• facebook
  • whatsapp
  • telegram

నిరుద్యోగిత

1. అవసరమైన దానికంటే ఎక్కువ సంఖ్యలో శ్రామికులు పనిచేస్తే ఆ స్థితిని ఏమంటారు? 

1) అల్ప ఉద్యోగిత    2) ప్రచ్ఛన్న నిరుద్యోగిత    3) చక్రీయ నిరుద్యోగిత    4) సాంకేతిక నిరుద్యోగిత


2. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏ రంగంలో ఉంటుంది?

1) తయారీ రంగం  2) పారిశ్రామిక రంగం    3) వ్యవసాయం    4) చేనేత పరిశ్రమ


3. శ్రామిక ఉపాంత ఉత్పత్తి సున్నాగా ఉన్న స్థితిని ఏమంటారు? 

1) చక్రీయ నిరుద్యోగిత   2) అల్ప ఉద్యోగిత     3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత     4) విద్యావంతుల్లో నిరుద్యోగిత


4. ఏ దేశాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత స్థితి ఉంది? 

1) అభివృద్ధి చెందిన దేశాలు     2) అభివృద్ధి చెందుతున్న దేశాలు 

3) ఉన్నత అధిక ఆదాయ దేశాలు     4) వెనుకబడిన దేశాలు


5. ఆర్థిక తిరోగమనం, మాంద్య స్థితితో ఏర్పడే నిరుద్యోగిత ఏది?

1) సంఘృష్ట నిరుద్యోగిత   2) చక్రీయ నిరుద్యోగిత    3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత    4) వ్యవస్థాపరమైన నిరుద్యోగిత


6. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నపుడు పని మార్పు వల్ల ఏర్పడే తాత్కాలిక నిరుద్యోగిత ఏది?

1)  సంఘృష్ట నిరుద్యోగిత    2) రుతు సంబంధ నిరుద్యోగిత   3) సాధారణ నిరుద్యోగిత    4) బహిరంగ నిరుద్యోగిత


7. పెరుగుతున్న శ్రామిక జనాభా రేటు కంటే ఉద్యోగావకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే నిరుద్యోగిత?

1) వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత    2) స్వచ్ఛంద నిరుద్యోగిత    3) నిస్వచ్ఛంద నిరుద్యోగిత   4) అల్ప ఉద్యోగిత


8. ఒక వ్యక్తిగత ఉత్పాదక శక్తి కంటే తక్కువ ఉత్పాదకత గల పనిలో పాల్గొనే స్థితి .....

1)  ప్రచ్ఛన్న నిరుద్యోగిత     2) అల్ప ఉద్యోగిత   3) బహిరంగ నిరుద్యోగిత   4) చక్రీయ నిరుద్యోగిత 


9. పనిచేయాలనే కోరిక, సామర్థ్యం ఉన్నవారికి మార్కెట్‌ వేతనరేటు వద్ద పని లభించని స్థితి?

1) పేదరికం  2) నిరుద్యోగ స్థితి    3) 1, 2       4) నిరపేక్ష పేదరికం


10. ప్రస్తుతం మనదేశంలో నిరుద్యోగిత గణాంకాలను అంచనా వేస్తున్న సంస్థ ఏది?

1) జాతీయ గణాంక సంస్థ   2) ప్రణాళికా సంఘం 3) నీతి ఆయోగ్‌   4) కేంద్ర గణాంక సంస్థ


11. జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) చెన్నై   2) ముంబయి     3) కోల్‌కతా     4) న్యూదిల్లీ


12. నిరుద్యోగం అనేది ఒక...

1) సాంఘిక, ఆర్థిక సమస్య    2) పేదరిక సమస్య     3) కొరత   4) ఏదీకాదు


13. ‘నిరుద్యోగం అనే సమస్య కారణంగా విద్యావంతులైన యువకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ కారణమే అనేకమంది తీవ్రవాదులుగా మారడానికి దారితీసింది’ అని పేర్కొన్న వారెవరు?

1) వి.పి.సింగ్‌    2)  వి.వి.గిరి    3) అహ్లూవాలియా    4) రంగరాజన్‌


14. పనిచేసే శ్రామిక వయోవర్గం అంటే......

1) 15  60 ఏళ్ల మధ్య వయసున్నవారు     2) 60 ఏళ్ల వయసు పైబడినవారు

3) 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, 60 ఏళ్ల కంటే పెద్దవారు.   4) ఎవరూ కాదు


15. అంతర్జాతీయ శ్రామిక సంస్థను (ఐఎల్‌ఓ - ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌) ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1919, ఏప్రిల్‌ 11      2) 1920, ఏప్రిల్‌ 12  3) 1921, ఏప్రిల్‌ 13     4) 1922, ఏప్రిల్‌ 14 


16. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐఎల్‌ఓ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) జెనీవా, స్విట్జర్లాండ్‌   2) మనీలా, ఫిలిప్పీన్స్‌    3) జకార్తా, ఇండోనేసియా      4) వాషింగ్టన్‌ డీసీ, అమెరికా


17. ఐఎల్‌ఓను నోబెల్‌ శాంతి బహుమతి ఎప్పుడు వరించింది?

1) 1967   2) 1968    3) 1969    4) 1970


18. ప్రస్తుతం అంతర్జాతీయ శ్రామిక సంస్థలోని సభ్యదేశాల సంఖ్య?

1) 189    2) 164    3) 187     4) 191


19. జాతీయ గణాంక సంస్థ ప్రస్తుత ఛైర్మన్‌ ఎవరు?

1) రాజీవ్‌కుమార్‌    2) అమితాబ్‌ కాంత్‌     3) ప్రొఫెసర్‌ రాజీవ లక్ష్మణ్‌ కరండికర్‌    4) ఎవరూ కాదు


20. రుతువుల్లోని మార్పులను అనుసరించి డిమాండ్‌లో వచ్చే మార్పులతో ఏర్పడే నిరుద్యోగిత ఏది?

1) అల్ప ఉద్యోగిత     2) రుతు సంబంధిత నిరుద్యోగిత   3) బహిరంగ నిరుద్యోగిత      4) అనుద్యోగిత


21. ప్రామాణిక వ్యక్తి సంవత్సరం అంటే..

1) ఒక ఏడాదిలో 273 రోజుల్లో ఒక వ్యక్తి ఎనిమిది గంటలు పనిచేయడం

2) 365 రోజులు పనిచేయడం    3) లీపు సంవత్సరం       4) ఏదీకాదు


22. పనిచేయగల సమర్థత ఉండి పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తులకు ఉద్యోగాన్ని కల్పించే ఉత్పాదక సామర్థ్యం లేకపోవడం ఏ నిరుద్యోగిత స్థితిగా పేర్కొంటారు?

1) నిర్మితి సంబంధిత నిరుద్యోగిత    2) సంఘృష్ట నిరుద్యోగిత   3) అల్ప ఉద్యోగిత    4) చక్రీయ నిరుద్యోగిత


23. సంఘృష్ట నిరుద్యోగిత అంటే ఏమిటి?

1) శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మారేకాలంలో ఏర్పడే నిరుద్యోగిత

2) వ్యవసాయంలో 68 నెలలు మాత్రమే పని ఉండటం.

3) ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు పనిచేయడం

4) 365 రోజులు పనిలేకపోవడం


24. ఒక వ్యక్తికి ఏడాదిలో ఎక్కువ కాలం పని లభించకుండా ఉండటాన్ని ఏమంటారు?

1) బహిరంగ నిరుద్యోగిత     2) స్వచ్ఛంద నిరుద్యోగిత   3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత     4)  దైనందిన నిరుద్యోగిత


25. భారతదేశంలోని నిరుద్యోగిత ఏ కోవలోకి వస్తుంది?

1) నిర్మితి సంబంధిత నిరుద్యోగిత     2) చక్రీయ నిరుద్యోగిత    3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత    4) రుతు సంబంధిత నిరుద్యోగిత


26. ‘అభివృద్ధి చెందిన దేశాల్లో సార్ధక డిమాండ్‌ లేమివల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది’ అని ఎవరు పేర్కొన్నారు?

1) జె.ఎం.కీన్స్‌    2) రికార్డో     3) మార్షల్‌    4) కౌటిల్యుడు


27. ఒక వ్యక్తికి ఒక రోజులో ఏ మాత్రం పనిదొరకని పరిస్థితిని ఏమంటారు?

1) రోజువారీ స్థితి నిరుద్యోగిత     2) వారపరమైన స్థితి నిరుద్యోగిత    3) నిరంతర నిరుద్యోగిత    4) బహిరంగ నిరుద్యోగిత


సమాధానాలు

1-2  2-3  3-3  4-2  5-2  6-1  7-1  8-2  9-2  10-1  11-4  12-1  13-2  14-1  15-1 16-1  17-3  18-3  19-3  20-2  21-1  22-1  23-1 24-1  25-1  26-1  27-1. 


మరికొన్ని..

1. అమల్లో ఉన్న వేతనరేటు వద్ద ఒక వ్యక్తికి పనిచేయాలని ఉన్నప్పటికీ ఉద్యోగావకాశం దొరక్కపోవడాన్ని ఏమంటారు?

1) పేదరికం  2) నిరుద్యోగిత    3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత    4) చక్రీయ నిరుద్యోగిత


2. పంటల సాగు, కోతల సమయాల్లో వ్యవసాయ శ్రామికులకు ఏడాదిలో 7-8 మాసాలు పని దొరుకుతుంది. కానీ మిగతా సమయంలో పని దొరకదు. అయితే వీరిని ఏ నిరుద్యోగులుగా భావిస్తారు?

1) రుతుపరమైన నిరుద్యోగులు     2)  ప్రచ్ఛన్న నిరుద్యోగులు    3) స్వచ్ఛంద నిరుద్యోగులు   4) అల్పఉద్యోగులు


3. ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతికత ప్రవేశంతో శ్రామికుల్ని తొలగించడం వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏది?

1) అల్ప ఉద్యోగిత   2) చక్రీయ నిరుద్యోగిత     3) సాంకేతికపరమైన నిరుద్యోగిత   4) ఏదీకాదు


4. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే నిరుద్యోగితను ఏమంటారు?

1) ఇచ్ఛారహిత నిరుద్యోగిత (ఇన్‌వాలంటరీ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌) 

2) సంఘృష్ట నిరుద్యోగిత   3) చక్రీయ నిరుద్యోగిత    4) పైవన్నీ


5. అభివృద్ధి చెందిన దేశాల్లోని వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం ఏర్పడటంతో వచ్చే నిరుద్యోగిత?

1) చక్రీయ నిరుద్యోగిత      2) సంఘృష్ట నిరుద్యోగిత    3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత   4) అల్ప ఉద్యోగిత


6. కింది వాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నిరుద్యోగితకు సంబంధించి సరైంది?

1) ప్రచ్ఛన్న నిరుద్యోగిత       2) అల్ప ఉద్యోగిత

3) రుతు సంబంధిత నిరుద్యోగిత, విద్యావంతుల్లో నిరుద్యోగిత      4) పైవన్నీ


7. ఉపాధి అవకాశాలు లేక పెద్ద సైన్యంలా ఉండే ఏ నిరుద్యోగితను ‘మార్క్సియన్‌’ నిరుద్యోగితగా శ్రీమతి జాన్‌ రాబిన్సన్‌ పేర్కొన్నారు?

1) బహిరంగ నిరుద్యోగిత     2) ప్రచ్ఛన్న నిరుద్యోగిత   3)  అల్ప ఉద్యోగిత    4) చక్రీయ నిరుద్యోగిత


8. భారత్‌ లాంటి శ్రామిక జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు ఆర్థికవృద్ధి నుంచి ఉపాధి కల్పనను పొందడం కంటే ఉపాధి కల్పన నుంచే ఆర్థికవృద్ధిని పొందే విధానం అనుసరించాలని తెలిపింది ఎవరు?

1) అమర్త్యసేన్‌     2) మహబూబ్‌-ఉల్‌-హక్‌    3) మార్షల్‌    4) జె.ఎం.కీన్స్‌ 


సమాధానాలు

1-2  2-1 3-3  4-4  5-1  6-4  7-1  8-2. 


* ఉపాంత ఉత్పత్తి నామమాత్రం లేదా శూన్యం లేదా రుణాత్మకంగా ఉండే నిరుద్యోగిత ఏది?

1) రుతుసంబంధిత నిరుద్యోగిత    2) ప్రచ్ఛన్న నిరుద్యోగిత  3) అసంఘటిత నిరుద్యోగిత 4) చక్రీయనిరుద్యోగిత 

జవాబు: 2


చదువుకుని లేదా శిక్షణ పొంది, నైపుణ్యాలు ఉన్న వ్యక్తికి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగం దొరక్కపోతే ఆ వ్యక్తిని ఏమంటారు?

1) విద్యనార్జించిన నిరుద్యోగి    2) చక్రీయ నిరుద్యోగి    3) సాంకేతికపరమైన నిరుద్యోగి    4) అల్ప ఉద్యోగి 

జవాబు: 1


* కింది వాటిలో నిరుద్యోగ సమస్య కారణాలకు సంబంధించి సరైంది?

1) శ్రామిక జనాభా పెరుగుదల    2) వ్యవసాయంపై ఆధారపడటం  3) శిక్షణ వసతుల కొరత    4) పైవన్నీ           

జవాబు: 4

Posted Date : 21-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌