• facebook
  • whatsapp
  • telegram

రైలు రవాణా

రైలు రవాణా 

ఇండియన్‌ జాగ్రఫీ


రైలు రవాణా(Rail Transport)


భారతదేశంలో రైల్వే వ్యవస్థ


భారతదేశ రైల్వే పితామహుడిగా (Father of Indian Railways)  లార్డ్‌ డల్హౌసి పేరొందారు. 

భారతదేశంలో మొట్టమొదటి రైల్వే లైన్‌ను 1853, ఏప్రిల్‌ 16న గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులర్‌ రైల్వే ఆధ్వర్యంలో బొంబాయి నుంచి థానే వరకు (34 కి.మీ. పొడవు) ఏర్పాటు చేశారు. నాటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ డల్హౌసి.


 దేశంలో రెండో రైలు మార్గం హౌరా, హుగ్లీల మధ్య నిర్మించారు.


 దక్షిణ భారతదేశంలో మొదటి రైలు 1856 జులై 1న లేయ్‌ సరాప్ది (మద్రాసు) నుంచి వల్లజారోడ్‌ (ఆర్కాట్‌) వరకు ప్రయాణించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి రైలు మార్గం 1862లో పుత్తూరు నుంచి రేణిగుంట మధ్య ప్రారంభమైంది.


 1947లో జాన్‌ మత్తాయ్‌ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2017లో బిబేక్‌ దేబ్రాయ్‌ కమిటీ సూచన ప్రకారం రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు.


 భారత రైల్వేల ప్రధాన కార్యాలయం రైల్‌భవన్‌. ఇది న్యూదిల్లీలో ఉంది.


భారత రైల్వే మస్కట్‌ - (Bholu, the Elephant)  (లాంతరు పట్టుకున్న ఏనుగు)


ఈ చిహ్నంలో ఒక చేతిలో ఆకుపచ్చ రింగ్‌తో సిగ్నల్‌ ల్యాంప్‌ను పట్టుకున్న ఏనుగు కార్టూన్‌ కనిపిస్తుంది. ఈ మస్కట్‌ను భారత రైల్వే 150వ వార్షికోత్సవ స్మారక కార్యక్రమాల కోసం రూపొందించారు. దీన్ని 2002, ఏప్రిల్‌ 16న బెంగళూరులో ఆవిష్కరించారు. 


2003లో భారతీయ రైల్వే తన శాశ్వత అధికార చిహ్నంగా భోలును ఉంచాలని నిర్ణయించింది.

 గేజ్‌ రకం 

\

బ్రాడ్‌ గేజ్‌ 

 మీటర్‌ గేజ్‌ 

 నారో గేజ్‌

లైట్‌ నారో గేజ్‌     

స్టాండర్డ్‌ గేజ్‌ లేదా

 స్టీఫెన్‌సన్‌ లేదా   ఇంటర్నేషనల్‌ గేజ్‌   

పట్టాల మధ్య దూరం

           

     1.676 మీటర్లు      

 1.00 మీటర్లు/ 1000 మిల్లీమీటర్లు

     

0.762 మీటర్లు/ 762 మిల్లీమీటర్లు

0.610 మీటర్లు/ 610 మిల్లీమీటర్లు

   

1.435 మీటర్లు/   1435 మిల్లీమీటర్లు 

    

                                                                                                                                                                                     

* ఇందులో బ్రాడ్‌ గేజ్‌ను ‘ఇండియన్‌ గేజ్‌’ అంటారు.


* దేశంలో అధిక రైల్వే మార్గాలను బ్రాడ్‌ గేజ్‌లుగా మార్చారు.


* మెట్రో రైలు మార్గాలన్నీ స్టాండర్డ్‌ గేజ్‌ను కలిగి ఉంటాయి.


రైల్వేలు - అనుబంధ సంస్థలు


కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌(KRCL): 

ముంబయి దగ్గరలోని రోహా నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు సుమారు 761 కి.మీ. రైలు మార్గాన్ని నిర్మించడానికి కొంకణ్‌ రైల్వే 1990లో ఒక సంస్థగా ఏర్పడింది. జనవరి 26, 1998న ఈ మొత్తం లైను ట్రాఫిక్‌ కోసం తెరిచారు. 2023 నాటికి కొంకణ్‌ రైల్వే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్‌ జూబ్లీ వేడుకలను జరుపుకుంది


 ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.


 దీని ప్రధాన కార్యాలయం నవీ ముంబయి (బేలాపూర్‌)లో ఉంది.


 ముఖ్య ఉద్దేశం: ముంబయి, కొచ్చిల మధ్య దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గించడం.


 ఈ మార్గంలో 1880 బ్రిడ్జ్‌లు, 91 సొరంగాలు, 72 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. పొడవైన సొరంగ మార్గం 6.5 కి.మీ. పొడవైన ‘‘కర్బుడే టన్నెల్‌’’. ఇది రత్నగిరి (మహారాష్ట్ర) సమీపంలో ఉంది.


 ఈ మార్గంలో అత్యంత పొడవైన బ్రిడ్జి శరావతి నదిపై ఉంది. దీని పొడవు 2065.8 మీటర్లు.


రోరో (Roll on - Roll off):  భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన రవాణా విధానం. ఈ విధానంలో రైళ్లలో సరకులతో కూడిన ట్రక్కులను రవాణా చేస్తారు.

సంక్లిష్టమైన పశ్చిమ కనుమల్లో ట్రక్కులు నడపడం చాలా ప్రమాదకరం. ఈ కొంకణ్‌ రైలు మార్గానికి సమాంతరంగా ఎన్‌హెచ్‌-66 రహదారి ఉంటుంది.


ఐఆర్‌సీటీసీ (Indian Railway Catering and Tourism Corporation): 

 దీన్ని 1999లో స్థాపించారు.


రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి ఏర్పడిన సంస్థ.


దీని ద్వారా ప్రయాణికులకు ఆన్‌లైన్‌ టికెట్లు, టూరిజం, క్యాటరింగ్, మంచి నీళ్ల విక్రయం లాంటి కార్యక్రమాలు/సేవలు అందిస్తున్నారు.


ఐఆర్‌సీటీసీ మూడు ప్రైవేట్‌ రైళ్లను నిర్వహిస్తోంది. అవి:

1. లఖ్‌నవూ - న్యూదిల్లీ తేజస్‌ రైలు 


2. ముంబయి - అహ్మదాబాద్‌ తేజస్‌ రైలు


3. వారణాసి - ఇండోర్‌ కాశీ మహాకాల్‌ రైలు

కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (CONCOR): కంటెయినర్‌ రవాణా కోసం 1988లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.


ఐఆర్‌ఎస్‌డీసీ (Indian Railway Stations Development Corporation): 


దీన్ని ప్రత్యేకంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి 2012లో ఏర్పాటు చేశారు.


నూతన రైల్వే స్టేషన్ల నిర్మాణం, పాత రైల్వే స్టేషన్లను ఆధునికీకరించడం దీని విధులు.


 ఈ సంస్థను ఐఆర్‌సీఓఎన్‌ (Indian Railway Constructions Company Limited),ఐఆర్‌ఎస్‌డీసీ  (Rail Land Development Authority)లు సంయుక్తంగా 51:49 నిష్పత్తిలో స్థాపించాయి.


ఐఆర్‌ఎస్‌డీసీ స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో 23 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లను తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక చేశారు.

ముఖ్యమైన రైల్వే బ్రిడ్జ్‌లు/ వంతెనలు


ఎ) చినాబ్‌ బ్రిడ్జ్‌: ప్రపంచంలో అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌. ఇది జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో బక్కల్, కౌరి ప్రాంతాల మధ్య ఉంది. దీన్ని చినాబ్‌ నదిపై నిర్మించారు.


ఇది ఉక్కు, కాంక్రీట్‌ కలగలిపిన వంపు వంతెన. దీని ఎత్తు నదీ గర్భం నుంచి 359 మీటర్లు. పొడవు 1315 మీటర్లు లేదా 4314 అడుగులు.


ఈ వంతెన ఉద్దేశం కశ్మీర్‌ లోయను దేశంతో అనుసంధానించడం. ఉదంపూర్‌ - శ్రీనగర్‌ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా 28,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జ్‌ని నిర్మించారు.


 ఈ బ్రిడ్జ్‌ని 2022 ఆగస్టులో ప్రారంభించారు.


బి) బోగిబీల్‌ బ్రిడ్జి: 


భారతదేశంలో మొదటి పొడవైన రైలు కమ్‌ రోడ్డు బ్రిడ్జ్‌. దీని పొడవు 4.94 కి.మీ. 


దీన్ని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. అసోంలోని దిబ్రూఘర్, దేమాజి జిల్లాలను కలుపుతుంది.


ముఖ్యమైన సొరంగ మార్గాలు 


1. పిర్‌పంజాల్‌ రైల్వే టన్నెల్‌/ బనిహల్‌ రైల్వే టన్నెల్‌: 


జమ్మూతావి - ఉదంపూర్‌ - శ్రీనగర్‌ - బారాముల్లా రైల్వే లైన్‌లో 11.2 కి.మీ. పొడవుతో ఉన్న దేశంలోని పొడవైన సొరంగ మార్గం.


2. కర్బుడే టన్నెల్‌: దేశంలో రెండో పొడవైన సొరంగ మార్గం. దీన్ని కొంకణ్‌ రైల్వే మార్గంలో భాగంగా నిర్మించారు.

     కర్మాగారం పేరు స్థాపన   ఉన్న ప్రాంతం తయారుచేసేరైల్‌భాగాలు
చిత్తరంజన్‌ లోకోమోటివ్‌          1950  చిత్తరంజన్‌  (పశ్చిమ్‌బంగా)

     రైలు ఎలక్ట్రిక్‌ ఇంజిన్లు


 

ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ 1955  పెరంబూర్‌  (తమిళనాడు)

బోగీలు, ఏసీ కోచ్‌లు


 

డీజిల్‌లోకోమోటివ్‌వర్క్స్‌   1964       వారణాసి (యూపీ)     

బ్రాడ్‌ గేజ్, మీటర్‌ గేజ్‌ కోచ్‌లు, 

డీజిల్‌ ఇంజిన్లు 

వీల్‌ అండ్‌ఏక్సిల్‌ ప్లాంట్‌ 1983     ఎలహంక (బెంగళూరు)      చక్రాలు, ఇరుసులు
రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ 1988     కపుర్తలా (పంజాబ్‌) 

సెకండ్‌ క్లాస్‌ రైల్వే

బోగీలు

డీజిల్‌ కంపోనెంట్‌వర్క్స్‌     -     పటియాల (పంజాబ్‌) 

డీజిల్‌ ఇంజిన్‌

యంత్రవిడిభాగాలు

మెట్రో రైల్‌ (లేదా) Mass Rapid Transit System 


భారతదేశ మెట్రో రైల్‌ పితామహుడు (Metroman of India) : శ్రీధరన్‌ 

 దేశంలో మొదటి మెట్రో రైల్‌ను 1984లో కలకత్తా నగరంలో ప్రారంభించారు. 


ఈ మెట్రో రైల్‌ ప్రయాణించిన దూరం 3.4 కి.మీ.; స్టేషన్ల సంఖ్య - 17.

మెట్రో వ్యవస్థ  పట్టణం   ప్రారంభం      ప్రత్యేకత
కలకత్తా మెట్రో  1984        కలకత్తా      దేశంలోమొదటిమెట్రో
దిల్లీ మెట్రో     2002           దిల్లీ 

అతిపెద్దది, ఎక్కువ రద్దీ ఉంటుంది   (347 కి.మీ. పొడవు)


 

రాపిడ్‌ మెట్రో  2013     గుర్‌గావ్‌               (హరియాణా)       మొదటి ప్రైవేట్‌ మెట్రో
నమ్మ మెట్రో     బెంగళూరు 2011      బెంగళూరు       దక్షిణ భారత్‌లో మొదటిది
ముంబయి మెట్రో  2014     ముంబయి     మొదటి పీపీపీ నిర్మాణం
చెన్నై మెట్రో  2015         చెన్నై     

  మొదటి నీలి, ఆకుపచ్చ  లైన్స్‌ అనుసంధానం

హైదరాబాద్‌ మెట్రో  2017      హైదరాబాద్‌          అతిపెద్ద పీపీపీ మెట్రో
అహ్మదాబాద్‌ మెట్రో  2019     అహ్మదాబాద్‌   దేశంలో అతి చిన్న మెట్రో 

*మెట్రో రైలు విభాగంలో పీపీపీ అంటే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌. 


ప్రజలకు వస్తువులు లేదా సేవలను అందించడానికి ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగ సంస్థల మధ్య సహకార ఒప్పందమే పీపీపీ.


 

Posted Date : 04-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌