• facebook
  • whatsapp
  • telegram

ప్రకటనలు - వాదనలు 

సమర్థ వ్యక్తీకరణ సామర్థ్యానికి పరీక్ష! 

ఒక మాటను లేదా ప్రకటనను ఒక్కొక్కరూ ఒక్కోరకంగా అర్థం చేసుకుంటారు. అయితే వారు చేసే వాదనల ప్రాతిపదికన వారి విమర్శనాత్మక ఆలోచనా తీరును అంచనా వేయవచ్చు. సమర్థ అభిప్రాయాలను,  సరైన నిర్ణయాలను వ్యక్తీకరించగలిగే సామర్థ్యాలను గుర్తించవచ్చు. ఈ లక్ష్యంతోనే రీజనింగ్‌లో ‘ ప్రకటనలు- వాదనలు’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతారు. అందులో ఇచ్చే బలమైన, బలహీనమైన వాదనలను పరిశీలించి ప్రశ్నలోని ప్రకటనను అభ్యర్థులు సమర్థించాలి. దీని కోసం క్లిష్ట సమాచారాన్ని విశ్లేషించడం నేర్చుకోవాలి. 

ప్రశ్నలో భాగంగా ఒక ప్రకటన, రెండు వాదనలు ఇస్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆ నిర్ణయాలకు ఆధారమైన వాదనల్లో(Arguments) ఏవి బలమైనవి? ఏవి బలహీనమైనవి? అని తెలిసి ఉండటం అవసరం. బలమైన వాదనలు ప్రకటనలోని అంశానికి నేరుగా సంబంధం కలిగి, ముఖ్యమైనవిగా ఉంటాయి. బలహీనమైన వాదనలు ప్రకటనలోని అంశానికి నేరుగా సంబంధంలేనివిగా లేదా అల్ప ప్రాధాన్యంతో ఉంటాయి.


 ప్రశ్నలో ఇచ్చిన రెండు వాదనల్లో ఏ వాదన బలంగా ఉందో లేదా బలహీనంగా ఉందో నిర్ణయించాలి. ప్రకటనలు సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో ఉండొచ్చు.


సూచనలు: ప్రశ్నలో ఇచ్చిన ప్రకటనకు సరైన వాదనను ఎన్నుకోండి. కేవలం వాదన (I) మాత్రమే సరైంది అయితే జవాబు (ఎ) గా, కేవలం ప్రకటన (II) మాత్రమే సరైంది అయితే జవాబు (బి)గా, రెండు వాదనలు బలహీనమైనవి అయితే జవాబు (సి)గా, ఇచ్చిన రెండు వాదనలు బలమైనవి అయితే జవాబు (డి) గానూ గుర్తించండి.



1. ప్రకటన: మరణ శిక్షను తొలగించాలా?

వాదనలు:  

I. అవును. కారణం ఏదైనప్పటికీ ఒక మనిషి ప్రాణం హరించే హక్కు ఎవ్వరికీ లేదు.

II . లేదు. మరణ దండన భయం కొంతమందిని క్రూర పనులు చేయకుండా ఆపుతుంది.

జవాబు: డి


2. ప్రకటన: మహిళలకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలా?

వాదనలు:  

I. కాదు. వారికి ఇంట్లో పనులే ఎక్కువ.

II. అవును. వారు కూడా బయటి ప్రపంచంలో విధులు నిర్వర్తించగలరు.

జవాబు: బి


3. ప్రకటన: ప్రభుత్వం మరిన్ని మెడికల్‌ కాలేజీలను తెరవాలా?

వాదనలు:  

I. అవును. మనదేశ జనాభాకు సరిపడా క్వాలిఫైడ్‌ డాక్టర్ల కొరత ఉంది.

II. లేదు. ఇప్పుడున్న కాలేజీల్లోనే ప్రమాణాల కొరత ఉంది. కాబట్టి ప్రభుత్వం దానిపై దృష్టి సారించాలి.

జవాబు: డి


4. ప్రకటన: యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలా?

వాదనలు:  

I. అవును. వారు పారిశ్రామికరంగాభివృద్ధికి తోడ్పడతారు.

II . అవును. వారు దేశంలో నిరుద్యోగ సమస్యను కొంతవరకు తీర్చగలరు.

జవాబు: డి


5. ప్రకటన: గ్రామీణ భారతంలో వ్యవసాయ రంగంలో యంత్రాలను ప్రోత్సహించాలా?

వాదనలు:  

I. అవును. అవి అధిక ఉత్పత్తికి దోహదపడతాయి.

II. కాదు. రోజువారీ కూలీలు ఉపాది కోల్పోతారు.

జవాబు: ఎ


ప్రాక్టీస్‌ బిట్స్‌

1. ప్రకటన: దేశవ్యాప్తంగా ఫ్యాషన్‌ డ్రెస్సులను నిషేధించాలా?

వాదనలు:  

I. కాదు. దుస్తులు మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

II. అవును. లేకపోతే వస్త్ర ఉత్పత్తి సరిపోవడం లేదు.

జవాబు: ఎ


2. ప్రకటన: దేశవ్యాప్తంగా నిరక్షరాస్యులకు ఓటింగ్‌ హక్కు తొలగించాలా?

వాదనలు:  

I. అవును. వారు రాజకీయ నాయకుల మాటలకు, ప్రలోభాలకు సులభంగా లోనవుతున్నారు.

II. కాదు. అది వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు.

జవాబు: బి


3. ప్రకటన: దేశంలో ఉన్నత విద్యను కొంతకాలం పాటు ఆపాలా?

వాదనలు: 

I. కాదు. అది దేశ అభివృద్ధికి ప్రతిబంధకం.

II. అవును. అది నిరుద్యోగ శాతాన్ని తగ్గిస్తుంది.

జవాబు: ఎ


4. ప్రకటన: కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేయాలా?

వాదనలు:  

I. కాదు. ఇదొక అందమైన రాష్ట్రం. దీనివల్ల ఎక్కువ విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాం.

II. అవును. తద్వారా సంఘర్షణలు పోతాయి.

జవాబు: ఎ


5. ప్రకటన: కాలేజీల్లో ర్యాగింగ్‌ మంచి పద్ధతా? 

వాదనలు:  

I. అవును. సున్నిత ర్యాగింగ్‌ విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పడానికి తోడ్పడుతుంది.

II. ర్యాగింగ్‌ పేరు మీద చేసే టార్చర్‌ వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

జవాబు: డి


6. ప్రకటన: మనదేశంలో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాలా?

వాదనలు:  

I. అవును. అది కొన్ని మతాలకు విరుద్ధం.

II. కాదు. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో దీన్ని నిషేధించలేం.

జవాబు: బి


7. ప్రకటన: మన దేశాభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు అవసరమా?

వాదనలు:  

I. అవును. ప్రణాళికలు లేకుండా దేశాభివృద్ధి అసాధ్యం.

II. కాదు. వీటివల్ల ప్రజాధనం, కాలం వృథా అవుతాయి.

జవాబు: ఎ


8. ప్రకటన: దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ హైకోర్టులు ఉండాలా?

వాదనలు:  

I. కాదు. దీనివల్ల విలువైన ప్రజాధనం వృథా అవుతుంది.

II. అవును. దీనివల్ల చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించవచ్చు.

జవాబు: బి


9. ప్రకటన: మనదేశంలో విలాసవంతమైన హోటల్స్‌ను నిషేధించాలా?

వాదనలు:  

I. అవును. ఇవి అంతర్జాతీయ నేరస్థులకు స్థావరాలుగా ఉన్నాయి.

II. కాదు. వీటివల్ల విదేశీ పర్యాటకులకు ఇబ్బందులు కలుగుతాయి.

జవాబు: బి


10. ప్రకటన: ప్రభుత్వం అంతర్జాతీయ క్రీడలకు కేటాయింపులు తగ్గించాలా?

వాదనలు:  

I. అవును. ఈ ధనాన్ని పేదల సంక్షేమానికి ఉపయోగించవచ్చు.

II. కాదు. ఇది క్రీడాకారులను నిరుత్సాహానికి గురిచేయడంతోపాటు అంతర్జాతీయంగా గుర్తింపు తగ్గుతుంది.

జవాబు: బి


11. ప్రకటన: గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలా?

వాదనలు:  

I. అవును. ఇవి దేశాభివృద్ధికి తోడ్పడతాయి.

II. అవును. ఇవి నిరుద్యోగ సమస్యను కొంతవరకు తీర్చగలవు.

జవాబు: డి


12. ప్రకటన: రైల్వే ఉద్యోగులకు ఫ్రీ పాస్‌ సౌకర్యాన్ని నిలిపి వేయాలా?

వాదనలు:  I. లేదు. అది ఉద్యోగుల హక్కు.

II. అవును. అది రైల్వేలో మరిన్ని సౌకర్యాలు మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.

జవాబు: సి


13. ప్రకటన: మీడియాలో పొగాకు ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించిలా?

వాదనలు:  

I. అవును. ఇలా మాత్రమే ప్రజలను క్యాన్సర్‌ నుంచి రక్షించవచ్చు.

II. లేదు. దీనివల్ల పొగాకు అమ్మకాలు తగ్గుతాయి.

జవాబు: ఎ


14. ప్రకటన: వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలా?

వాదనలు:  I. అవును. భూగర్భజలాలు కలుషితం కాకుండా పరిరక్షించవచ్చు.

II. కాదు. దీనివల్ల వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది.

జవాబు: బి


15. ప్రకటన: మెట్రో నగరాల్లో 15 సంవత్సరాలు దాటిన వాహనాలను నిషేధించాలా?

వాదనలు:  

I. అవును. ఇది కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది.

II. కాదు. ఇది వాహనదారులకు ఇబ్బందికరం.

జవాబు: ఎ


 

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి 

Posted Date : 06-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌