• facebook
  • whatsapp
  • telegram

త్రిభుజాలు

 త్రిభుజంలోని మూడు అంతరకోణాల మొత్తం విలువ ఎల్లప్పుడూ  180° ఉంటుంది.

∠A + ∠B + ∠C = 180°  లేదా

∠BAC + ∠ABC + ∠ACB = 180°

 త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగిస్తే ఏర్పడిన బాహ్యకోణం విలువ దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం.

∠ACD = ∠BAC + ∠ABC,

∠ACB + ∠ACD = 180°


మాదిరి ప్రశ్నలు

1. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1 : 3 : 5 అయితే ఆ కోణాల్లో పెద్ద కోణం?

1) 110°    2) 80°    3) 90°    4) 100° 

సాధన: ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి = 1 : 3 : 5 ఆ కోణాలు వరుసగా 1x, 3x, 5x అనుకోండి.

1x + 3x + 5x = 180°

9x = 180°


ఆ కోణాల్లో పెద్దకోణం = 5x = 5 × 20°=100°

సమాధానం: 4


2. ∆ABC లో ∠A = 8∠B, ∠C = 6∠B అయితే ∆ABC లో పెద్దకోణం....

1) 96°    2) 72°    3) 108°   4) 98°

సాధన: ∆ABC  లో  ∠A = 8∠B,   ∠C = 6∠B త్రిభుజంలోని 3 కోణాల మొత్తం = 180°

⇒ ∠A + ∠B + ∠C = 180° 

⇒ 8∠B + ∠B + 6∠B = 180° 

⇒ 15∠B = 180° 

 

∠A = 8∠B = 8 × 12°= 96°, ∠C = 6∠B = 6 × 12°= 72° ∆ABCలో పెద్ద కోణం =  96°

సమాధానం: 1


3. ∆ABC లో C వద్ద లంబకోణం ఉంది. CD ⊥ AB, ∠A = 35° అయితే ∠BCD కోణం....

1) 55°    2) 90°   3) 35°     4) 45°

పైపటంలో∆ABC లో ∠C = 90°, CD ⊥ AB ∠A = 35°  

త్రిభుజం ABCలో∠A + ∠B + ∠C = 180°  

⇒ 35°+ ∠B +90°=180° 

∠B = 180°− 125°= 55° 

త్రిభుజం BCD లో  ∠BCD + ∠BDC + ∠CBD = 180° 

⇒ ∠BCD + 90°+ 55° = 180° 

⇒∠BCD = 180°− 145°= 35° 

సమాధానం: 3


4. త్రిభుజంలోని బాహ్యకోణాల మొత్తం ఎంత?

1) 180°    2) 360°    3) 270°    4) 90°

∆ABC ఒక త్రిభుజం 

∠A + ∠B + ∠C = 180°

∆ABCలో  ∠DAB + ∠EBC + ∠ECA = 

∠B + ∠C + ∠C + ∠A + ∠A + ∠B

= 2(∠A + ∠B + ∠C) 

= 2 × 180°= 360°

సమాధానం: 2


5. ఒక త్రిభుజపు ఒక బాహ్యకోణం 125° , దాని అంతరాభిముఖ కోణాలు 2 : 3 నిష్పత్తిలో ఉంటే దానిలోని ఒక కోణం ఎంత?

1) 40°    2) 55°   3) 75°    4) 80°

 పైపటంలో ఒక బాహ్యకోణం = 125°

ఆ బాహ్యకోణానికి అంతరాభిముఖ కోణాలు = 2x, 3x అనుకోండి.

2x + 3x = 125° 

5x = 125°

ఆ కోణాలు వరుసగా,2x = 2 × 25° = 50° 

3x = 3 × 25°= 75°

 సమాధానం: 3


6. (3x)°, (2x + 7)°, (4x − 16)°లు త్రిభుజం కోణాలైతే, అందులో ఏ రెండు కోణాల మొత్తం అయినా.... 

1) 134   2) 121    3) 117   4) 116

సాధన: త్రిభుజంలోని కోణాలు వరుసగా, 

(3x)°, (2x + 7)°, (4x − 16)° 

3x + 2x + 7°+ 4x − 16°= 180° 

9x − 9°= 180° 

9x = 180° + 9°= 189°
   
త్రిభుజంలో 1వ కోణం  = 3x = 3 × 21°= 63° 

2వ కోణం  = 2x + 7° = 2 × 21°+ 7°

= 42°+ 7° = 49°

3వ కోణం = 4x − 16° = 4 × 21°− 16°

 = 4x − 16° = 4 × 21°− 16° 

1వ కోణం + 2వ కోణం = 63+49 = 112

2వ కోణం + 3వ కోణం = 49+68 = 117

3వ కోణం + 1వ కోణం =  68 + 63 = 131

సమాధానం: 3


 

పైపటంలో ∆ABCలో BC ని D వరకు విపొడిగించారు. 

∠ACB = 5x, ∠ACD = 7x అయితే ∠ACD విలువ?

1) 105°   2) 110°   3) 135°   4) 120°

సాధన: ∆ABC లో  ∠ACB = 5x,    ∠ACD = 7x 

∠ACB, ∠ACDలు రేఖీయ ద్వయం (Linear pair)

కాబట్టి,  ∠ACB + ∠ACD = 180° 

⇒ 5x + 7x = 180° 

⇒ 12x = 180° 

∠ACD = 7x 

= 7 × 15° = 105°

సమాధానం:


8. ఒక త్రిభుజంలోని మూడు కోణాల నిష్పత్తి 2 : 3 : 4 అయితే గరిష్ఠ, కనిష్ట కోణాల మధ్య గల భేదం ఎంత?

1) 50°    2) 30°    3) 20°    4) 40° 

సాధన: ఒక త్రిభుజంలోని మూడు కోణాల నిష్పత్తి = 2 : 3 : 4

ఆ కోణాలు వరుసగా  2x, 3x, 4x 

2x + 3x + 4x = 180°

9x = 180° ⇒ x = 20°

ఆ కోణాలు,  2x = 2 × 20°= 40°

3x = 3 × 20°= 60° 

4x = 4 × 20°= 80°

గరిష్ఠ, కనిష్ఠ కోణాల మధ్య భేదం 

= 80°− 40° 

= 40° 

సమాధానం: 4

రచయిత

సీ‡హెచ్‌. రాధాకృష్ణ

విషయ నిపుణులు 

Posted Date : 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌