• facebook
  • whatsapp
  • telegram

పేదరికం

1. భారత్‌లో పేదరికం, ఆర్థిక అసమానతలకు ప్రధాన ఆర్థిక కారణాలు ఏవి?

1) నిరుద్యోగం    2) అధిక జనాభా    3) తక్కువ పొదుపు     4) 1, 2


2. పేదరిక విష వలయం గురించి(Vicious Circle of Poverty) ఎవరు తెలిపారు?

1) రాగ్నర్‌ నర్క్స్‌    2)  రాగ్నర్‌ ఫ్రిష్‌     3) రాబిన్స్‌       4) ఎవరూ కాదు


3. కింది వాటిలో ఆదాయ అసమానతలకు సంబంధించిన పేదరికం ఏది?

1) సాపేక్ష పేదరికం    2) నిరపేక్ష పేదరికం    3) పేదరిక వ్యత్యాసం  4) దారిద్య్రరేఖ


4. ప్రజలు కనీస అవసరాలు కూడా పొందలేని పేదరికం...

1) సాపేక్ష పేదరికం      2) నిరపేక్ష పేదరికం  3) 1, 2    4) నిరుద్యోగం


5. ప్రస్తుతం భారత్‌లో పేదరిక గణాంకాలను అంచనా వేస్తున్న సంస్థ ఏది?

1) జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ)     2) నీతి ఆయోగ్‌    3) ప్రణాళికా సంఘం  4)  కేంద్ర గణాంక సంస్థ


6. భారతదేశంలో మొదటగా పేదరికాన్ని అంచనా వేసిందెవరు?

1) దాదాభాయ్‌ నౌరోజీ     2) దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌   3) సరోజినీ నాయుడు    4)  దండేకర్‌


7. 'Poverty and Un-British Rule in India'  పుస్తక రచయిత ఎవరు?

1) దాదాభాయ్‌ నౌరోజీ      2) మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా    3) డా. సి. రంగరాజన్‌      4) దండేకర్‌


8. పేదరికం నిర్మూలన, స్వావలంబన ప్రధాన లక్ష్యాలుగా రూపొందించిన ప్రణాళిక...

1) నాలుగో ప్రణాళిక     2) అయిదో ప్రణాళిక   3) మూడో ప్రణాళిక     4) ఆరో ప్రణాళిక


9. ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చిన వారెవరు?

1) రాజీవ్‌గాంధీ    2) నెహ్రూ 

3) ఇందిరాగాంధీ    4) మహాత్మాగాంధీ 


10.  ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చిన సంవత్సరం...

1) 1970    2) 1971   3) 1972   4) 1973


11. ‘గరీబీ హఠావో’ అంటే ఏమిటి?

1) నిరుద్యోగాన్ని తరిమేయడం     2) పేదరికం లేకుండా చేయడం

3) ఆర్థిక అసమానతల నియంత్రణ    4) ఆదాయాన్ని పెంచడం


12. ‘గరీబీ హఠావో’ అనే నినాదాన్ని ఏ ప్రణాళికా కాలంలో ఇచ్చారు?

1) మూడో ప్రణాళిక    2) నాలుగో ప్రణాళిక   3) అయిదో ప్రణాళిక      4) ఆరో ప్రణాళిక


13. మనదేశంలో పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే అంశం ఏది?

1) కుటుంబ వినియోగ వ్యయం    2) దారిద్య్రరేఖ    3) కేలరీలు       4) పేదరిక వ్యత్యాసం


14. పేదరిక కొలమాన అధ్యయన కమిటీ (2012) అధ్యక్షుడు ఎవరు?

1) అహ్లూవాలియా    2) డాక్టర్‌ సి.రంగరాజన్‌    3) దండేకర్‌  4) అరవింద్‌ పనగరియా


15. పేదరికపు అంచనాలకు సంబంధించి నీతి ఆయోగ్‌ నియమించిన టాస్క్‌ఫోర్స్‌ అధ్యక్షుడు ఎవరు?

1)సక్సేనా   2) రంగరాజన్‌    3) రథ్‌     4) అరవింద్‌ పనగరియా


16. భారత్‌లో గ్రామీణ పేదలకు కనీసం వంద రోజులు పని హామీ ఇస్తున్న పథకం ఏది?

1) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

2) సమగ్ర జాతీయ గ్రామీణ ఉపాధి పథకం

3) ఆత్మనిర్భర్‌ భారత్‌      

4) ప్రధానమంత్రి గ్రామీణ కౌశల్‌ యోజన


17. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని గుర్తించే భారామితుల పరిశీలనకు 2008లో గ్రామీణాభివృద్ధిశాఖ నియమించిన కమిటీ ఏది?

1) సక్సేనా కమిటీ    2) అలఘ్‌ కమిటీ    3) రంగరాజన్‌ కమిటీ  4) హసీం కమిటీ


18. కింది వాటిలో పేదరికాన్ని అంచనా వేయడానికి నియమించిన కమిటీల్లో సరైంది?

ఎ) వై.కె.అలఘ్‌ కమిటీ  1979

బి) లక్డావాలా కమిటీ  1993

సి) సురేష్‌ తెందూల్కర్‌ కమిటీ  2009

1) ఎ, బి   2) ఎ, సి    3) బి, సి    4) పైవన్నీ


19. స్వాతంత్య్రానంతరం ప్రణాళికా సంఘం తొలిసారిగా పేదరికంపై వర్కింగ్‌ గ్రూపును ఎప్పుడు నియమించింది?

1) 1960     2) 1961     3) 1962   4) 1963


20. తొలిసారిగా ఒక క్రమపద్ధతిలో భారత్‌లో పేదరికాన్ని అంచనా వేసిన ఆర్థికవేత్తలు ఎవరు?

1) దండేకర్‌   2) రథ్‌    3) 1, 2    4) అలఘ్‌ 


21. మానవ పేదరిక సూచికను ఎవరు ప్రవేశపెడతారు?

1) UNDP  2) WTO    3) WHO     4) NSO


22. మానవ పేదరిక సూచికను తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1)1996      2) 1997     3)  1998     4) 1999


23. బహుళకోణ పేదరిక సూచికను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

1) 2008    2) 2009    3) 2010    4) 2011


24. బహుళకోణ పేదరిక సూచికను ఎవరు ప్రవేశపెడతారు?

1) UNDP, Oxford Poverty & Human Development Initiative (OPHI)

2) IBRD    3) IMF     4) WTO


25. దారిద్య్రరేఖకు దిగువస్థాయి(Below Poverty Line-BPL) అంటే ఏమిటి?

1) ఒకరోజుకు కనీసం 2300 కేలరీల ఆహారం పొందే వినియోగ స్థాయి కూడా లేకపోవడం

2) ఒకరోజుకు కనీసం 2300 కేలరీల కంటే ఎక్కువ వినియోగం ఉన్నవారు

3)ఒకరోజుకు కనీసం 2400 కేలరీల కంటే ఎక్కువ వినియోగం ఉన్నవారు

4) 2100 కేలరీల కంటే తక్కువ వినియోగం ఉన్నవారు


26. ఒకరోజుకు కనీసం 2300 కేలరీల కంటే ఎక్కువ వినియోగం ఉన్నవారిని ఏమంటారు?

1) దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు

2) దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు (Above Poverty Line)

3) సాపేక్ష పేదవారు      4) నిరుద్యోగులు


27. ఆదాయ, అసమానతలను అంచనా వేసే రేఖ ఏది?

1) ఫిలిప్స్‌ రేఖ   2) బడ్జెట్‌ రేఖ    3) లొరెంజ్‌ వక్రరేఖ    4) ఉదాసీన వక్రరేఖ


28. మొదటిసారిగా రాష్ట్రాలకు పేదరికపు గీతలను అంచనా వేసిన కమిటీ?

1) డా. లక్డావాలా కమిటీn    2) రంగరాజన్‌ కమిటీ   3) సక్సేనా కమిటీ      4) అలఘ్‌ కమిటీ

సమాధానాలు

1-4  2-1 3-1  4-2  5-1  6-1  7-1  8-2  9-3  10-2  11-2  12-2  13-1  14-2  15-4 16-1  17-1  18-4  19-3  20-3  21-1  22-2  23-3 24-1  25-1  26-2    27-3   28-1. 


మరికొన్ని..

1. సాంఘిక న్యాయంలో (Social Justice)  ప్రధాన భాగం...

1)పేదరికాన్ని తొలగించడం     2) ఆదాయ, అసమానతలను తొలగించడం

3) 1, 2      4) ఆర్థిక శక్తి కేంద్రీకరణ


2. పేదరికం అనేది కింది వాటిలో ఏ రకమైన సమస్య?

1) బహుముఖ సమస్య (Multi-Faceted)    2) ఏకముఖ సమస్య    3) నిరుద్యోగ సమస్య    4) ఎంపిక సమస్య


3. సగటున ఎన్ని కేలరీలను దారిద్య్రరేఖగా భావిస్తారు?

1) 2100 కేలరీలు   2) 2400 కేలరీలు    3) 2300 కేలరీలు    4) 1800 కేలరీలు


4. కింది వాటిలో పేదరికానికి గల కారణాల్లో సరైంది?

1) జనాభా పెరుగుదల    2) వ్యవసాయంపై ఆధారపడటం

3) నిరుద్యోగం, సహజవనరుల అల్ప వినియోగం    4) పైవన్నీ


5. కనీస అవసరాల పథకాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం?

1) 1975    2) 1976     3) 1977   4) 1978


6. కనీస అవసరాల పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు?

1) అయిదో ప్రణాళిక      2) ఆరో ప్రణాళిక   3) ఏడో ప్రణాళిక    4) ఎనిమిదో ప్రణాళిక


7. 20 సూత్రాల పథకాన్ని ఎప్పుడు రూపొందించారు?

1) 1974    2) 1975      3) 1976    4) 1977


8. డాక్టర్‌. సి. రంగరాజన్‌ కమిటీ అంచనాల ప్రకారం గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పేదరికపు నిర్ణాయక తలసరి నెలసరి వినియోగ వ్యయం...

1)  గ్రామాలు: 972 రూపాయలు పట్టణాలు: 1407 రూపాయలు

2) గ్రామాలు: 816 రూపాయలు పట్టణాలు: 1000 రూపాయలు 

3) 1, 2      4) గ్రామాలు: 970 రూపాయలు  పట్టణాలు: 1507 రూపాయలు


9. ప్రొఫెసర్‌ సురేష్‌ తెందూల్కర్‌ కమిటీ అంచనాల ప్రకారం పేదరికపు గీత సూచించే దినసరి వినియోగ వ్యయం...

1) గ్రామాలు: 27 రూపాయలు,  పట్టణాలు: 33 రూపాయలు

2) గ్రామాలు: 972 రూపాయలు,  పట్టణాలు: 1407 రూపాయలు

3) గ్రామాలు, పట్టణాల వినియోగం 1800 కేలరీలు 

4) 1, 2

సమాధానాలు

1-3  2-1 3-3  4-4  5-1  6-1  7-2  8-1  9-1.  

Posted Date : 21-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌