• facebook
  • whatsapp
  • telegram

లాజికల్ వెన్ చిత్రాలు

రెండో రకం వెన్ చిత్రాలు: ఈ రకం ప్రశ్నల్లో ఒక వెన్ చిత్రం ఇస్తారు. ఆ వెన్ చిత్రంలో ఉన్న వివిధ జ్యామితీయ చిత్రాలు వివిధ అంశాలకు చెందినవిగా ఉంటాయి. ఆ వెన్ చిత్రాన్ని పూర్తిగా చదివి దానికి సంబంధించిన ప్రశ్నలకు తగిన విధంగా జవాబులివ్వాలి.
            కింది వెన్ చిత్రంలో మూడు రకాల మనుషులున్నారు. త్రిభుజం స్కూల్ టీచర్లను, చతురస్రం పెళ్లైనవారిని, వృత్తం ఉమ్మడి కుటుంబంలో నివసించే వారిని సూచిస్తాయి.
                          

1. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ వివాహమై, స్కూల్ టీచర్లు కానివారిని సూచించే ప్రాంతం ఏది?
జవాబు:  ఈ ప్రశ్నలో ఉమ్మడి కుటుంబంలో ఉండి వివాహమైన అంటే చతురస్రం, వృత్తంలో ఉండాలి. కానీ వారు స్కూల్ టీచర్లు కాకూడదు. అంటే త్రిభుజంలో ఉండకూడదు. ఆ ప్రాంతం D అవుతుంది.
 

2. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ పెళ్లికానివారు, స్కూల్ టీచర్లు కాని వారిని సూచించే ప్రాంతం ఏది?
జవాబు:  ఈ ప్రశ్నలో పెళ్లికానివారు, స్కూల్ టీచర్లుకానివారు అంటే చతురస్రంలోగాని, త్రిభుజంలో గానీ ఉండకూడదు. అంటే వృత్తంలో మాత్రమే ఉండే ప్రాంతం E అవుతుంది.
 

3. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ, వివాహమైన ఉపాధ్యాయులను సూచించే ప్రాంతం ఏది?
జవాబు:  ఈ ప్రశ్నలో ఉమ్మడి కుటుంబంలో ఉంటూ వివాహమైన ఉపాధ్యాయులు అంటే మూడు ప్రాంతాలు కలిసింది. అంటే B అవుతుంది.
 

4. స్త్రీలు, టీచర్లు, డాక్టర్లు ఈ ముగ్గురికి మధ్య సంబంధాన్ని సూచించే వెన్ చిత్రం ఏది?
జవాబు: అవుతుంది. ఈ ప్రశ్నలోని స్త్రీలు కొంతమంది డాక్టర్లు, మరికొంతమంది టీచర్లు. మిగతా గ్రూపుల్లో కూడా స్త్రీలు ఉంటారు.
                            
 

5. టెన్నిస్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్, విద్యార్థుల మధ్య సంబంధాన్ని సూచించే వెన్ చిత్రం ఏది?
జవాబు: అవుతుంది. ఈ ప్రశ్నలో కొంతమంది విద్యార్థులు క్రికెట్ ప్లేయర్స్ మరికొంతమంది విద్యార్థులు టెన్నిస్ ప్లేయర్స్. మరికొంతమంది ఇతర ఆటల ప్లేయర్స్ ఉండవచ్చు.

                    
 

6. ఏనుగులు, జింకలు, జంతువుల మధ్య సంబంధాన్ని తెలియజేసే వెన్ చిత్రం ఏది?
జవాబు: అవుతుంది. ఈ ప్రశ్నలో ఏనుగులు, జింకలు అనేవి జంతువుల్లో ఉంటాయి. కానీ అవి రెండు వేర్వేరు గ్రూప్‌లకు చెందినవి.
                       

 

7. స్త్రీలు, తల్లులు, భర్తను కోల్పోయినవారు (Widows) వీరి మధ్య సంబంధాన్ని తెలియజేసే వెన్ చిత్రమేది?
జవాబు:  అవుతుంది.
ఈ ప్రశ్నలో తల్లి కావాలంటే తప్పకుండా స్త్రీ అయి ఉండాలి. కొంతమంది తల్లులు భర్తలను కోల్పోయి ఉండొచ్చు. కొంతమంది స్త్రీలు తల్లులు కాకపోవచ్చు.     

 

8. న్యాయవాదులు, దొంగలు, క్రిమినల్స్‌ను సూచించే వెన్ చిత్రం ఏది?
జవాబు:   అవుతుంది. ఈ ప్రశ్నలో దొంగలందరూ క్రిమినల్స్ అవుతారు. న్యాయవాదులకు వీటితో సంబంధం లేదు. 
                                   
 

9. కింది వెన్ చిత్రంలో మూడు రకాల తరగతులకు చెందిన ఆటలు ఉన్నాయి. దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
                                       

i) పై పటంలో అన్ని ఆటలను సూచించే అక్షరం ఏది?
జవాబు: (c) అవుతుంది. ఈ ప్రశ్నలో అన్ని ఆటలను సూచించే అక్షరం c అవుతుంది.

 

ii) పై పటంలో టెన్నిస్, వాలీబాల్ ఆటలను సూచించేది, బ్యాడ్మింటన్‌ను సూచించని అక్షరం ఏది?
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో బ్యాడ్మింటన్ ఆడనివారు అంటే అందులో లేకుండా మిగిలిన రెండు వృత్తాల్లో ఉమ్మడి భాగాన్ని సూచించే అక్షరం b అవుతుంది.
 

iii) పై పటంలో టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడి వాలీబాల్ ఆడనివారిని సూచించే అక్షరం ఏది?
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో వాలీబాల్ ఆడనివారు అంటే మిగిలిన రెండు వృత్తాల్లో ఉండే అక్షరం d అవుతుంది.


 

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌