• facebook
  • whatsapp
  • telegram

లాజికల్ వెన్ చిత్రాలు

1. ఏనుగులు, జంతువులు, ఒంటెలు-
జ:  
వివరణ:   ఏనుగులు, ఒంటెలు రెండూ జంతువుల వర్గానికి చెందినవి. ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. 
                 

2. డాక్టర్, మనిషి, నటుడు-
జ:  
వివరణ:   డాక్టర్, నటుడు రెండు పదాలూ మనిషి వర్గానికి చెందినవి. డాక్టర్లలో మహిళలు కూడా ఉంటారు. కాబట్టి అందరూ పురుషులు కాకూడదు.
                 

3. సైన్స్, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం-
జ: 
వివరణ: 
భౌతిక, రసాయన శాస్త్రాలు రెండూ సైన్స్ విభాగానికి సంబంధించిన సబ్జెక్టులు. 
             

4. ఉపాధ్యాయుడు, కవి, గ్రాడ్యుయేట్-
జ:    


వివరణ:   కొంతమంది ఉపాధ్యాయుల్లో కవులు ఉండవచ్చు. కొంతమంది గ్రాడ్యుయేట్లలో కవులు ఉండవచ్చు. 


                    
5. తోడేలు, కుక్కలు, కుక్కపిల్లలు-
జ:  
వివరణ:  కుక్కపిల్లలన్నీ కుక్కలవుతాయి. తోడేలు కుక్క వర్గానికి చెందింది. ఈ మూడింటిని  
                        

6. వయసు, సంఖ్య, పదమూడు-
జ:  
వివరణ:   దీంట్లో పదమూడుతో సంఖ్యకు, వయసుకు సంబంధం ఉంటుంది. కానీ సంఖ్యకు, వయసుకు ఎలాంటి సంబంధం లేదు. 
                       

7. దేశం, నేపాల్, ఇండియా-
జ:    
వివరణ:  నేపాల్, ఇండియా వేర్వేరు దేశాలు. ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి. 

                   
8. ప్రిన్సిపల్, విద్యార్థి, పేరెంట్-
జ: 


వివరణ:   పేరెంట్స్‌లో కొంతమంది ప్రిన్సిపల్స్ ఉంటారు. మరి కొందరు కాదు. అంటే ఈ రెండింటిలో కొంత భాగం మాత్రమే కలిసి ఉంటుంది. విద్యార్థికి ఎలాంటి సంబంధం ఉండదు. 
                                

9. దొంగ, నేరస్థుడు (క్రిమినల్), పోలీస్-
జ:  
వివరణ:  నేరస్థుడు అంటే దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేసేవాడు. దొంగ నేరస్థుడులో భాగం. పోలీస్‌కు, ఈ రెండు పదాలకు ఎలాంటి సంబంధం ఉండదు. 
                             

 

10. నల్ల జుట్టు మనిషి, పొడవైన మనిషి, భారతీయుడు-
జ:  
వివరణ:   నల్ల జుట్టు మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉండవచ్చు. పొడవైన వారిలో కొందరు నల్లజుట్టున్నవారు భారతదేశంలో ఉండవచ్చు లేదా ఇతర దేశాల్లో ఉండవచ్చు. 
                          

11. దొంగలు, నేరస్థులు, లాయర్లు-
జ:  
వివరణ:   క్రిమినల్స్‌లో దొంగ ఒక భాగం. లాయర్లకు ఎలాంటి సంబంధం ఉండదు.  
 
                   
12. టెన్నిస్ ఫ్యాన్స్, క్రికెట్ ఆటగాళ్లు, విద్యార్థులు-
జ: 


వివరణ:  విద్యార్థుల్లో కొందరు టెన్నిస్ ఫ్యాన్స్, కొందరు క్రికెట్ ఆడేవారు ఉంటారు. క్రికెట్ ఆడేవారిలో కొందరు విద్యార్థులు మరియు కొందరు టెన్నిస్ ఫ్యాన్స్ ఉండవచ్చు. 
                     

13. ద్రావణాలు, పాలు, సముద్రం నీరు-
జ:     
వివరణ: పాలు, సముద్రపు నీరు రెండూ ద్రావణాలే. కానీ ఈ రెండు కలిసి ఉండవు. కాబట్టి ఈ రెండు వేర్వేరుగా ఉంటూ ద్రావణాల్లో మాత్రమే ఉంటాయి. 
   
                     
14. క్రికెట్ ఫ్యాన్స్, ఆంకుళ్లు, ఆంటీలు-
జ:       
వివరణ:   అంకుళ్లలో అందరూ పురుషులు, ఆంటీల్లో స్త్రీలు మాత్రమే ఉంటారు. పురుషులకు, స్త్రీలకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ అంకుళ్లలో కొందరు క్రికెట్ ఫ్యాన్స్ ఉండవచ్చు. స్త్రీలు కూడా కొందరు క్రికెట్ ఫ్యాన్స్ ఉండవచ్చు. అంటే క్రికెట్ ఫ్యాన్స్‌లో కొంత భాగం స్త్రీలు, కొంత భాగం పురుషులు ఉంటారు. అయితే, ఈ రెండు పదాలకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. 
                          

15-18: కింది వెన్ చిత్రాల్లో వృత్తం- ఉమ్మడి కుటుంబాలను, త్రిభుజం- స్కూల్‌టీచర్లను, చతురస్రం- పెళ్త్లెనవారిని సూచిస్తుంది. 
                                                 

15. పెళ్త్లె ఉమ్మడి కుటుంబాల్లో లేని స్కూల్ టీచర్లు ఎవరు?
జ:   C  
వివరణ: ఉమ్మడి కుటుంబాల్లో లేని వారంటే తప్పక వృత్తంలో ఉండకూడదని అర్థం. పెళ్త్లెన స్కూల్ టీచర్లు అంటే చతురస్రం, త్రిభుజంలో ఉమ్మడిగా ఉండాలి. ఇచ్చిన పటంలో అలాంటి వారు C మాత్రమే ఉన్నారు. 

16. ఉమ్మడి కుటుంబాల్లో ఉండి పెళ్లికానివారు, స్కూల్ టీచర్లు కానివారు ఎవరు?
జ:    E   
వివరణ:  ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నారంటే వృత్తంలో తప్పక ఉండాలి. పెళ్లికాని మరియు స్కూల్ టీచర్లు కాని అంటే చతురస్రం, త్రిభుజంలో ఉండకూడదు. వృత్తంలో మాత్రమే ఉండాలి. ఇచ్చిన పటంలో అలాంటి వారు E మాత్రమే ఉన్నారు.

17. పెళ్త్లె ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న స్కూల్ టీచర్లు ఎవరు?
జ:    
వివరణ:  ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నారంటే వృత్తంలో తప్పక ఉండాలి. పెళ్త్లెన స్కూల్ టీచర్లు అంటే చతురస్రం, త్రిభుజంలో కూడా ఉండాలి. అంటే, ఈ మూడింటిలో ఉమ్మడిగా ఉండే వారని అర్థం. ఇచ్చిన పటంలో ఈ మూడింటిని సూచించే వారు B మాత్రమే.

18. పెళ్త్లె ఉమ్మడి కుటుంబాల్లో ఉండి స్కూల్ టీచర్లు కానివారు ఎవరు?
జ:    D
వివరణ:   ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నారంటే వృత్తంలో తప్పక ఉండాలి. స్కూల్ టీచర్లుకాని అంటే త్రిభుజంలో తప్పక ఉండకూడదు. పెళ్త్లెన వారు అంటే చతురస్రంలో తప్పక ఉండాలి. వృత్తం, చతురస్రంలో ఉమ్మడిగా ఉంటూ త్రిభుజంలో ఉండకూడదు. ఇచ్చిన పటంలో ఈ నియమం కింద D మాత్రమే ఉన్నారు.

19. బంగాళ దుంప, వంకాయ, కూరగాయలు
జ:     
వివరణ:    బంగాళదుంప, వంకాయ, వేర్వేరు కూరగాయలు. ఈ రెండూ పూర్తిగా కూరగాయల్లో ఉంటాయి.    

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌