• facebook
  • whatsapp
  • telegram

ద్విపద సిద్ధాంతం

సంక్లిష్ట ఘాతాల గణనకు.. సరళీకరణకు!

 


 

ఒక నాణేన్ని వందసార్లు ఎగుర వేస్తే ఎన్నిసార్లు బొమ్మలు, బొరుసులు పడే అవకాశం ఉంది అంటే వెంటనే చెప్పడం కష్టం. కొంత సొమ్మును వడ్డీకి ఇచ్చారు. పది సంవత్సరాలకు ఎంత వడ్డీ వస్తుందంటే సాధారణ పద్ధతుల్లో లెక్కగట్టడానికి సమయం పడుతుంది. కానీ ఆ రెండు సమస్యలను బీజీయ సమాస రూపంలో రాసుకొని గణిస్తే  జవాబు వేగంగా దొరుకుతుంది. రెండు పదాలను బీజగణిత రూపంలో వ్యక్తీకరించడమే ద్విపద. కూడికలు, తీసివేతలతో ఉన్న ఆ రెండు పదాల పెద్ద పెద్ద ఘాతాలను విస్తరించడానికి సూత్రాలను అందించేదే ద్విపద సిద్ధాంతం. ఇది సంక్లిష్ట వ్యక్తీకరణలను సరళీకరించి, సమాధానాలను సులభంగా సాధించడానికి సాయపడుతుంది.  


రెండు పదాలు ఉన్న బీజీయ సమాసాన్ని ద్విపది అంటారు. ద్విపద సిద్ధాంతాన్ని పరిచయం చేసినవారు న్యూటన్‌.  

ఉదా:x + y, 2x + y, x2 + y2, a − b

*  ద్విపది విస్తరణలోని పదాల సంఖ్య, దాని ఘాతాంకం కంటే ఒకటి ఎక్కువ. 

ఉదా: (a + b)2 లోని పదాల సంఖ్య = 3 

           (a + b)nలోని పదాల సంఖ్య =  n + 1


  

*    విస్తరణలో మొత్తం పదాలు = n + 1

*    మొదటిపదం(T1) =nC0xny0, రెండో పదం(T2) = nC1xn−1y1

*    విస్తరణలో(r + 1) వ పదాన్ని సామాన్య పదం అంటారు. 



      
1)    (1 + x)n = C0 +  C1x + C2x2 + .... + Cnxn

C0, C1, C2, .... Cnలను ద్విపది గుణకాలు అంటారు. 

2) (1 + x)nవిస్తరణలోx = 1ను ప్రతిక్షేపిస్తే(1 + 1)n = C0 + C1 + C2 + .... + C

   ద్విపది గుణకాల మొత్తం = 2n

3)    (1 + x)n విస్తరణలోx = −1ను ప్రతిక్షేపిస్తే(1 − 1)n = C0 − C1 + C2 − C3 .....

C0 − C1 + C2 − C3 .... = 0


4)     C0 + C2 + C4 .... = C1 + C3 + C5 .... = 2n−1


మాదిరి ప్రశ్నలు 

1.  (x + y)2023 విస్తరణలోని పదాల సంఖ్య ఎంత? 

   1) 2023      2) 2024      3) 0    4) 2026 

వివరణ: (x + y)nవిస్తరణలో(n + 1)పదాలు ఉంటాయి. 

(x + y)2023లో n = 2023 కాబట్టి n + 1 = 2023 + 1 = 2024 

2024 పదాలు ఉంటాయి

జ: 2




2.   (x + y + z)n విస్తరణలోని పదాల సంఖ్య?

1) nC2     2) n + 1C1   3) n + 2C2   4) n + 1C2

వివరణ:(x1 + x2 + x3 .... xr)n విస్తరణలో పదాల సంఖ్య =  n + r − 1Cr − 1

(x + y + z)n  లో n = n, r = 3

 పదాల సంఖ్య = n + 3 − 1C3−1 = n + 2C2

జ: 3


3.   (a + b + c + d)5 విస్తరణలో పదాల సంఖ్య? 

1) 20    2) 120    3) 336   4) 56 

వివరణ: పదాల సంఖ్య =  n + r −1Cr −1

n = 5, r = 4


జ: 4






4.  (1 + x) విస్తరణలో గుణకాల మొత్తం? 

1) 16    2) 30    3) 32    4) 64  

వివరణ: x = 1ను ప్రతిక్షేపిస్తే విస్తరణలో గుణకాల మొత్తం వస్తుంది. 

(1 + x)5 = (1 + 1)5 = 25 = 32

జ: 3 





5.  (1 + x - 3x2)171  విస్తరణలోని పదాల సంఖ్య?     

1) 0    2) 32    3) 64    4) 1 

వివరణ: x = 1ను ప్రతిక్షేపించగా (1 + 1 − 3(1)2)171

= (2 − 3)171 = (−1)171 = −1

జ: 4




6.  (3x - 4y)7విస్తరణలో 5 వ పదం?

1) 7C4 (3x)3 (4y)   2) 7C4 (3x)4 (4y)3

3) 7C4 (3x)5 (4y)2     4) ఏదీకాదు 

వివరణ: T5 = T4 + 1

Tr + 1 = nCr (x)n −ryr

T5 = T4 + 1 = 7C4 (3x)7− 4 (−4y)4

7C4 (3x)3 (4y)4
జ: 1 



7. (2a + 5b)8విస్తరణలో 6 వ పదం? 

1) 8C5 23 55 a3 b5   2) 8C5 25 53 a3 b5

3) 8C4 23 53 a3 b6   4) ఏదీకాదు  

వివరణ:  Tr + 1 = nCr (x)n −ryr

T6 = T5 + 1 = 8C5 (2a)8 −5 (5b)5

= 8C5 23 a3 55 b5  

= 8C5 23 55 a3 b5
జ: 1




8. (3a - 5b)6 విస్తరణలో మధ్యపదం ఎంత?

1) 6C3 35 53 a3 b3    2) −6C3 33 53 a3 b3

3) −6C3 35 53 a3 b3     4) ఏదీకాదు  

వివరణ: (x + y)nవిస్తరణలో  n సరిసంఖ్య అయితే  

(3a − 5b)6, n = 6అనేది సరిసంఖ్య కాబట్టి


T4 = T3+1 = 6C3 (3a)6 −3(−5b)3

6C3 33 a3 (−5)3 b3 

=−6C3 33 53 a3 b3

జ: 2




9.  (2x + 3y)7 విస్తరణలో మధ్యపదం?

1) T4, T5    2) T3, T4    3) T5, T6   4) ఏదీకాదు 

 వివరణ: (x + y)nలో n బేసిసంఖ్య అయితే మధ్యపదాలు రెండు ఉంటాయి. అవి




        







14.   (1 + x)విస్తరణలో గుణకాల మొత్తం 4096 అయితే గరిష్ఠ గుణకం? 

1) 12C3      2) 12C6     3) 12C9     4) 12C10

వివరణ: గుణకాల మొత్తం కావాలంటేx = 1 ను ప్రతిక్షేపించాలి.  

(1 + 1)n = 4096 

2n = 4096 ⇒ 2n = 212

 n = 12


జ: 2




15. 25C10 + 24C10 + 23C10 + ..... + 10C1

1) 26C10       2) 26C11      3) 26C15     4) 25C11

వివరణ: 10C10 + 11C10 + 12C10 + ..... + 25C10

 (nCr + nCr −1 = (n + 1)Cr)

= 11C11 + 11C10 + 12C10 + ..... + 25C10

= 12C11 + 12C10 + ..... + 25C10

25C11 + 25C10 = 26C11

జ: 2

రచయిత: డి.సీహెచ్‌.రాంబాబు

Posted Date : 10-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌