైనే కాకుండా దేనిపై ఆధారపడుతుంది?
1) మానవ వనరులు 2) మూలధన వనరులు
3) సాంకేతిక వనరులు 4) ఏదీకాదు
3. శిశు మరణాల రేటు (ఇన్‌ఫాంట్ మోర్టాలిటీ రేట్ - ఐఎంఆర్) అంటే...
1) ప్రతి 1000 సజీవ జననాల్లో శిశువు ఏడాది నిండక ముందే మరణించడం
2) ప్రతి 1000 మంది పురుషులకు ఎందరు స్త్రీలు ఉన్నారో తెలియజేయడం
3) ప్రతి 1000 మంది బాలురకు ఎందరు బాలికలు ఉన్నారో తెలపడం
4) ఏదీకాదు
4. సగటున ఒక చ.కి.మీ విస్తీర్ణంలో నివసించే ప్రజల సంఖ్యను ఏమంటారు?
1) జనాభా విస్ఫోటనం 2) జన సాంద్రత
3) జనాభా 4) లింగ నిష్పత్తి
5. లింగ నిష్పత్తి (జెండర్ సెక్స్ రేషియో) అంటే ఏమిటి?
1) ప్రతి 1000 మంది పురుషులకు ఎందరు స్త్రీలు ఉన్నారో సూచించడం
2) ప్రతి 1000 సజీవ జననాల్లో శిశువు ఏడాది నిండక ముందే మరణించడం
3) ప్రతి 1000 మంది బాలురకు ఎందరు బాలికలు ఉన్నారో తెలపడం
4) ఒక స్త్రీకి సగటున జన్మించే పిల్లల సంఖ్యను తెలియజేయడం
6. స్వాతంత్య్రం తర్వాత జనాభా లెక్కల సేకరణ (సెన్సస్ యాక్ట్) చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు?
1) 1950 2) 1947
3) 1948 4) 1949
7. భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు?
1) 1955 2) 1956
3) 1957 4) 1958
8. జనాభా విషయంలో గొప్ప విభజన సంవత్సరం (ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్) ఏది?
1) 1911 2) 1921
3) 1922 4) 1951
9. ‘ఎస్సే ఆన్ ద ప్రిన్స్‌పుల్స్ ఆఫ్ పాపులేషన్’ పుస్తక రచయిత?
1) మార్షల్ 2) మాల్థస్
3) ఆడమ్‌స్మిత్ 4) ఎవరూ కాదు
10. అంతర్జాతీయ జనాభా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జులై 11 2) జులై 12
3) జులై 13 4) ఏదీకాదు
11. 2022, నవంబరు 15 నాటికి మొత్తం ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంది?
1) 8 బిలియన్లు 2) 9 బిలియన్లు
3) 10 బిలియన్లు 4) 11 బిలియన్లు
12. మనదేశంలో జనాభా లెక్కల సేకరణ ఎన్నేళ్లకొకసారి జరుగుతుంది?
1) అయిదు 2) ఆరు
3) పది 4) మూడు
13. కింది వాటిని జతపరచండి. (వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ - 2022 ప్రకారం మొత్తం ప్రపంచ జనాభా అంచనా)
a) 2030 i) 9.7 బిలియన్లు
b) 2050 ii) 8.5 బిలియన్లు
c)2100 iii) 141.2 కోట్లు
D) 2022 నాటికి iv)10.4 బిలియన్లు
భారత్ జనాభా
1) a-ii, b-i, c-iv, d-iii
2) a-iii, b-ii, c-iv, d-i
3) a-iii, b-iv, c-i, d-ii
4) a-i, b-ii, c-iii, d-iv
14. యూఎన్‌ఓ ప్రకారం Day of 8th billion ఎప్పుడు నిర్వహించారు?
1) 15 నవంబరు, 2022
2) 16 నవంబరు, 2022
3) 17 నవంబరు, 2022
4) 18 నవంబరు, 2022
15.Day of 6th billion అని ఏ రోజును పిలుస్తారు?
1) అక్టోబరు 12 2)అక్టోబరు 13
3) అక్టోబరు 14 4) అక్టోబరు 15
16. స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లో జనాభా లెక్కల సేకరణ ఎవరి కాలంలో, ఎప్పుడు ప్రారంభమైంది?
1) లార్డ్ మేయో, 1872
2) లార్డ్ రిప్పన్, 1873
3)లార్డ్ కర్జన్, 1874
4) లార్డ్ మెకాలే, 1875
17. స్వాతంత్య్రానికి ముందు దేశంలో పూర్తిస్థాయి జనాభా లెక్కల సేకరణ ఎవరి కాలంలో, ఎప్పుడు ప్రారంభమైంది?
1) లార్డ్ రిప్పన్, 1881
2) లార్డ్ మేయో, 1882
3) లార్డ్ మెకాలే, 1883
4) ఏదీకాదు
18. స్వాతంత్య్రానంతరం భారత్‌లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1951 2) 1952
3) 1953 4) 1954
19. కింది వాటిలో జనాభా లెక్కలకు సంబంధించి సరైంది?
1) కేంద్ర జాబితా 2) 246 అధికరణం
3) 7వ షెడ్యూల్ 4) పైవన్నీ
20. యూఎన్‌ఓ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ (డబ్ల్యూపీపీ) - 2022 ప్రకారం 2050 నాటికి భారతదేశ మొత్తం జనాభా అంచనా?
1) 166.8 కోట్లు 2) 165.8 కోట్లు
3) 164.8 కోట్లు 4) 163.8 కోట్లు
21. డబ్ల్యూపీపీ-2022 నివేదిక ప్రకారం జనాభా పరంగా అయిదు పెద్ద దేశాలు ఏవి? (2022 నాటికి)
1) చైనా (142.6 కోట్లు)
2) భారత్ (141.2 కోట్లు)
3) యూఎస్‌ఏ (33.7 కోట్లు), ఇండోనేసియా (27.5 కోట్లు), పాకిస్థాన్ (23.4 కోట్లు)
4) పైవన్నీ
22. యూఎన్‌ఓ డబ్ల్యూపీపీ-2022 నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో అతిపెద్ద అయిదు దేశాలు వరుసగా...
1) భారత్, చైనా, యూఎస్‌ఏ, నైజీరియా, పాకిస్థాన్
2) చైనా, భారత్, యూఎస్‌ఏ, పాకిస్థాన్, నైజీరియా
3) చైనా, భారత్, యూఎస్‌ఏ, ఇండోనేసియా, బ్రెజిల్
4) చైనా, భారత్, పాకిస్థాన్, యూఎస్‌ఏ, బ్రెజిల్
23. యూఎన్‌ఓ డబ్ల్యూపీపీ-2022 నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాకి సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది?
a) 2022 నాటికి i) 8512 మిలియన్లు
b)2030 నాటికి ii) 7942 మిలియన్లు
c)2050 నాటికి iii) 86.1 కోట్లు
d) 1990 నాటికి iv) 9687 మిలియన్లు
భారతదేశ మొత్తం జనాభా
1) a-ii, b-i, c-iv, d-iii
2) a-ii, b-iii, c-iv, d-i
3) a-iii, b-i, d-ii, c-iv
4) a-ii, b-i, c-iv, d-iii
24. ప్రస్తుతం మనదేశ ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్’ కమిషనర్ ఎవరు?
1) డాక్టర్ సి.చంద్రమౌళి
2) డాక్టర్ వివేక్ జోషి
3) వై.వి.అనురాధ
4) అనురాగ్ శర్మ
25. 2011 జనాభా లెక్కల సేకరణ సెన్సస్ కమిషనర్?
1) డాక్టర్ రాజీవ్‌కుమార్
2) డాక్టర్ సి.చంద్రమౌళి
3) అమితాబ్‌కాంత్
4) రమేష్ చంద్

మరికొన్ని..
1. భారత్‌లో జనాభా లెక్కలు సేకరించే సంస్థ?
1) రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం
2) నీతిఆయోగ్
3) జాతీయ గణాంక సంస్థ
4) కేంద్ర గణాంక సంస్థ
2. ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా స్థాపన, ప్రధాన కార్యాలయం -
1) 1961, న్యూదిల్లీ 2) 1962, ముంబయి
3) 1963, చెన్నై 4) 1964, కోల్‌కతా
3. మన దేశంలో జనాభా లెక్కల సేకరణ ఏ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు?
1) కేంద్ర ఆర్థికశాఖ 2) కేంద్ర హోంశాఖ
3) ఎన్‌ఎస్‌ఓ 4) నీతిఆయోగ్
4. ‘ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్’ ఏ శాఖకు చెందింది?
1) కేంద్ర హోంశాఖ
2) కేంద్ర ఆర్థికశాఖ
3) కేంద్ర ఆరోగ్యశాఖ
4) కేంద్ర మానవవనరులశాఖ
5. 2021 నాటికి భారతదేశంలో మొత్తం జనాభా...
1) 136.3 కోట్లు 2) 135.12 కోట్లు
3) 134.2 కోట్లు 4) 133.13 కోట్లు
6. 1951లో భారత్ మొత్తం జనాభా?
1) 31.9 కోట్లు 2) 36.109 కోట్లు
3) 43.9 కోట్లు 4) 38.1 కోట్లు
7. 2011 నాటికి దేశ మొత్తం జనాభా?
1) 121.085 కోట్లు 2) 121.04 కోట్లు
3) 121.03 కోట్లు 4) 121.02 కోట్లు
8. 2011లో భారత వార్షిక జనాభా వృద్ధి రేటు?
1) 1.63% 2) 1.65%
3) 1.66% 4) 1.67%
9. 2021 నాటికి మనదేశ వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత?
1) 1.08% 2) 1.06%
3) 1.05% 4) 1.04%
10. 2011 నాటికి భారతదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు?
1) 71% 2) 72% 3) 73% 4) 75%
11. 2017 నాటికి భారత్‌లో మొత్తం అక్షరాస్యత రేటు?
1) 77.7% 2) 75.7%
3) 77.5% 4) 77.4%
12. ప్రస్తుతం భారత్‌లో ఎన్నో జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంది?(1872 నుంచి)
1) 16 2) 17 3) 18 4) 19
* ఏదైనా ఒక దేశంలో విపరీతమైన జనాభా పెరుగుదలను సూచించేది?
1) జనసాంద్రత
2) మరణాల రేటు పెరుగుదల
3) జననాల రేటు తగ్గుదల
4) జనాభా విస్ఫోటనం
జవాబు: 4
* సంతానోత్పత్తి రేటు అంటే ఏమిటి?
1) మొత్తం పునరుత్పత్తి కాలంలో స్త్రీకి సగటున జన్మించే పిల్లల సంఖ్య
2) మాతాశిశు మరణాల రేటు
3) బాలబాలికల మరణాల రేటు
4) ఏదీకాదు
జవాబు: 1
* 2011 జనాభా లెక్కల సేకరణ నినాదం ఏమిటి?
1) అవర్ గోల్, అవర్ సెన్సస్
2) అవర్ సెన్సస్, అవర్ ఫ్యూచర్
3) అవర్ ఫ్యూచర్, అవర్ నేచర్
4) ఏదీకాదు
జవాబు: 2