అక్షరాల స్థానాలను బట్టి వాటి విలువలను తీసుకుని కోడ్ చేస్తారు.
ఉదా:
I) A = 1, B = 2, C= 3, C = 4 ......... Z= 26
స్థాన విలువలను తీసుకున్నారు.
II) A = 2, B = 3, C = 4, D= 5 ......... Z = 27
స్థాన విలువ +1గా తీసుకున్నారు.
III) A = 2, B = 4, C = 6, D = 8......... Z = 52
స్థానవిలువ x 2 గా తీసుకున్నారు.
IV) A = 1, B = 3, C = 5, D = 7......... Z = 51
స్థాన విలువ ´ x 2 - 1
V) A = 1, B = 2, ....... I = 9, J = 1, K= 2, L= 3 ..... T = 2, .... Z = 8
స్థాన విలువలోని అంకెల మొత్తాన్ని తీసుకున్నారు.


మాదిరి ప్రశ్నలు
1. ఒక కోడ్ భాషలో ఆకాశం అంటే నీరు అని, నీరు అంటే నేల అని, నేల అంటే దుమ్ము అని, దుమ్ము అంటే నక్షత్రాలు అని, నక్షత్రాలు అంటే మేఘాలు అని కోడ్ చేస్తే, చేప ఎక్కడ నివసిస్తుంది?
1) నీటిలో 2) నేలపై 3) దుమ్ములో 4)మేఘాల్లో
వివరణ:
* మొదట సహజమైన జవాబును చూడాలి.
చేప నీటిలో నివసిస్తుంది.
* నీటిని ఇక్కడ ఎలా కోడ్ చేశారో చూడాలి.
నీరు అంటే నేల అన్నారు.
కాబట్టి జవాబు నేలపై.
2. ఒక కోడ్ భాషలో ఆరెంజ్‌ను వెన్న అని, వెన్నను సబ్బు అని, సబ్బును ఇంక్ అని, ఇంక్‌ను తేనె అని, తేనెను పెరుగు అని కోడ్ చేస్తే, బట్టలు ఉతికేందుకు దేన్ని ఉపయోగిస్తారు?
1) సబ్బు 2) ఇంక్ 3) ఆరెంజ్ 4) పెరుగు
వివరణ:
* బట్టలు ఉతకడానికి ‘సబ్బును’ ఉపయోగిస్తారు.
* సబ్బును ఇంక్ అని కోడ్ చేశారు కాబట్టి
జవాబు ఇంక్ అవుతుంది.