• facebook
  • whatsapp
  • telegram

దిశ నిర్దేశ పరీక్ష

1. శ్యామ్ ఉత్తరం దిక్కుగా 7 కి.మీ. ప్రయాణించి కుడివైపు తిరిగి 3 కి.మీ. నడిచాడు. మళ్లీ కుడివైపు వెళ్లి 7 కి.మీ. నడిచి ఒక ప్రదేశానికి చేరాడు. అతడు బయలుదేరిన స్థానం చేరాలంటే ఎంత దూరం ప్రయాణించాలి? 
జవాబు: 3 కి.మీ.
వివరణ:

                                         

2.
రాము ఉత్తరం 10 కిమీ. ప్రయాణించి ఎడమ వైపు తిరిగి 4 కి.మీ ప్రయాణించి, అక్కడి నుంచి కుడివైపు మళ్లీ 5 కి.మీ. ప్రయాణించాడు. మళ్లీ కుడివైపు తిరిగి 4 కి.మీ. ప్రయాణించాడు. అతడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు?
జవాబు: 15 కి.మీ.
వివరణ: గమ్యస్థానంనుంచి బయలుదేరిన ప్రదేశానికి అంటే చుక్కలమార్గంలో వెళ్లాలి. 3కి.మీ.దూరంలో ఉన్నాడు
          .                    

CD కి BE సమాంతరంగా ఉంది. కాబట్టి CD = 5 అంటే BE = 5 కి.మీ. అవుతుంది. అతడు బయలుదేరిన స్థానం నుంచి గమ్యస్థానం దూరం 
AE = AB + BE
      = 10 + 5
      = 15 కి.మీ. 

3. ఒక టాక్సీ డ్రైవర్ ఒక ప్రదేశం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించాడు. 10 కి.మీ. ఉత్తరం వైపు వెళ్లి, ఎడమ వైపు తిరిగి 5 కి.మీ. వెళ్లాడు. అక్కడ ఒక స్నేహితుడిని కలిశాడు. అక్కడినుంచి కుడివైపు తిరిగి 10 కి.మీ. ప్రయాణించాడు. అతడు మొత్తం 25 కి.మీ. ప్రయాణిస్తే, బయలుదేరిన ప్రదేశం నుంచి ఏ దిక్కులో ఉన్నాడు? 
జవాబు:  ఉత్తరం
వివరణ:
                             

బయలుదేరిన స్థానం నుంచి టాక్సీ డ్రైవర్ ఉత్తరం దిక్కులో ఉన్నాడు.  

4. ఒక వ్యక్తి వాయవ్యం వైపు తిరిగి ఉన్నాడు. అతడు 90º ప్రదక్షిణ దిశ (Clock wise)లో తిరిగి, 135º అప్రదక్షిణ దిశలో తిరిగాడు. అతడు ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు? 
జవాబు:  పడమర
వివరణ:
                          

వ్యక్తి ప్రారంభ స్థానం OP. ప్రదక్షిణ దిశలో 90º అంటే OP1 స్థానం. అక్కడి నుంచి అప్రదక్షిణ దిశలో 135º అంటే OP2 స్థానం. అంటే పడమర దిక్కులో ఉన్నాడు.

5. రేణుక తన ఇంటి నుంచి బయలుదేరి పడమరవైపు 3 కి.మీ. ప్రయాణించి, తరువాత ఉత్తరం దిశగా 4 కి.మీ. ప్రయాణించింది. ఆమె ఇంటి నుంచి ఎంత దూరంలో, ఏ దిక్కులో ఉంది? 
జవాబు: 5 కి.మీ. వాయవ్యం
వివరణ:
                           



6. సునీల్ తూర్పువైపు తిరిగి ఉన్నాడు. అతను 150º ప్రదక్షిణ దిశ (Clock wise) లో తిరిగి, 145º అప్రదక్షిణదిశలో తిరిగాడు. అతడు ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు?
జవాబు:  ఈశాన్యం
వివరణ:
                              

అతడు 150º ప్రదక్షిణ దిశలో పటంలో చూపినట్లు వెళ్ళాడు. తర్వాత అప్రదక్షిణ దిశలో 145º అంటే ముందు కంటే 5º తక్కువ వెళ్ళాడు. ఇప్పుడు అతడు ఈశాన్యం దిక్కువైపు ఉన్నాడు.

7. రవి ఒక ప్రదేశం నుంచి 20 మీ. ఉత్తరంగా ప్రయాణించి, కుడివైపు తిరిగి 30 మీ వెళ్లాడు. మళ్లీ కుడివైపు తిరిగి 35 మీ. ప్రయాణించాడు. అక్కడి నుంచి ఎడమవైపు 15 మీ. ప్రయాణించాడు. మళ్లీ ఎడమవైపు తిరిగి 15 మీ. ప్రయాణించాడు. అతడు బయలుదేరిన ప్రదేశం నుంచి ఎంత దూరంలో ఏ దిక్కులో ఉన్నాడు?
జవాబు:  45 మీ, తూర్పు
వివరణ:
                     

8. ఒక రోజు సూర్యోదయాన్నే రీటా, కవితలు ఒకరికొకరు ఎదురెదురుగా నడుస్తున్నారు. కవిత నీడ రీటాకు సరిగ్గా కుడివైపు ఉంది. అయితే కవిత ఏ దిక్కు వైపు తిరిగి ఉంది?
జవాబు:  ఉత్తరం
వివరణ:
                    
కవిత ఉత్తరం వైపు తిరిగి ఉంది.

9. గడియారంలో సమయం మధ్యాహ్నం 12 గంటలు. అప్పుడు రెండు ముళ్లూ ఈశాన్య దిక్కులో ఉన్నాయి. అయితే సమయం 1:30 pm అప్పుడు గంటల ముల్లు ఏ దిక్కులో ఉంటుంది?
జవాబు:  తూర్పు
వివరణ:
                  

10. ఈ పటంలో P, O కు 300 కి.మీ. దూరంలో తూర్పు దిక్కులో ఉంది. Q, O కు 400 కి.మీ. దూరంలో ఉత్తరం దిక్కులో ఉంది. R సరిగ్గా P, Q మధ్యలో ఉన్నాడు. అయితే Q, R ల మధ్య దూరం ఎంత?                                                                                                                   
జవాబు:   250 కి.మీ.
వివరణ:  OP = 300, OQ=400


 =500 కి.మీ.
PQ ల మధ్య బిందువు R   అంటే అందులో సగం.    
QR=1/2 × PQ=1/2 × 500=250 కి.మీ.

11. ఒకరోజు సాయంత్రం సుమిత్, మోహిత్ ఒకరికొకరు ఎదురెదురుగా నడుస్తున్నారు. మోహిత్ నీడ సుమిత్‌కు కుడివైపు ఉంది. అయితే సుమిత్ ఏ వైపు తిరిగి ఉన్నాడు?
జవాబు:  దక్షిణం
వివరణ:

సాయంత్రం అంటే సూర్య కిరణాలు తూర్పు వైపు పడతాయి. మోహిత్ నీడ కుడి వైపు అంటే బొమ్మలో ఇచ్చినట్లు ఉంటే అప్పడు సుమిత్ దక్షిణం వైపు తిరిగి ఉన్నాడు.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌