• facebook
  • whatsapp
  • telegram

క.సా.గు., గ.సా.భా.

1. 10, 15, 25, 30లతో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ సంఖ్య ఏది? 
జవాబు:  150
వివరణ: 10, 15, 25, 30 లతో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ సంఖ్య అంటే వాటి కనిష్ఠ సామాన్య గుణిజం అవుతుంది.
10, 15, 25, 30 ల క.సా.గు. 

1 × 5 × 1 × 1 × 3 × 2 × 5 = 150


2. ఒక వ్యాపారి ఎ, బి, సి అనే పనివాళ్లకు వరుసగా 30, 40, 50 కాగితాలను ఒక్కొక్క సంచిలో అమర్చమని చెప్పాడు. అయితే ఆ వ్యాపారి ఆ ముగ్గురికి ఇవ్వాల్సిన కనిష్ఠ కాగితాల సంఖ్యను కనుక్కోండి? 
జవాబు: 600
వివరణ: దత్తాంశం ఆధారంగా ఆ ముగ్గురికి ఇచ్చిన కనిష్ఠ కాగితాల విలువ అనేది 30, 40, 50 లతో నిశ్శేషంగా భాగించబడాలి కాబట్టి 30, 40, 50 ల క.సా.గు. జవాబు అవుతుంది. 

 5 × 4 × 3 × 10 = 600


3. ఒక వర్తకుడు నలుగురు పనివాళ్లకు కొన్ని పెన్నులను ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క సంచిలో వరుసగా 5, 10, 15, 20 పెన్నులను నింపాలని చెప్పాడు. వాళ్లు నింపిన తర్వాత ఒక్కొక్కరి వద్ద 2 పెన్నులు మిగిలితే, ఆ వ్యాపారి నలుగురికి ఇవ్వగలిగిన కనిష్ఠ పెన్నుల సంఖ్యను కనుక్కోండి?
జవాబు: 62
వివరణ: దత్తాంశం ఆధారంగా మొదటివ్యక్తిని ఒక సంచిలో 5, రెండోవ్యక్తిని ఒక సంచిలో 10, మూడో వ్యక్తిని ఒక సంచిలో 15, నాలుగోవ్యక్తిని ఒక సంచిలో 20 పెన్నులు నింపమంటే నలుగురికీ ఇవ్వాల్సిన కనిష్ఠ పెన్నుల సంఖ్య అంటే వాటి క.సా.గు.కు సమానం అవుతుంది. ఒక్కొక్కరి వద్ద '2' ఎక్కువగా మిగిలాయి. అంటే మొత్తంగా ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన పెన్నుల సంఖ్య అనేది (క.సా.గు.+2) అవుతుంది.

క.సా.గు. = 60
జవాబు = 60 +2 = 62


4. ఒక పండ్ల వ్యాపారి x, y, z అనే పనివాళ్లకు ఒక్కొక్కరిని ఒక్కొక్క బుట్టలో వరుసగా 17, 19, 23 పండ్లను అమర్చమని తెలిపాడు. ఈ ప్రకారం అమర్చడానికి ఒక్కొక్కరికి 4 పండ్లు సరిపోలేదు. అయితే వ్యాపారి ఆ ముగ్గురికీ ఇవ్వాల్సిన కనిష్ఠ పండ్ల సంఖ్యను కనుక్కోండి?
జవాబు: 7425
వివరణ:  దత్తాంశం ఆధారంగా... 
x అనే వ్యక్తి బుట్టలో 17 పండ్లు నింపాడు. 
y అనే వ్యక్తి బుట్టలో 19 పండ్లు నింపాడు. 
z అనే వ్యక్తి బుట్టలో 23 పండ్లు నింపాడు.
పై సందర్భంలో ఒక్కొక్కరికీ '4' సరిపోలేదు అంటే 17, 19, 23 ల క.సా.గు. నుంచి 4 ను తీసివేస్తే జవాబు పొందగలం.
17, 19, 23 క.సా.గు. = 7429
జవాబు = 7429 - 4 = 7425


5. ల కనిష్ఠ సామాన్య గుణిజాన్ని కనుక్కోండి?
జవాబు: 105
వివరణ:  సూత్రం
            


              


6.   ల గరిష్ఠ సామాన్య భాజకాన్ని కనుక్కోండి? 
జవాబు:  
వివరణ:  సూత్రం  
            
             

7. రెండు సంఖ్యల లబ్ధం 2604, వాటి గ.సా.భా. 2 అయితే వాటి క.సా.గు. ఎంత?
జవాబు:  1302
వివరణ:   సూత్రం:  రెండు సంఖ్యల లబ్ధం = వాటి క.సా.గు. × గ.సా.భా. 
                                   క.సా.గు. × 2 = 2604 
                           క.సా.గు. = 

 = 1302 


8. రెండు సంఖ్యల కనిష్ఠ సామాన్య గుణిజం 2079, వాటి గరిష్ఠ సామాన్య భాజకం 27. వాటిలో ఒక సంఖ్య 189 అయితే రెండో సంఖ్యను కనుక్కోండి? 
జవాబు:  297
వివరణ:   189 × రెండో సంఖ్య = 2079 × 27 
                రెండో సంఖ్య = 


9. 728, 900 లను ఒక గరిష్ఠ సంఖ్యతో భాగిస్తే, వరుసగా 8, 4 శేషాలుగా వస్తే, ఆ గరిష్ఠ సంఖ్యను కనుక్కోండి?
జవాబు: 16
వివరణ:   దత్తాంశం ఆధారంగా 728, 900 ను ఒక గరిష్ఠ సంఖ్యతో భాగించినప్పుడు వాటి శేషాలు వరుసగా 8, 4. 728 లో నుంచి 8 తీసివేయగా వచ్చే విలువ గరిష్ఠ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుంది. అలాగే 900 నుంచి 4 తీసివేస్తే
వచ్చిన విలువ అనేది ఆ గరిష్ఠ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే (728 - 8), (900 -4) = 720, 896
ల గ.సా.భా. అనేది జవాబు అవుతుంది. 720, 896 ల గ.సా.భా. 16 అవుతుంది.      


10. ఒక కనిష్ఠ సంఖ్యను 24, 32, 36 లతో భాగించినప్పుడు శేషాలు వరుసగా 19, 27, 31 వస్తే, ఆ కనిష్ఠ సంఖ్యను కనుక్కోండి? 
జవాబు: 283
వివరణ:  దత్తాంశం ఆధారంగా...
కనిష్ఠ సంఖ్యను 24, 32, 36 లతో భాగించినప్పుడు 19, 27, 31 శేషాలు వచ్చాయి.
(24 -19) = (32 -27)=(36 -31) = 5.
ప్రతి సంఖ్యతో కనిష్ఠ సంఖ్యను భాగించినప్పుడు '5' సరిపోలేదు కాబట్టి 24, 32, 36 ల క.సా.గు.లో నుంచి 5 తీసివేస్తే సరైన సమాధనం వస్తుంది. 

3 × 4 × 1 × 3 × 2 × 2 × 2 = 288      జవాబు = 288 - 5 = 283


11. 4, 6, 10, 15 లతో ఒక ఆరంకెల కనిష్ఠ సంఖ్యను భాగించినపుడు అన్ని సందర్భాల్లో శేషం '2'గా వచ్చింది. అయితే ఆ సంఖ్యను కనుక్కోండి? 
జవాబు:  100022
వివరణ:   ఆరు అంకెల కనిష్ఠ సంఖ్య = 100000

క.సా.గు. 1 × 1 × 1 × 2 × 5 × 3 × 2 = 60 
 60 తో 100000 ను భాగిస్తే 40 శేషం వస్తుంది.
60 - 40 = 20 ఆరు అంకెల కనిష్ఠ సంఖ్యకు 20 కలిపితే తర్వాత ఆ సంఖ్య 60 తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇచ్చిన లెక్కప్రకారం అన్ని సందర్భాల్లో శేషం '2' కాబట్టి ఆ సంఖ్య (100000 + 20 + 2) = 100022


12. రెండు సంఖ్యల క.సా.గు, గ.సా.భా.ల మొత్తం 592. వాటి మధ్య భేదం 518. ఆ రెండు సంఖ్యల మొత్తం 296 అయితే ఆ రెండు సంఖ్యలను కనుక్కోండి? 
జవాబు:  111, 185
వివరణ:  క.సా.గు = H, గ.సా.భా. = L అనుకుంటే
H + L = 592 ---------- (1)                         H -  L = 518 ---------- (2)
(1) + (2) చేస్తే 2H = 1110 
 H = 555
(1) - (2) చేస్తే 2L = 74 
 L = 37 
L తెలుసు కాబట్టి ఆ సంఖ్యలు 37a, 37b అవుతాయి.
(   a, b స్థిర విలువలు)
37a + 37b = 296 
a + b = 8
సంఖ్యలు వరుసగా (3 × 37, 5 × 37) = 111, 185
  క.సా.గు × గ.సా.భా. = రెండు సంఖ్యల లబ్ధం)
 555 × 37 = 111 × 185)


13. ఒక వ్యాపారి దగ్గర మూడు రకాల సారాయి ఉంది. మొదటి రకం 450 లీటర్లు, రెండో రకం 550 లీటర్లు, మూడో రకం 650 లీటర్లు. వీటిని సమాన పరిమాణం ఉన్న సంచుల్లో నింపాలి. అయితే ఒక్కొక్క సంచిలో నింపే గరిష్ఠ పరిమాణం ఎంత? 
జవాబు:  50 లీ.
వివరణ: దత్తాంశం ఆధారంగా 450 లీ. 550 లీ. 650 లీ. వీటి గరిష్ఠ సామాన్య భాజకం అనేది వాటిని గరిష్ఠంగా సంచిల్లో నింపగల పరిమాణానికి సమానం అవుతుంది.
(450, 550, 650) లీ. గ.సా.భా. = 50 లీ.
 పై మూడింటిని భాగించగలిగిన గరిష్ఠ సంఖ్య గ.సా.భా.అవుతుంది)


14. నాలుగు గంటలు 6, 8, 12, 18 నిమిషాల కాలవ్యవధిలో మోగుతాయి. నాలుగింటిని ఉదయం 12 గంటలకు మోగిస్తే, అదే రోజు 6 గంటల్లో ఎన్నిసార్లు అవి ఒకేసారి మోగుతాయో తెలపండి? 
జవాబు:  ఆరుసార్లు
వివరణ: దత్తాంశం ఆధారంగా 6, 8, 12, 18 ల కనిష్ఠ సామాన్య గుణిజం అనేది ఆ నాలుగు గంటలు ఒకేసారి మోగే సమయానికి సమానం. కాబట్టి వాటి క.సా.గు. 72 నిమిషాలు లేదా ఒక గంట 12 నిమిషాలు '6' గంటల్లో ఆ 4 గంటలు 
 = 6 సార్లు మోగుతాయి.


15. ఒక గది పొడవు, వెడల్పులు వరుసగా 220, 40 మీటర్లు. అయితే ఆ గదిలో ఒక్కొక్క పలక భుజం పొడవు ఎంత ఉండే చతురస్రాకార పలకలను అమర్చవచ్చు?
జవాబు: 20 మీ.
వివరణ: గది పొడవు 220 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు. గది అడుగు భాగంలో అమర్చాల్సిన చతురస్త్రాకార పలక భుజం పొడవు అనేది గది పొడవు, వెడల్పుల గరిష్ఠ సామాన్య భాజకానికి సమానం అవుతుంది.
   220 మీ., 40 మీ. గ.సా.భా = 20 మీ.                
నోట్: 
        

Posted Date : 06-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌