• facebook
  • whatsapp
  • telegram

భాగస్వామ్యం

 ఉమ్మడి వ్యాపారంలో వాటాల లెక్కలు! 


 పెద్ద ఎత్తున పెట్టుబడులతో స్థిరమైన వ్యాపారాభివృద్ధిని సాగించాలంటే భాగస్వామ్యం చాలా అవసరం. లాభనష్టాలను పంచుకోవడానికి, నైపుణ్యాలనుపెంచుకోవడానికి, సరికొత్త ఆవిష్కరణలకు తగిన అవకాశాన్ని ఈ ఉమ్మడి వ్యాపారం కల్పిస్తుంది. ఆ భాగస్వాముల్లో రకరకాలు ఉంటారు. వారి మధ్య వాటాల పంపిణీ వివిధ నియమాలను అనుసరించి జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి పోటీ పరీక్షలో అంకగణితంలో భాగంగా ప్రశ్నలు వస్తుంటాయి.  కొన్ని మౌలికాంశాలను తెలుసుకొని, ప్రాక్టీస్‌ చేస్తే మంచి మార్కులు సాధించుకోవచ్చు.  


భాగస్వామ్యం: ఇద్దరు/అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి చేసే వ్యాపారాన్ని ‘భాగస్వామ్యం’ లేదా ‘ఉమ్మడి వ్యాపారం’ అంటారు.


భాగస్వామ్యం 2 రకాలు. అవి


1) సామాన్య భాగస్వామ్యం(Simple Partnership): భాగస్వాములు తమ పెట్టుబడులను సమాన కాలాల్లో పెట్టుబడి పెడితే అలాంటి భాగస్వామ్యాన్ని ‘సామాన్య భాగస్వామ్యం’ అంటారు.


* వచ్చిన లాభం లేదా నష్టాన్ని పెట్టుబడుల నిష్పత్తిగా పంచుకుంటారు.


2) సంయుక్త భాగస్వామ్యం (Compound Partnership) : భాగస్వాములు తమ పెట్టుబడులను వేర్వేరు కాలాల్లో పెట్టుబడి పెడితే ఆ భాగస్వామ్యాన్ని ‘సంయుక్త భాగస్వామ్యం’ అంటారు.


నిర్వాహక/వాస్తవ భాగస్వామి(Working Partner): డబ్బును పెట్టుబడిగా పెడుతూ, వ్యాపారాన్ని నిర్వహించే భాగస్వామిని ‘వాస్తవ భాగస్వామి’ అంటారు.


నిష్క్రియా లేదా నామమాత్రపు భాగస్వామి(Sleeping Partner):  కేవలం డబ్బును మాత్రమే పెట్టుబడిగా పెడుతూ, వ్యాపారంలో ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించని భాగస్వామిని ‘నామమాత్రపు భాగస్వామి’ అంటారు.


గమనిక: నిర్వాహక లేదా నిష్క్రియా భాగస్వామ్యంలో వ్యాపారంలో వచ్చిన లాభాల్లో మొదటగా నిర్వాహక భాగస్వామి జీతాన్ని తీసివేయాలి. ఆ తర్వాత వచ్చిన లాభాలను వారి పెట్టుబడుల ఆధారంగా పంచుకోవాలి.


మాదిరి ప్రశ్నలు


1.  రూ.22,500, రూ.35,000 వరుస పెట్టుబడులతో శివాత్మిక, శివాత్మజ్‌లు వ్యాపారం ప్రారంభించారు. సంవత్సరం చివర్లో వారు పొందిన లాభం రూ.13,800. అయితే శివాత్మజ్‌ వాటా ఎంత?

1) రూ.5400     2) రూ.7200      3) రూ.7600     4) రూ.8400

వివరణ: శివాత్మిక : శివాత్మజ్‌

22,500 : 35,000

 9 : 14

సంవత్సరం చివర్లో వారు పొందిన లాభం రూ.13,800

23 ..... 13,800

14 ..... ?

శివాత్మజ్‌ వాటా = 

= రూ.8,400

జ: 4 


2.   దేవి, సత్యలు వ్యాపారంలో భాగస్వాములు. దేవి 8 నెలల పాటు రూ.35,000, సత్య 10 నెలల పాటు రూ.42,000 పెట్టుబడులు పెట్టారు. సంవత్సరాంతమున వారు పొందిన లాభం రూ.31,570. అయితే దేవి పెట్టుబడి వాటా ఎంత?

1) రూ.18,040           2) రూ.9,491   

3) రూ.18,942           4) రూ.12,628

వివరణ: దేవి : సత్య

8(35,000) : 10(42,000)

8 x 35 : 10 x 42

2 : 3

దేవి వాటా 5 ..... 31,570

2 ..... ?

= రూ.12,628

దేవి వాటా రూ.12,628

జ: 4


3.     A, B, C లు అనే భాగస్వాములు వరుసగా రూ.40,000, రూ.80,000, రూ.1,20,000 పెట్టుబడి పెట్టారు. ఏడాది చివర రూ.40,000 B ఉపసంహరించుకోగా, రెండో ఏడాది చివర రూ.80,000 C ఉపసంహరించుకున్నాడు. అయితే 3 సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన లాభాల పంపిణీ నిష్పత్తి ఎంత?

1) 4 : 3 : 2         2) 3 : 4 : 7

3) 1 : 2 : 3         4) 6 : 9 : 10

వివరణ: మూడేళ్ల తర్వాత వారికి వచ్చిన లాభాల పంపిణీ నిష్పత్తి 

= (40,000)3 : (80,000)1 + (40,000)2 : (1,20,000)2 + (40,000)1

1,20,000 : 1,60,000 : 28,000

12 : 16 : 28

 3 : 4 : 7

జ: 2


4.   X,Y,Z లు వ్యాపారంలో రూ.50,000 మూలధనం సమకూర్చుకున్నారు. Y కంటే రూ.4000 ఎక్కువ X,Z కంటే రూ.5000 Y ఎక్కువ పెట్టారు. అయితే మొత్తం లాభం రూ.35,000 లలో X వాటా ఎంత?

1) రూ.8,400         2) రూ.14,700 

3) రూ.3,900         4) రూ.11,800

వివరణ:  

X     Y    Z

a + 9   a + 5    a

3a + 14 = 50

3a = 36

a = 12

X : Y : Z

21 : 17 : 12

50 ..... 35,000

21 ..... ?

= X వాటా రూ.14,700

జ: 2


5.    A, B, C అనే వ్యక్తులు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. A  మొత్తం మూలధనంలో 6వ భాగాన్ని మొత్తం కాలంలో 6వ భాగానికి పెట్టుబడిగా పెట్టాడు. B  మొత్తం మూలధనంలో 3వ భాగాన్ని మొత్తం కాలంలో 3వ భాగానికి పెట్టుబడిగా పెట్టాడు. 'C' మిగిలిన మొత్తం పెట్టుబడి మొత్తం కాలానికి పెట్టుబడిగా పెట్డాడు. అయితే మొత్తం కాలానికి వారు రూ.4,600 లాభంగా పొందితే B వాటా ఎంత?

1) రూ.960     2) రూ.800 

3) రూ.1000     4) రూ.650

వివరణ: మూలధనం = X

మొత్తం కాలం = Y అనుకుంటే

జ: 2


6.    P,Q లు 12 : 11 నిష్పత్తిలో ప్రారంభ పెట్టుబడులతో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వారి వార్షిక లాభాలు 4 : 1 నిష్పత్తిలో ఉన్నాయి. P 11 నెలలపాటు పెట్టుబడి పెట్టాడు. అయితే Q ఎన్ని నెలలపాటు పెట్టుబడి పెట్టాడు?

1) 3   2) 6  3) 9    4) 11 

వివరణ:   Q తన పెట్టుబడిని X నెలల పాటు ఉంచినట్లయితే

పెట్టుబడుల నిష్పత్తి  (12 X 11 : 11 X x) 

వార్షిక లాభాలు = 4 : 1

​​​​​​​

X = 3 నెలలు

జ: 1


7.   A,B లు ఉమ్మడి సంస్థను ప్రారంభించారు. A పెట్టుబడి B పెట్టుబడికి 3 రెట్లు. అతడి పెట్టుబడి కాలం B పెట్టుబడి వ్యవధికి రెండు రెట్లు. B లాభం రూ.4,000 అయితే వారు పొందిన మొత్తం లాభం ఎంత?

1) రూ.24,000       2) రూ.16,000   

3) రూ.28,000       4) రూ.20,000

వివరణ: B పెట్టుబడి = X

B కాలం = Y నెలలు అనుకుంటే

లెక్కప్రకారం A పెట్టుబడి = 3X

A కాలం = 2Y నెలలు

వారి పెట్టుబడుల నిష్పత్తి  6xy : xy

                                     6 : 1

అప్పుడు B పొందిన లాభం = రూ.4000

వారు పొందిన మొత్తం లాభం = 1 ..... 40,0000

7 ..... ?

= 28,000

జ: 3


8.     5 : 6 నిష్పత్తి మూలధనంతో A, B లు వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత B మూలధనంతో సమానంగా C వారితో కలిశాడు. ఏడాది చివర వచ్చిన లాభంలో 20% మొత్తం రూ.98,000 అయితే B పెట్టుబడి ఎంత?

1) రూ.2,10,000       2) రూ.1,05,000   

3) రూ.1,62,500       4) రూ.1,30,000

 

రచయిత: దొర కంచుమర్తి


 

Posted Date : 24-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌