• facebook
  • whatsapp
  • telegram

లాజికల్ వెన్ చిత్రాలు

   లాజికల్ వెన్ చిత్రాల మీద అడిగే ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని వీటిని రెండు రకాలుగా విభజించారు. దీనిలో కొన్ని diagrams ఇచ్చి దాని కింద కొన్ని పదాలు లేదా వాక్యాలు ఇస్తారు.


మొదటిరకం వెన్ చిత్రాలు:

1) ఇచ్చిన అంశాలు వేర్వేరు సమూహాలకు చెందితే వెన్ చిత్రం కింది విధంగా ఉంటుంది.
ఉదా: ఆపిల్, నారింజ, మామిడిపండు.
ఈ ఉదాహరణలో ఉన్న మూడు రకాల పండ్లలో ఒకదానికి మరోదానితో ఎలాంటి సంబంధం లేదు. చూపిన వెన్ చిత్రంలో వేర్వేరుగా ఉంటాయి.


2) ఇచ్చిన అంశాల్లో రెండోది మొదటి తరగతికి, మూడోది రెండో తరగతికి చెందితే వెన్ చిత్రం ఏకకేంద్రవృత్తంగా ఉంటుంది. అంటే మూడువృత్తాలు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయి.
ఉదా: నగరం, రాష్ట్రం, దేశం
                 
నగరం అనేది రాష్ట్రంలో భాగం. అలాగే రాష్ట్రం అనేది దేశంలో భాగం కాబట్టి ఒకదానిలో మరొకటి అమరి ఉంటాయి.


3) ఇచ్చిన మూడు అంశాల్లో రెండు అంశాలు వేర్వేరుగా ఉండి ఇవి రెండూ మూడోదాని తరగతికి చెందితే వెన్ చిత్రం కింది విధంగా ఉంటుంది.
ఉదా: ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ (Chemistry), సైన్స్ (Science).
                   
ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి రెండు వేర్వేరు సబ్జెక్టులు. అయితే ఈ రెండింటిని మనం సైన్స్‌గా పరిగణిస్తాం.


4) ఇచ్చిన అంశాల్లో రెండు అంశాలు మూడో తరగతికి చెందినవై ఉండి, ఆ రెండు అంశాల్లో కొన్నింటికి సాధారణ సంబంధముంటే ఆ వెన్ చిత్రం ఒక పెద్ద వృత్తంలో రెండు చిన్న వృత్తాలు ఖండించుకునేట్లుగా ఉంటుంది.
ఉదా: తండ్రులు (Fathers), సోదరులు (Brothers) పురుషులు (males)
                           

   
5) రెండు వేర్వేరు అంశాలు మూడో తరగతికి చెంది అవి మూడు స్వతంత్రాలైతే ఆ మూడింటికి చెందిన వెన్ చిత్రం ఒకే రేఖలో మూడు ఖండించుకునే వృత్తాలుగా ఉంటుంది.
ఉదా: ఉపాధ్యాయులు (Teachers), స్త్రీలు, వైద్యులు. 
                               
ఉపాధ్యాయులు,  వైద్యులు వేర్వేరు తరగతులకు చెందినవారు. కానీ, స్త్రీలలో కొందరు ఉపాధ్యాయులు, కొందరు వైద్యులు ఉంటారు.


6) ఇచ్చిన మూడు అంశాలు ఒకదాంతో మరొకదానికి పరస్పరం సంబంధం ఉన్నప్పుడు మూడు వృత్తాలు పరస్పరం ఒకదానితో మరొకటి ఖండించుకుంటున్నట్లుగా ఉంటాయి. అంటే వెన్ చిత్రం మూడు వృత్తాలుగా ఉంటుంది.
ఉదా: విద్యార్థులు, టెన్నిస్ ఫ్యాన్స్, క్రికెట్ ఆడేవారు.
                     
7) ఒక అంశం రెండోదాని తరగతికి చెంది, మూడోది పూర్తిగా రెండింటికీ భిన్నంగా వేరే తరగతికి
చెందినప్పుడు వెన్ చిత్రం...
ఉదా: కుక్కలు, పావురాలు, పక్షులు. పావురాలు అనేవి పక్షులకు చెందినవి.     
కాబట్టి పక్షులనే పెద్ద వృత్తంలో పావురాలనే చిన్న వృత్తం ఉంది. కుక్కలు అనే వృత్తం వేరుగా ఉంటుంది.


8) ఒక అంశం రెండోదానిలో భాగమై మూడోది ఈ రెండింటికి సంబంధించిందై వేరుగా ఉన్న వాటి వెన్ చిత్రం.
ఉదా: స్త్రీలు, తల్లులు, డాక్టర్లు.
                               
సాధారణంగా తల్లి అయిన ప్రతి వ్యక్తి స్త్రీ అవుతుంది. కొద్దిమంది స్త్రీలు డాక్టర్లు కావచ్చు. అలాగే కొంతమంది తల్లులైన స్త్రీలు కూడా డాక్టర్లు కావొచ్చు.


9) మూడు అంశాల్లో ఒకటి రెండోదానిలో భాగమై ఉండి, మూడోది ఈ రెండింటికీ చెందిన తరగతి. వాటి వెన్ చిత్రం.
ఉదా: పురుషులు, శ్రామికులు, తోట
         

శ్రామికుల్లో కొంతమంది పురుషులు ఉంటారు. అలాగే పురుషుల్లో కొంతమంది శ్రామికులుంటారు. ఈ రెండు పరస్పరం ఖండించుకునే వృత్తాలు. తోట అనేది ఈ రెండింటికి చెందింది.

సూచనలు (ప్ర. 1-5 వరకు) : కింది ప్రతి ప్రశ్నలో మూడు పదాలు ఇచ్చారు. వాటి సహజ స్వభావం ఆధారంగా వాటిమధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా వ్యక్తపరిచే వెన్‌ చిత్రాన్ని పైవాటిలో నుంచి ఎన్నుకోండి.

1. దొంగ, నేరస్థుడు, జడ్జి

1) I       2)  II       3)  III       4) IV

2. పురుషులు, పిల్లలు, తండ్రులు

1) I       2)  II       3)  V       4) IV

3. వైద్యులు, స్త్రీలు, తల్లులు

1) III       2)  I       3)  V      4) IV

4. ఆటోమొబైల్స్, కారు, బైకు

1) I       2)  II       3)  III       4) IV

5. కణం, కేంద్రకం, కణజాలం

1) I       2)  II       3)  III      4) పైవేవీకావు


సూచనలు (ప్ర. 6 - 10 వరకు)

కింది ప్రతి ప్రశ్నలో ఇచ్చిన పదాల మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తపరిచే వెన్‌చిత్రాన్ని పైవాటిలో నుంచి ఎన్నుకోండి?

6. బలం, జ్ఞానం, ఉద్వేగం

1) II        2) III        3) IV        4) V

వివరణ: మూడూ వేర్వేరు అంశాలు

                                           సమాధానం: 2


7. ప్రొఫెసర్, పిల్లలు, రచయిత

1) V       2) 5       3) 1         4) II


8. ఇల్లు, ఇటుకలు, బ్రిడ్జి

1) I      2) III         3) IV        4) V

9. బాలురు, విద్యార్థులు, అథ్లెట్స్‌

1) I       2) II         3) III      4) V

వివరణ: కొందరు బాలురు విద్యార్థులు కావొచ్చు, విద్యార్థులు అథ్లెట్స్‌ కావొచ్చు, అథ్లెట్స్‌ బాలురు  కావొచ్చు.

                                    సమాధానం: 2


10. భూమి, అడవులు, పర్వతాలు

1)  IV     2) V         3) II        4) I


11. ఒక తరగతిలో 46 మంది విద్యార్థులున్నారు. అందులో 18 మంది ఫుట్‌బాల్‌ ఆడతారు. 17 మంది క్రికెట్, వీరిలో  ఆరుగురు ఫుట్‌బాల్‌ కూడా ఆడతారు. 16 మంది హాకీ, వీరిలో నలుగురు క్రికెట్‌ కూడా ఆడతారు, కానీ ఫుట్‌బాల్‌ ఆడరు. అయిదుగురు క్యారమ్స్‌ ఆడతారు. కానీ ఏ మైదాన క్రీడను ఆడరు. అయితే పైవాటన్నింటినీ సూచించే పటాన్ని గుర్తించండి?

12. నీటిలో నివసించే జంతువులను, భూమిపై నివసించే జంతువులను పెద్ద వృత్తాలతో, నీటిలో మరియు భూమిపై రెండింటిలోనూ నివసించే జంతువులను చిన్న వృత్తంతో సూచించారు. అయితే ఈ మూడింటి 

మధ్య సంబంధాన్ని సూచించే పటాన్ని గుర్తించండి?


సూచనలు (ప్ర. 13-15 వరకు)

కింది పటాన్ని పరిశీలించి, దాని ఆధారంగా  ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించండి.

13. పై పటంలో గాయకులు కాని భారతీయ నాయకులను సూచించేది?

1) 2         2) 3        3) 4        4) 5

వివరణ: గాయకులు కాకుండా, భారతీయులు మరియు నాయకులు కలిసిన ప్రాంతంలో  '2' ఉంది.     

                                                      సమాధానం: 1

14. గాయకులైన భారతీయ నాయకులను సూచించేది?

1) 2         2)  3        3) 4        4) 5

వివరణ: మూడూ కలిసిన ప్రాంతంలో  '3' ఉంది.

                                                   సమాధానం: 2


15. భారతీయులు కాక, నాయకులు కాక గాయకులు మాత్రమే అయిన వారెందరు?

1) 2         2) 4        3) 6        4) 7

వివరణ: దేనితో సంబంధం లేకుండా గాయకులు మాత్రమే కలిగిన ప్రాంతంలో '7'ఉంది.

                                                   సమాధానం: 4


సూచనలు (ప్ర. 16-19 వరకు)

పటంలో త్రిభుజం గ్రామీణ స్త్రీలను, చతురస్రం నిరుద్యోగ స్త్రీలను, వృత్తం విద్యావంతులైన స్త్రీలను సూచిస్తుంది. దీని ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు తెలపండి.

16. విద్యావంతులైన, ఉద్యోగులైన గ్రామీణ స్త్రీలను సూచించేది ఏది?

1) D     2) E      3) F      4) G

వివరణ: నిరుద్యోగులు కాకుండా విద్యావంతులైన గ్రామీణ స్త్రీలు = G   

                                              సమాధానం: 4


17. విద్యావంతులైన నిరుద్యోగ స్త్రీలను  సూచించేది ఏది?

1) B & C     2) D & E     3) E & F     4) G & E

వివరణ: విద్యావంతులు మరియు నిరుద్యోగ స్త్రీలు = E & F      

                                           సమాధానం: 3

18. విద్యావంతులైన నిరుద్యోగ గ్రామీణ స్త్రీలను సూచించేది ఏది?

1) A    2) B    3) D      4) E

వివరణ: విద్యావంతులు, నిరుద్యోగులైన గ్రామీణ స్త్రీలు = E     

                                          సమాధానం: 4


19. D దేన్ని సూచిస్తుంది?

1) నిరక్షరాస్యులైన గ్రామీణ స్త్రీలను

2) నిరక్షరాస్యులైన, నిరుద్యోగ గ్రామీణ స్త్రీలను

3) విద్యావంతులైన నిరుద్యోగ స్త్రీలను

4) విద్యావంతులైన, ఉద్యోగులైన స్త్రీలను

వివరణ: D అనేది నిరక్షరాస్యులు, నిరుద్యోగ, గ్రామీణ స్త్రీలను సూచిస్తుంది.    

                                        సమాధానం: 2

20. హిందీ (H), ఇంగ్లిష్‌ (E), సంస్కృతం (S) భాషలపై గల పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు 1000 మందిపై నిర్వహించిన సర్వేలో తేలిన విషయాలను కింది పటంలో చూపారు.


ప్ర. మూడు భాషలు మాట్లాడేవారికి, సంస్కృతం అసలు రానివారికి మధ్య నిష్పత్తి ఎంత?

వివరణ: మూడు భాషలు మాట్లాడేవారు = 100

సంస్కృతం రానివారు  =  200 + 220 + 120 = 540 

=> 100/540 = 5/27

                                             సమాధానం: 4

21. ఒక ప్రవేశ పరీక్షలో 80% మంది ఇంగ్లిష్‌లో; 72% మంది రీజనింగ్‌లో ఉత్తీర్ణులయ్యారు. 13% మంది రెండింటిలో ఫెయిల్‌ అయ్యారు. రెండు పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణులైతే, ఆ ప్రవేశ పరీక్షకు మొత్తం హాజరైన వారి సంఖ్య? 

1)  312     2)  480    3) 600     4) చెప్పలేం


 

సూచనలు (ప్ర. 22 - 23 వరకు)

22. ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 30,000 మంది డిపార్ట్‌మెంట్‌ -1లో పని చేస్తారు. 25,000 మంది డిపార్ట్‌మెంట్‌ - 2లో పని చేస్తారు. 16,000 మంది రెండింటిలో పని చేస్తారు. అయితే డిపార్ట్‌మెంట్‌ - 1 లేదా డిపార్ట్‌మెంట్‌ - 2లో ఎంతమంది చేస్తారు?

1)  33,000     2) 35,000    3) 39,000     4) పైవేవీకావు

23. ఎంతమంది డిపార్ట్‌మెంట్‌ - 1 కి మరియు డిపార్ట్‌మెంట్‌ - 2 కి రెండింటికీ పని చేయరు?

1)  11,000     2)  39,000    3)  30,000     4) పైవేవీకావు

24. ఒక సర్వే ప్రకారం 60% మంది బిగ్‌బాస్‌ చూస్తారు. 50% మంది జబర్దస్త్‌ చూస్తారు. 47% ఢీ షో చూస్తారు. 28% మంది బిగ్‌బాస్, జబర్దస్త్‌ రెండింటినీ చూస్తారు. 23% మంది బిగ్‌బాస్, ఢీ షోలను చూస్తారు. 18% మంది జబర్దస్త్, ఢీ షోలను చూస్తారు. 8% మంది మూడింటినీ చూస్తారు. అయితే దేన్ని చూడని వారి శాతం ఎంత?

1)  4%     2)  3%     3)  10%      4) పైవేవీకావు

Posted Date : 06-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌